WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్‍కు ముందు ఆస్ట్రేలియాకు షాక్.. జట్టు నుంచి స్టార్ బౌలర్ ఔట్-australia suffers major setback as josh hazlewood ruled out of wtc final vs india ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Wtc Final: డబ్ల్యూటీసీ ఫైనల్‍కు ముందు ఆస్ట్రేలియాకు షాక్.. జట్టు నుంచి స్టార్ బౌలర్ ఔట్

WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్‍కు ముందు ఆస్ట్రేలియాకు షాక్.. జట్టు నుంచి స్టార్ బౌలర్ ఔట్

Chatakonda Krishna Prakash HT Telugu
Jun 04, 2023 06:14 PM IST

WTC Final : డబ్ల్యూటీసీ ఫైనల్‍కు ముందు ఆస్ట్రేలియా జట్టుకు షాక్ ఎదురైంది. గాయం వల్ల జట్టుకు స్టార్ పేసర్ జోష్ హాజిల్‍వుడ్ దూరమయ్యాడు.

WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్‍కు ముందు ఆస్ట్రేలియాకు షాక్.. జట్టు నుంచి స్టార్ బౌలర్ ఔట్
WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్‍కు ముందు ఆస్ట్రేలియాకు షాక్.. జట్టు నుంచి స్టార్ బౌలర్ ఔట్

WTC Final: ఇండియాతో ప్రపంచ టెస్టు చాంపియన్‍షిప్ ఫైనల్ ఆడనున్న ఆస్ట్రేలియాకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఫైనల్ ఫైట్ ప్రారంభమయ్యే మూడు రోజుల ముందు ఆ జట్టుకు షాక్ ఎదురైంది. గాయం కారణంగా ఆసీస్ జట్టుకు స్టార్ పేసర్ జోష్ హాజిల్‍వుడ్ దూరమయ్యాడు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. హాజిల్‍వుడ్ స్థానంలో ఆల్‍రౌండర్ మైకేల్ నెసెర్‌ను ఎంపిక చేసింది. ఇండియా, ఆస్ట్రేలియా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ జూన్ 7వ తేదీన ప్రారంభం కానుంది. లండన్‍లోని ఓవల్ మైదానం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. వివరాలివే..

జోష్ హాజిల్‍వుడ్ కొంతకాలంగా కాలి కండరాల గాయంతో బాధపడుతున్నాడు. అందుకే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‍లో రాయల్‍చాలెంజర్స్ బెంగళూరు జట్టులో ఆలస్యంగా జాయిన్ అయ్యాడు. ఐపీఎల్‍ నుంచి కూడా కొన్ని రోజుల తర్వాత తప్పుకున్నాడు. అయితే, గాయం తగ్గినట్టు కనిపించటంతో డబ్ల్యూటీసీ ఫైనల్‍కు క్రికెట్ ఆస్ట్రేలియా అతడిని ఎంపిక చేసింది. కాగా, తాజాగా గాయం ఇంకా మానలేదని తేలటంతో రిస్క్ వద్దనుకొని డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ఆస్ట్రేలియా జట్టు నుంచి హాజిల్‍వుడ్‍ను తప్పించింది. ఈ నెలలోనే ప్రారంభమయ్యే యాషెస్ సిరీస్ కోసం హాజిల్‍వుడ్ సిద్ధమయ్యేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. అప్పటికల్లా అతడు గాయం నుంచి కోలుకుంటాడని క్రికెట్ ఆస్ట్రేలియా ఆశిస్తోంది.

కాగా, కౌంటీ చాంపియన్‍షిప్‍లో గ్లామోర్గాన్ జట్టు తరఫున అదరగొట్టిన మైకేర్ నాసెర్‌ను డబ్ల్యూటీసీ ఫైనల్‍కు హాజిల్‍వుడ్ స్థానంలో ఎంపిక చేసింది క్రికెట్ ఆస్ట్రేలియా. అయితే, మ్యాచ్ ఆడే తుది జట్టులో బోలాండ్‍కు అవకాశం దక్కే ఛాన్స్ పెరిగింది.

డబ్ల్యూటీసీ ఫైనల్‍కు ఆస్ట్రేలియా జట్టు: ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బోల్యాండ్, అలెక్స్ కేరీ (వికెట్ కీపర్), కామెరూన్ గ్రీన్, మార్కస్ హ్యారిస్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, నాథన్ లయాన్, టూడ్ మర్ఫీ, మైకేల్ నాసెర్, స్టీవ్ స్మిత్ (వైస్ కెప్టెన్), మిచెల్ స్టార్క్, డేవిడ్ వార్నర్. స్టాండ్ బై ప్లేయర్లు: మిచెల్ మార్ష్, మాథ్యూ రెన్షా

భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‍మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్య రహానే, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, జయ్‍దేవ్ ఉనద్కత్. స్టాండ్ బై ప్లేయర్లు: యశస్వి జైశ్వాల్, ముకేశ్ కుమార్, సూర్యకుమార్ యాదవ్.

Whats_app_banner