WTC Final 2023 : భారత్ ఎక్కడ తడబడింది? డబ్ల్యూటీసీ ఫైనల్ ఓడిపోడానికి 5 కారణాలు-wtc final 2023 why team india lost the wtc final 2023 against australia heres 5 reasons ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Wtc Final 2023 : భారత్ ఎక్కడ తడబడింది? డబ్ల్యూటీసీ ఫైనల్ ఓడిపోడానికి 5 కారణాలు

WTC Final 2023 : భారత్ ఎక్కడ తడబడింది? డబ్ల్యూటీసీ ఫైనల్ ఓడిపోడానికి 5 కారణాలు

Anand Sai HT Telugu
Jun 12, 2023 06:14 AM IST

WTC Final 2023 : డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో, భారత్ టాస్ గెలిచింది తప్ప మొత్తం మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆధిపత్యం చెలాయించింది. అయితే ఇండియా ఓడిపోయేందుకు కారణాలు ఏంటి?

రోహిత్ శర్మ
రోహిత్ శర్మ (ICC)

ఐసీసీ టోర్నీని గెలవాలన్న టీమిండియా చాలా రోజుల కల ఆదివారంతో ముగిసింది. ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్‌లో భారత్.. ఆస్ట్రేలియా (Ind vs Aus) చేతిలో ఓడిపోయింది. తొలిరోజు మ్యాచ్‌లో ఆధిపత్యం చెలాయించిన కంగారూలు.. టీమిండియాకు పునరాగమనానికి ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు. ఐదో రోజు విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే కలిసి మ్యాచ్‌ని గట్టెక్కిస్తారని అందరూ ఊహించారు. అయితే రహానే అద్భుత ఇన్నింగ్స్‌ మినహా మరే ఇతర ఆటగాడు కూడా విజయం కోసం ఆవేశాన్ని ప్రదర్శించలేదు. తద్వారా వరుసగా రెండోసారి ఛాంపియన్‌గా నిలిచే అవకాశాన్ని టీమిండియా(Team India) కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఓటమికి అనేక కారణాలు ఉన్నాయి, ఇక్కడ టాప్ 5 కారణాల గురించి కొన్ని వివరాలు ఉన్నాయి.

ఈ మ్యాచ్‌లో భారత్‌ టాస్‌ గెలుపొందడం మినహా మొత్తం మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆధిపత్యం చెలాయించింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 469 పరుగులు చేయగా, టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 296 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్‌ను ఎనిమిది వికెట్లకు 270 పరుగుల వద్ద డిక్లేర్ చేసి భారత్‌కు 444 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ భారీ లక్ష్యం ముందు టీమిండియా కేవలం 234 పరుగులకే ఆలౌటయి ఘోర పరాజయాన్ని చవిచూసింది.

ముందుగా ఈ మ్యాచ్‌లో భారత జట్టు బౌలింగ్ రాణించలేదు. స్టీవ్‌ స్మిత్‌(Steve Smith), ట్రావిస్‌ హెడ్‌ను టీమ్‌ ఇండియా బౌలర్‌ ఎవరూ నియంత్రించలేకపోయారు. కానీ భారత్ తొలి ఇన్నింగ్స్‌లో శుభారంభం చేసి ఆస్ట్రేలియా మూడు వికెట్లను త్వరగానే బోల్తా కొట్టించింది. దీని తర్వాత మళ్లీ స్మిత్, హెడ్ భారత బౌలర్ల లయను చెడగొట్టారు. తొలిరోజు పాడైపోయిన రిథమ్‌ను పునరుద్ధరించలేకపోయారు.

ఆస్ట్రేలియా భారీ స్కోరు చేయడంతో భారత బ్యాట్స్‌మెన్ కూడా పరుగులు చేస్తారని అంతా భావించారు. కానీ రెండో రోజు టీమ్ ఇండియా బ్యాటింగ్ విభాగం కుప్పకూలింది. రోహిత్ శర్మ(Rohit Sharma) లేదా విరాట్ కోహ్లీతో పాటు టెస్టు స్పెషలిస్ట్ ఛెతేశ్వర్ పుజారా కూడా పరుగులు చేయడంలో విఫలమయ్యారు.

టీమ్ ఇండియా తరఫున అజింక్య రహానే(ajinkya rahane) మూడో రోజు స్వల్ప పోరాటం చేసినా, సెంచరీకి చేరువలో తడబడడంతో టీమ్ ఇండియా 300 పరుగులు కూడా చేయలేకపోయింది. ఈ మ్యాచ్‌లో భారత్ తరఫున ఇద్దరు బ్యాట్స్‌మెన్ మాత్రమే హాఫ్ సెంచరీలు సాధించారు. వారే అజింక్యా రహానే, శార్దూల్ ఠాకూర్. వీరిద్దరూ తొలి ఇన్నింగ్స్‌లో అర్ధశతకాలు సాధించారు.

నాలుగో రోజు భారత బౌలర్లు ఆస్ట్రేలియా వికెట్లను చేజార్చుకోవాల్సి వచ్చింది. కానీ ఈ పని సాధ్యం కాకపోవడంతో భారత్‌కు 444 పరుగుల భారీ లక్ష్యం లభించింది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్‌కు రోహిత్, శుభ్‌మన్ గిల్ శుభారంభం ఇస్తారని భావించినా అది కుదరలేదు. ఈ ఇన్నింగ్స్‌లో పుజారా కూడా బ్యాడ్ షాట్ ఆడి ఔటయ్యాడు.

ఐదో రోజు భారత్ విజయానికి 280 పరుగులు చేయాల్సి ఉండగా.. గత కొన్నేళ్లుగా టెస్టుల్లో టీమిండియా చూపిన పోరాట పటిమ చూస్తుంటే ఈ పని సాధ్యమే అనిపించింది. విరాట్ కోహ్లి(Virat Kohli), రహానే కూడా ఓ కారణం. కానీ కోహ్లీ ఔట్ కావడంతో రహానే కూడా ఎక్కువ సేపు వికెట్ పై నిలువలేకపోయాడు.

Whats_app_banner