తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  డబ్ల్యూటీసీ టీమ్ ఆఫ్ ది టోర్నీని ప్రకటించిన క్రికెట్ ఆస్ట్రేలియా.. కోహ్లీకి నో ప్లేస్.. ముగ్గురు భారత ప్లేయర్లకు చోటు

డబ్ల్యూటీసీ టీమ్ ఆఫ్ ది టోర్నీని ప్రకటించిన క్రికెట్ ఆస్ట్రేలియా.. కోహ్లీకి నో ప్లేస్.. ముగ్గురు భారత ప్లేయర్లకు చోటు

04 June 2023, 19:45 IST

    • Cricket Australia WTC Team of The Tournament: డబ్ల్యూటీసీ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్‍ను క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శుభ్‍మన్ గిల్‍కు ఈ జట్టులో చోటు దక్కలేదు.
విరాట్ కోహ్లీ (Photo: AP)
విరాట్ కోహ్లీ (Photo: AP)

విరాట్ కోహ్లీ (Photo: AP)

Cricket Australia WTC Team of The Tournament: ప్రపంచ టెస్టు చాంపియన్‍షిప్ (WTC) టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్‍ను క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. డబ్ల్యూటీసీ జరిగిన రెండేళ్ల కాలంలో (2021-2023) బాగా రాణించిన వివిధ దేశాల జట్ల ఆటగాళ్లతో ఈ బెస్ట్ ఎలెవెన్‍ను రూపొందించింది. పాకిస్థాన్ ప్లేయర్ బాబర్ ఆజమ్‍కు ఈ జట్టులో చోటు కల్పించింది. భారత స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శుభ్‍మన్ గిల్‍ను క్రికెట్ ఆస్ట్రేలియా విస్మరించింది. అయితే, ఈ జట్టులో ముగ్గురు భారత ప్లేయర్లు ఉన్నారు. వివరాలివే..

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

డబ్ల్యూటీసీ టీమ్ ఆఫ్ టోర్నమెంట్‍లో ఓపెనర్లుగా ఉస్మాన్ ఖవాజా, శ్రీలంక బ్యాటర్ దిముత్ కరుణరత్నెను క్రికెట్ ఆస్ట్రేలియా తీసుకుంది. నంబర్ 3 ప్లేస్‍లో బాబర్ ఆజమ్ ఉన్నాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, గిల్‍తో పాటు ఇండియా నయా వాల్ పూజారకు కూడా ఈ టీమ్‍లో చోటు దక్కకపోవడం ఆశ్చర్యంగా ఉంది. ఇక ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ జో రూట్‍ను ఈ టీమ్‍లో చేర్చింది క్రికెట్ ఆస్ట్రేలియా.

ఆసీస్ యువ బ్యాట్స్‌మన్ ట్రావిస్ హెడ్ కూడా ఈ జట్టులో ఉన్నాడు. డబ్ల్యూటీసీ టీమ్ ఆఫ్ టోర్నమెంట్‍లో భారత్ నుంచి వికెట్ కీపర్ రిషబ్ పంత్, స్పిన్నర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‍ను తీసుకుంది క్రికెట్ ఆస్ట్రేలియా. ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్, ఇంగ్లండ్ సీనియర్ జేమ్స్ ఆండర్సన్, సౌత్ ఆఫ్రికా స్టాక్ కగీసో రబాడా పేసర్లుగా ఉన్నారు.

క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించిన డబ్ల్యూటీసీ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ జట్టు: ఉస్మాన్ ఖవాజా, దిముత్ కరుణరత్నె, బాబర్ ఆజమ్, జో రూట్, ట్రావిస్ హెడ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), జేమ్స్ ఆండర్సన్, కగిసో రబాడ

కాగా.. భారత్, ఆస్ట్రేలియా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ జూన్ 7వ తేదీన ప్రారంభం కానుంది. ఇంగ్లండ్‍లోని ఓవల్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఇరు జట్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి.

తదుపరి వ్యాసం