తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Wasim Akram To Team India: ఆస్ట్రేలియాకు ఇలా చెక్ పెట్టండి.. టీమిండియా బౌలర్లకు వసీం అక్రమ్ సలహా

Wasim Akram To Team India: ఆస్ట్రేలియాకు ఇలా చెక్ పెట్టండి.. టీమిండియా బౌలర్లకు వసీం అక్రమ్ సలహా

Hari Prasad S HT Telugu

05 June 2023, 21:58 IST

google News
    • Wasim Akram To Team India: ఆస్ట్రేలియాకు ఇలా చెక్ పెట్టండి అంటూ టీమిండియా బౌలర్లకు వసీం అక్రమ్ సలహా ఇచ్చాడు. బుధవారం (జూన్ 7) నుంచి ఆ జట్టుతో డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనున్న విషయం తెలిసిందే.
ఓవల్ గ్రౌండ్ లో ప్రాక్టీస్ సందర్భంగా రోహిత్ శర్మ
ఓవల్ గ్రౌండ్ లో ప్రాక్టీస్ సందర్భంగా రోహిత్ శర్మ (ICC Twitter)

ఓవల్ గ్రౌండ్ లో ప్రాక్టీస్ సందర్భంగా రోహిత్ శర్మ

Wasim Akram To Team India: ఆస్ట్రేలియాతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ కు ముందు టీమిండియా బౌలర్లకు ఓ కీలకమైన సలహా ఇచ్చాడు పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్. ఈ మ్యాచ్ ఓవల్ మైదానంలో జరగనున్న నేపథ్యంలో అక్కడ లభించే బౌన్స్, స్వింగ్ తో మరీ ఎక్కువ ఉత్సాహం చూపించాల్సిన అవసరం లేదని అన్నాడు.

టెస్టుల్లో నంబర్ వన్ అయిన ఇండియా, నంబర్ 2 ఆస్ట్రేలియా మధ్య బుధవారం (జూన్ 7) నుంచి డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో తటస్థ వేదిక అయిన ఇంగ్లండ్ లోని ఓవల్ గ్రౌండ్ లో జరగనుంది. అయితే 140 ఏళ్ల ఓవల్ గ్రౌండ్ చరిత్రలో జూన్ లో ఓ టెస్ట్ మ్యాచ్ జరగనుండటం ఇదే తొలిసారి. దీంతో ఈ అంశాన్ని కూడా మాజీ క్రికెటర్లు ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు.

అక్రమ్ కూడా దీనిపై స్పందించాడు. "టీమిండియా పేసర్లు అనుభవజ్ఞులు. వాళ్లు కొత్త బంతితో వేసే సమయంలో మరీ అంత ఉత్సాహం చూపించకూడదు. తొలి 10, 15 ఓవర్ల పాటు బాగా స్వింగ్ అవుతుందని అందరికీ తెలుసు. అందుకే ఆ 10, 15 ఓవర్లు ఓ ఫాస్ట్ బౌలర్ గా అదనపు పరుగులు ఇవ్వకూడదు. మొదట్లో కాస్త బౌన్స్ లభించిందని ఉత్సాహపడకండి. ఆస్ట్రేలియన్లకు కావాల్సింది అదే" అని అక్రమ్ అన్నాడు.

ఇక ఓవల్లో జూన్ టెస్ట్ పై స్పందిస్తూ.. "ఈ పిచ్ సాధారణంగా ఉపఖండ జట్లకు అనుకూలిస్తుంది. కానీ మేము ఎప్పుడు ఇక్కడికి వచ్చినా ఆగస్ట్ చివర్లో లేదంటే సెప్టెంబర్ మొదట్లో మ్యాచ్ ఉండేది. కానీ ఇది జూన్ లో ఉంది. పిచ్ భిన్నంగా ఉంది. తాజాగా ఉంది. ఇక డ్యూక్స్ బంతి కావడంతో ఇది పూర్తి భిన్నంగా ఉండనుంది" అని అక్రమ్ అభిప్రాయపడ్డాడు.

ప్రస్తుతం అక్కడి కండిషన్స్ కు బాగా అలవాటు పడిన బ్యాటర్ కేవలం చెతేశ్వర్ పుజారానే. అతడు కొంతకాలంగా ససెక్స్ కౌంటీ జట్టుకు ఆడుతున్నాడు. అయితే ఆస్ట్రేలియాలో జట్టులో మాత్రం లబుషేన్, స్టీవ్ స్మిత్, బౌలర్ మైఖేల్ నెసర్ లాంటి వాళ్లు ససెక్స్ టీమ్ కు ఆడుతూ.. అనుభవం సంపాదించారు.

తదుపరి వ్యాసం