Viral Video | మహ్మద్ అలీనే ఓడించిన ఘనుడు.. దెబ్బకు నాకౌట్ అయిన దిగ్గజ బాక్సర్..!
మహమ్మద్ అలీకి ముచ్చెమటలు పట్టించాడు ఓ బాక్సర్. తన పంచులతో లెజెండ్ బాక్సర్‌ను మట్టికరిపించాడు. ప్రముఖ పారిశ్రామిక హర్ష్ గొయెంక షేర్ చేసిన ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
మహమ్మద్ అలీ.. పరిచయం అక్కర్లేని పేరు.. బాక్సింగ్ రింగులోకి దిగితే ఎంతటి వారికైనా చావు దెబ్బ తప్పదు. ఆయన విసిరే పంచులకు మహామహులైనా నాకౌట్ కావాల్సిందే. రింగులో వేగంగా కదులుతూ.. ప్రత్యర్థికి అసలు అవకాశమే ఇవ్వకుండా పంచులతో విరుచుకుపడే దిగ్గజ బాక్సర్ అలీ. 20వ శతాబ్దంలో అత్యంత మేటి అథ్లెట్‌గా గుర్తింపు తెచ్చుకున్న మహ్మద్ అలీ.. ఒకానొక సందర్భంలో చావు దెబ్బలు తిన్నాడు. అంతేకాదు ప్రత్యర్థి విసిరే పంచులకు నేలకొరిగి నాకౌట్ అయ్యాడు. అది కూడా ఆయన కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్న దశలో దారుణంగా ఓటమి పాలయ్యాడు. అవునా.. ఎప్పుడు? మహమ్మద్ అలీనే ఓడించిన ఆ ఘనడు ఎవరు? అని అనుకుంటున్నారా.. అది ఎవరో కాదు.. నాలుగైదు ఏళ్లున్న ఓ చిన్నారి.
ఓ చిన్నారితో ఇంటారక్షన్ అయిన మహమ్మద్ అలీ.. ఆ బుడతడితో కలిసి సరదాగా బాక్సింగ్ చేశాడు. దీంతో అవకాశం దొరికిందనుకున్న ఆ బాలుడు గ్లౌజులు ధరించి అలీపై పంచుల వర్షం కురిపించాడు. ఒకటి కాదు రెండు కాదు.. వరుసగా పదుల సంఖ్యలో అలీ ముఖంపై గుద్దులు గుద్దాడు. లేలేత చేతులతో సుతారంగా చిన్నారి పంచులు కురిపిస్తుంటే అలీ కూడా అందుకు తగినట్లుగానే ఎక్స్‌ప్రెషన్ పెట్టాడు. చివరకు బాలుడు పంచులకు కింద పడటమే కాకుండా నాకౌట్ అయినట్లు నటిస్తాడు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోన్న ఉల్లాస భరితమైన ఈ వీడియోను ప్రముఖ పారిశ్రామిక వేత్త హర్ష్ గొయెంకా పోస్ట్ చేశారు.
ట్విట్టర్‌లో ఎప్పటికప్పుడు ప్రజలకు చేరువగా ఉండే ఈయన స్ఫూర్తికరమైన వీడియోలను పోస్ట్ చేస్తుంటారు. తాజాగా బాలుడి చేతిలో మహమ్మద్ అలీ దెబ్బలు తినే వీడియోను షేర్ చేసి నెటిజన్లకు ఆనందాన్ని పంచారు. మహమ్మద్ అలీకి సంబంధించి బెస్ట్ బాక్సింగ్ మ్యాచ్ చూశాను అని పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. నెటిజన్ల నుంచి విశేష స్పందనలు వస్తున్నాయి.
ఎంతో ఆసక్తికరంగా ఉంది.. మైండ్ బ్లోయింగ్ గేమ్ అని ఒకరు పోస్ట్ చేయగా.. ప్రజల ముఖాల్లో సంతోషాన్ని నింపేవాడే రియల్ హీరో అంటూ మరోకరు స్పందించారు. మహమ్మద్ ఎంతో గొప్ప బాక్సర్ అని ఇంకోకరు కామెంట్ పెట్టారు. పిల్లల మనస్తత్వానికి తగినట్లుగా మహమ్మద్ అలీ వ్యవహరించారని.. ఆయనకు హ్యాట్సాఫ్ అని మరోకరు ట్విట్టర్‌లో తన స్పందనను తెలియజేశారు.
ఈ అమెకితన్ బాక్సర్ మహమ్మద్ అలీ 1942లో జన్మించారు. 60, 70వ దశకంలో ప్రపంచంలోనే మేటి బాక్సర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. మూడు విభిన్న సందర్భాల్లో ప్రపంచ హెవీ వెయిట్ ఛాంపియన్‌షిప్‌ను గెల్చుకున్న మొదటి బాక్సర్‌గా ఘనత సాధించాడు. మొత్తంగా ఈ టైటిల్‌ను 19 సార్లు కైవసం చేసుకున్నాడు. చివరకు 2016లో 74 ఏళ్ల వయస్సులో మహమ్మద్ అలీ కన్నుమూశాడు.
సంబంధిత కథనం