Wasim Akram on Kohli: కోహ్లి, రోహిత్ గొప్ప ప్లేయర్సే కానీ.. ఆ బాల్స్ ఆడలేరు: వసీం అక్రమ్
Wasim Akram on Kohli: కోహ్లి, రోహిత్ గొప్ప ప్లేయర్సే కానీ.. ఆ బాల్స్ ఆడలేరు అంటూ పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ అన్నాడు. ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో మిచెల్ స్టార్క్ బౌలింగ్ లో టీమిండియా టాపార్డర్ కుప్పకూలిన విషయం తెలిసిందే.

Wasim Akram on Kohli: లెఫ్టామ్ పేస్ బౌలర్లను ఎదుర్కోలేని తమ బలహీనతను మరోసారి బయటపెట్టుకున్నారు టీమిండియా బ్యాటర్లు. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో మిచెల్ స్టార్క్ బౌలింగ్ ను ఎదుర్కోలేక చేతులెత్తేశారు. దీంతో స్వదేశంలో ఆస్ట్రేలియాపై టీమిండియా తమ అత్యల్ప స్కోరు (117) నమోదు చేసింది. ఈ స్కోరును ఆ తర్వాత ఆస్ట్రేలియా కేవలం 11 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా చేజ్ చేయడం భారత అభిమానులకు మింగుడు పడనిదే.
నిజానికి లెఫ్టామ్ పేసర్లను ఎదుర్కోలేకపోవడం ఇప్పటి సమస్య కాదు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో మహ్మద్ ఆమిర్, 2019 వరల్డ్ కప్ సెమీఫైనల్లో ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్ లో టీమిండియా చేతులెత్తేసింది. ఈ నేపథ్యంలో మరోసారి తమ బలహీనతను చాటుకున్న ఇండియన్ బ్యాటర్లు పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
"విరాట్ కోహ్లి, రోహిత్, కేఎల్ రాహుల్.. వీళ్లంతా గొప్ప ప్లేయర్సే. గత మ్యాచ్ లో రాహుల్ ఇండియాను గెలిపించాడు. లెఫ్టార్మర్ ఆ యాంగిల్లో బౌలింగ్ చేస్తే వాళ్లు మాత్రమే కాదు చాలా మంది దొరికిపోతారు. ముఖ్యంగా బాల్ లోపలి వైపు దూసుకొచ్చినప్పుడు. ఇక ఈ మ్యాచ్ జరిగిన పిచ్ చూస్తుంటే మ్యాచ్ ఆస్ట్రేలియాలో జరిగినట్లు అనిపించింది" అని వసీం అక్రమ్ స్పోర్ట్స్ తక్ తో మాట్లాడుతూ అన్నాడు.
"వర్షం కూడా పడింది. గ్రౌండంతా చాలా పచ్చిక ఉంది. ఈ మ్యాచ్ న్యూజిలాండ్ లో ఆడుతున్నారా అని కూడా అనిపించింది. గ్రౌండ్ బాగుంది. ఆ క్రెడిట్ ఆర్గనైజర్లకు దక్కుతుంది. ఇదో చిన్న మ్యాచ్. ఆస్ట్రేలియా బాగా ఆడింది. సిరీస్ 1-1తో సమమైంది. పిచ్ పై బంతి సీమ్ అవుతున్నట్లు నాకు అనిపించింది. ఆస్ట్రేలియా ఆ రన్స్ వేగంగా చేజ్ చేసింది కానీ.. సిరాజ్ వేసిన రెండు ఓవర్లు చూస్తే బంతి రెండు వైపులా సీమ్ అవుతున్నట్లు అనిపించింది" అని అక్రమ్ అన్నాడు.
సంబంధిత కథనం