Virat Kohli Vs Rohit Sharma : ఒకే ఏడాదిలో 3 పరాజయాలు, 4 ఏళ్లలో 4 ఓటములు..!
12 June 2023, 5:28 IST
- Virat Kohli Vs Rohit Sharma : వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో టీమ్ ఇండియాను ఆస్ట్రేలియా ఓడించింది. దీంతో రెండోసారి టైటిల్ నెగ్గాలన్న టీమిండియా కల నెరవేరలేదు.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్(WTC Final) ఓటమి తర్వాత టీమ్ ఇండియా నాయకత్వంపై చర్చలు మొదలయ్యాయి. గతంలో కెప్టెన్‌గా ఉన్న విరాట్ కోహ్లీ(Virat Kohli)ని పక్కనపెట్టి బీసీసీఐ ఇప్పుడు కంగుతిన్నది. ఎందుకంటే 2021 చివర్లో విరాట్ కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించి రోహిత్ శర్మకు అప్పగించారు. ఇప్పటివరకు, హిట్‌మ్యాన్ ఒకే సంవత్సరంలో మూడు ప్రధాన టోర్నమెంట్‌లలో జట్టును నడిపించడంలో విఫలమయ్యాడు.
2017 నుంచి ఫుల్ కెప్టెన్‌గా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ 4 ఏళ్లలో 4 సార్లు కప్ గెలవలేకపోతే, రోహిత్ శర్మ ఒకే ఏడాది 3 మేజర్ టోర్నీల్లో 3 సార్లు విఫలమయ్యాడు. 2017లో కోహ్లి సారథ్యంలో టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లోకి అడుగుపెట్టింది. కానీ పాకిస్థాన్‌పై ఓడిపోవడంతో ఐసీ(ICC Trophy)సీ ట్రోఫీని గెలుచుకునే అవకాశాన్ని కోల్పోయింది.
2019 వన్డే ప్రపంచకప్‌లో టీమిండియాకు విరాట్ కోహ్లీ నాయకత్వం వహించాడు. కానీ న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్‌లో తడబడింది. అలాగే, 2021 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్, టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టుకు నాయకత్వం వహించిన కోహ్లీ మరో రెండుసార్లు జట్టుకు టైటిల్‌ను సాధించడంలో విఫలమయ్యాడు. అంటే 4 ఏళ్లలో కోహ్లీ నాయకత్వంలో భారత జట్టు మొత్తం 4 సార్లు ఐసీసీ ట్రోఫీని గెలవలేకపోయింది.
కానీ 2022 నుండి పూర్తి స్థాయి కెప్టెన్‌గా మారిన తర్వాత, రోహిత్ శర్మ ఆసియా కప్, T20 ప్రపంచ కప్, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ల ఫైనల్స్‌లో జట్టును నడిపించాడు. ఆసియాకప్‌లో సూపర్-4 దశ నుంచి నిష్క్రమించినా.. టీ20 ప్రపంచకప్‌లో మాత్రం సెమీఫైనల్‌లో తడబడింది. ఇప్పుడు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌లో ఓడిపోయింది. అంటే టీమ్ ఇండియా ఒక్క ఏడాదిలో మూడు మేజర్ టోర్నీలను గెలవలేకపోయింది.
నాలుగేళ్లలో 4 మేజర్ టోర్నీలు గెలవలేకపోయిన విరాట్ కోహ్లీని తప్పించి రోహిత్ శర్మకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. ఒకే ఏడాది మూడు మేజర్ టోర్నీల్లో ఓడిన రోహిత్ శర్మ నాయకత్వంపై ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది.
టాపిక్