తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Virat Kohli On Lata Mangeshkar: లతాజీని కలవలేకపోయానన్న బాధ ఉంది.. వైరల్ అవుతున్న విరాట్ ఇంటర్వ్యూ

Virat Kohli on Lata Mangeshkar: లతాజీని కలవలేకపోయానన్న బాధ ఉంది.. వైరల్ అవుతున్న విరాట్ ఇంటర్వ్యూ

Hari Prasad S HT Telugu

31 January 2023, 15:18 IST

google News
    • Virat Kohli on Lata Mangeshkar: లతాజీని కలవలేకపోయానన్న బాధ ఉందని అన్నాడు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి. అతడు ఇచ్చిన ఇంటర్వ్యూ ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది.
విరాట్ కోహ్లి
విరాట్ కోహ్లి (PTI)

విరాట్ కోహ్లి

Virat Kohli on Lata Mangeshkar: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి మంగళవారం (జనవరి 31) ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశాడు. అందులో తాను ఇచ్చిన ఇంటర్వ్యూ తాలూకు చిన్న వీడియో ఉంది. అవతలి వ్యక్తి అడిగిన ఆసక్తికరమైన ప్రశ్నలకు అంతకంటే ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలోనే లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ ను కలవలేకపోయానన్న బాధ తనకు ఉన్నట్లు కోహ్లి చెప్పాడు.

చరిత్రలో నిలిచిపోయిన ఏ మహిళతో మీరు డిన్నర్ కు వెళ్లాలని అనుకుంటారు అని ఇంటర్వ్యూవర్ కోహ్లిని అడిగారు. దీనికి విరాట్ స్పందిస్తూ.. "లతాజీ కలిసే అవకాశం నాకు ఎప్పుడూ రాలేదు. ఆమెతో కలిసి మాట్లాడి, ఆమె జీవితం గురించి, ఆమె ప్రయాణం గురించి మరింత తెలుసుకునే అవకాశం వచ్చి ఉంటే బాగుండేది" అని చెప్పుకొచ్చాడు.

ఇక ఇదే షార్ట్ ఇంటర్వ్యూలో లెజెండరీ బాక్సర్ మహ్మద్ అలీని కూడా విరాట్ గుర్తు చేసుకున్నాడు. ఒకవేళ ఓ దీవిలో మీరు మీ కుటుంబ సభ్యులు కాకుండా ఎవరితో కలిసి ఓ దీవిలో చిక్కుకుపోవాలని అనుకుంటారు అని ప్రశ్నించగా.. మహ్మద్ అలీ అని విరాట్ సమాధానమిచ్చాడు. ఈ అమెరికన్ బాక్సర్ కు ఆల్ టైమ్ గ్రేటెస్ట్ హెవీ వెయిట్ బాక్సర్ గా పేరుంది.

ఇక తనకు అత్యంత సంతోషకరమైన ప్లేస్ తన ఇల్లే అని కూడా ఈ సందర్భంగా విరాట్ చెప్పాడు. తన జీవితంలో ప్రయత్నించిన అత్యంత విచిత్రమైన డైట్ ఏది అని అడిగితే.. తనకు 24 ఏళ్ల వయసు వచ్చే వరకూ తిన్నదంతా అదే అని, తాను ప్రపంచంలోని జంక్ ఫుడ్ మొత్తం తినేవాడినని విరాట్ చెప్పాడు. ప్లాంకింగ్ లో తన రికార్డు టైమ్ మూడున్నర నిమిషాలని కూడా కోహ్లి తెలిపాడు. కోహ్లి ఫిట్‌నెస్ ఏ స్థాయిలో ఉంటుందో తన ప్లాంకింగ్ టైమ్ ను బట్టి అర్థం చేసుకోవచ్చు.

విరాట్ ఇంటర్వ్యూలో ఇది తొలి పార్ట్ మాత్రమే. రెండో ఎపిసోడ్ కూడా రానుందని వీడియో చివర్లో వెల్లడించారు. ప్రస్తుతం న్యూజిలాండ్ టీ20 సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకున్న కోహ్లి.. రిషికేష్ లోని ఓ ఆశ్రమంలో ఉన్నాడు. ఆస్ట్రేలియాతో ఫిబ్రవరి 9 నుంచి ప్రారంభం కాబోయే నాలుగు టెస్టుల సిరీస్ కోసం త్వరలోనే అతడు టీమిండియాతో చేరనున్నాడు.

తదుపరి వ్యాసం