తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Wtc Final 2023 : ఏంది బ్రో.. ఇదేం ఆట.. ఇలాగేనా ఆడేది? ఐసీసీ ట్రోఫీ గెలిచే ఫేసులేనా?!

WTC Final 2023 : ఏంది బ్రో.. ఇదేం ఆట.. ఇలాగేనా ఆడేది? ఐసీసీ ట్రోఫీ గెలిచే ఫేసులేనా?!

Anand Sai HT Telugu

12 June 2023, 11:09 IST

google News
    • WTC Final 2023 : టీమిండియా ఐసీసీ ట్రోఫీ ఓడిపోయింది. దీంతో చాలా మంది విమర్శలు గుప్పిస్తున్నారు. సరిగా ఆడితే.. గెలిచేవాళ్లమని చెబుతున్నారు. ఇక క్రికెట్ లవర్స్ అయితే బాగా హర్ట్ అయిపోయారు.
ఓటమిపై ఫ్యాన్స్ ఫైర్
ఓటమిపై ఫ్యాన్స్ ఫైర్ (ICC)

ఓటమిపై ఫ్యాన్స్ ఫైర్

దశాబ్ద కాలంగా ఐసీసీ ట్రోఫీ(ICC Trophy) కోసం ఎదురుచూస్తోంది భారత జట్టు. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్(WTC Final) కూడా ఓడిపోయింది. ఇంగ్లండ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా చేతిలో 209 పరుగుల తేడాతో ఓడింది. మ్యాచ్ మెుదలుకు ముందు నుంచే పేస్ కు అనుకూలించే.. పరిస్థితుల్లో ఆసీస్ ఫేవరెట్ అని చాలా మంది అన్నారు. అయినా సరే భారత్ ను మాత్రం పూర్తిగా తీసిపారేయలేదు.

అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి.. బౌలింగ్ ఎంచుకోవడం టీమిండియా(Team India) చేసిన అతి పెద్ద తప్పు. దీనికితోడు.. తొలి రోజు ఆటలో బౌలర్లు దారుణంగా ఫెయిల్ అయ్యారు. ఈ కారణంగా ఆసీస్ భారీ స్కోరు చేసింది. చివరకు 444 పరుగుల టార్గెట్ ఛేజ్ చేయాల్సి వచ్చింది. ఈ సమయంలోనూ భారత బ్యాటర్స్ సరిగా ఆడలేదు. దీంతో చాలా మంది మాజీలు మండిపడుతున్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్ ఓడిపోవడం కంటే.. ఓడిపోయిన విధానం, కారణం ఇబ్బంది కలిగిస్తున్నాయి.

రెండో ఇన్నింగ్స్ లో భారీ స్కోరు ఛేజ్ చేసేందుకు బరిలో దిగిన భారత్.. మెుదట్లోనే శుభ్ మన్ గిల్(Shubman Gill).. వికెట్ కోల్పోయింది. రోహిత్(Rohit) మంచి టచ్ లో కనిపించడంతో ఫ్యాన్స్ కాస్త ఆశలు పెంచుకున్నారు. అయితే తన మీద ఆశలు పెట్టుకోవద్దని.. మరోసారి రోహిత్ ప్రూవ్ చేశాడు. లియాన్ బౌలింగ్ లో చెత్త షాట్ ఆడి.. ఔటయ్యాడు. కాసేపు చెలరేగిన పూజారా కూడా దారుణంగా ఫెయిలయ్యాడు. అప్పర్ కట్ కు ట్రై చేసి.. కీపర్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

ఇక నాలుగో రోజు.. ఆటలో పట్టుదలగా ఆడిన విరాట్ కోహ్లీ(Virat Kohli) కూడా నిరాశపరిచాడు. ఐదో రోజు ఆట మెుదలైన కాసేపటికి.. ఆఫ్ స్టంప్ కు చాలా దూరంగా.. పడిన బంతిని డ్రైవ్ చేయబోయి.. స్లిప్స్ లో క్యాచ్ ఇచ్చాడు. రవీంద్ర జడేజా(Ravindra Jadeja), శార్దూల్ ఠాకూర్.. కూడా అట్టర్ ఫ్లాప్ షో ఇచ్చారు. చివరకు రహానే కూడా ఔటయ్యాడు. వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ కాసేపు ఆడినట్టే కనిపించి.. తర్వాత పెవిలియన్ చేరాడు.

ఇదంతా చూసిన ఫ్యాన్స్.. ఎక్స్ పర్ట్స్ అందరూ టీమిండియాపై మండిపడుతున్నారు. సీనియర్ ఆటగాళ్ల ఆట మీద విమర్శలు చేస్తున్నారు. అసలు సీనియర్లు ఆడే ఆట తీరేనా ఇది అని అంటున్నారు. ఐసీసీ ట్రోఫీ గెలిచే ఫేసులేనా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. సీనియర్లు ఇంత నిర్లక్ష్యంగా ఆడితే ఎలా? అని ప్రశ్నిస్తున్నారు

డబ్ల్యూటీసీ ఫైనల్(WTC Final) వంటి మ్యాచుల్లో ఎలా ఆడాలో కూడా టీమిండియా సీనియర్లకు తెలియడం లేదని, పరమ చెత్త షాట్లు ఆడి వికెట్లు పారేసుకున్నారని, సునీల్ గవాస్కర్ వంటి వాళ్లు ఘాటుగా విమర్శలు చేస్తున్నారు.

తదుపరి వ్యాసం