Indiramma Housing Scheme : తెలంగాణ ప్రజలకు మరో గుడ్ న్యూస్, ఇందిరమ్మ ఇళ్ల పథకంలో వారికి రూ.6 లక్షలు
11 March 2024, 16:30 IST
- Indiramma Housing Scheme : తెలంగాణ ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో మరో హామీని అమలు చేసింది. భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షలు ఆర్థిక సాయం అందించనున్నారు. గిరిజనులు, దళితులకు రూ.6 లక్షలు ఇస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్ ప్రకటించారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభం
Indiramma Housing Scheme : తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ సర్కార్ (Congress Govt)మరో గుడ్ న్యూస్ చెప్పింది. సోమవారం భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని(Indiramma Housing Scheme) సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షలు ఆర్థిక సాయం(Financial Assistance) అందించనున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) మాట్లాడుతూ...ఇందిరమ్మ ఇళ్ల పథకంలో గిరిజనులు, దళితులకు మరో రూ.లక్ష అదనంగా కలిపి మొత్తంగా రూ.6 లక్షలు ఇస్తామని ప్రకటించారు. సీతారామచంద్రస్వామి సన్నిధిలో ఇళ్ల కార్యక్రమానికి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. ప్రతీ నియోజకవర్గానికి 3500 చొప్పున అర్హులైన అందరికీ ఇళ్లు రాబోతున్నాయన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గత పదేళ్లుగా పేదలకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని విమర్శించారు.
భద్రాచలం అభివృద్ధికి ప్రణాళిక
తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోనేందుకు ఎన్నికల హామీలైన ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లో కూడా పథకాలు అమలుచేస్తున్నామన్నారు. ఎవరి మెప్పు కోసమో పథకాలు(Welfare Schemes) అమలు చేయడంలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాని, బీఆర్ఎస్ కు(BRS) తేడా గమనించాలన్నారు. కాంగ్రెస్ సర్కార్ ప్రతీ పైసా పేదల కోసమే ఖర్చు చేస్తుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం దోచుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. భద్రాచలం(Bhadrachalam) అభివృద్ధికి గత కాంగ్రెస్ ప్రభుత్వమే నిధులు ఇచ్చిందన్నారు. గోదావరిపై బ్రిడ్జి, మంచినీటి సదుపాయం, భద్రాచలం అభివృద్ధికి గత కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రణాళిక సిద్ధం చేస్తామన్నారు.
గత ప్రభుత్వం కట్టిన ఇళ్లకు త్వరలో పట్టాలు
గత ప్రభుత్వాలు నిర్మించిన ఇళ్లకు కూడా త్వరలోనే పట్టాలిస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించామన్నారు. సొంతింటి కల సాకారం కోసం పదేళ్లుగా తెలంగాణ ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను 90 రోజుల్లోనే అమలు చేస్తున్నామని అన్నారు. రాష్ట్ర ప్రజల బాధలు చూసే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను(Congress Six Gaurantees) ప్రకటించిందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పదేళ్ల పాలనలో పేదవాడికి సొంతిల్లు కూడా ఇవ్వలేకపోయారన్నారు. భద్రాచలం అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. భద్రాద్రి రాముడిని సైతం కేసీఆర్ మోసం చేశారన్నారు. ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు ఇస్తామని ప్రకటించి ఇవ్వలేదన్నారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణను అప్పుల ఉబిలో నెట్టారని విమర్శించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రూ.7 లక్షల కోట్ల అప్పు చేశారని ఆరోపించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు(Double Bedroom Houses) పేరుతో పేదలను మోసం చేశారన్నారు.