తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Virat Kohli Eyes On Sachin Record: మరో సచిన్‌ రికార్డుపై కన్నేసిన విరాట్‌.. తొలి వన్డేలోనే సాధిస్తాడా?

Virat Kohli eyes on Sachin Record: మరో సచిన్‌ రికార్డుపై కన్నేసిన విరాట్‌.. తొలి వన్డేలోనే సాధిస్తాడా?

Hari Prasad S HT Telugu

09 January 2023, 17:37 IST

    • Virat Kohli eyes on Sachin Record: మరో సచిన్‌ రికార్డుపై కన్నేశాడు విరాట్‌ కోహ్లి. శ్రీలంకతో మంగళవారం (జనవరి 10) జరగబోయే తొలి వన్డేకు ముందు ఈ రికార్డు అతన్ని ఊరిస్తోంది.
విరాట్ కోహ్లి
విరాట్ కోహ్లి (AFP)

విరాట్ కోహ్లి

Virat Kohli eyes on Sachin Record: ఇప్పుడు క్రికెట్‌లో సచిన్‌ టెండూల్కర్‌ రికార్డులను బ్రేక్‌ చేయగలిగిన ఏకైక బ్యాట్స్‌మన్‌ విరాట్‌ కోహ్లి. ముఖ్యంగా వన్డేలలో మాస్టర్‌ రికార్డుల వైపు వేగంగా అడుగులు వేస్తున్నాడు. ఇప్పుడు కొత్త సంవత్సరంలో తాను ఆడబోయే తొలి మ్యాచ్‌లోనే మరో సచిన్ రికార్డుపై విరాట్‌ కన్నేశాడు. శ్రీలంకతో మంగళవారం (జనవరి 10) జరగబోయే తొలి వన్డేలో అతడు ఈ రికార్డు సాధిస్తాడా లేదా అన్నది ఆసక్తిగా మారింది.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

సొంతగడ్డపై అత్యధిక వన్డే సెంచరీలు చేసిన వరల్డ్‌ రికార్డు ఇప్పటి వరకూ సచిన్‌ టెండూల్కర్‌ పేరిట ఉంది. సచిన్‌ సొంతగడ్డపై 164 వన్డేలలో 20 సెంచరీలు చేశాడు. ఇప్పుడు విరాట్‌ దానికి కేవలం సెంచరీ దూరంలో ఉన్నాడు. నాలుగేళ్ల తర్వాత గత బంగ్లాదేశ్ టూర్‌లో వన్డేలలో సెంచరీ చేసిన విరాట్‌ కోహ్లి.. టాప్‌ ఫామ్‌లో ఉన్నాడు. దీంతో శ్రీలంకతో సిరీస్‌లోనే దానిని అందుకుంటాడన్న నమ్మకంతో ఫ్యాన్స్‌ ఉన్నారు.

విరాట్‌ కోహ్లి ఇప్పటి వరకూ ఇండియాలో 101 వన్డేల్లోనే 19 సెంచరీలు చేసి సచిన్‌ తర్వాతి స్థానంలో ఉన్నాడు. మరో సెంచరీ చేస్తే సచిన్‌ వరల్డ్‌ రికార్డును సమం చేస్తాడు. విరాట్ తర్వాత సౌతాఫ్రికా మాజీ బ్యాటర్‌ హషీమ్ ఆమ్లా సొంతగడ్డపై 69 వన్డేలలో 14 సెంచరీలతో మూడోస్థానంలో ఉన్నాడు.

ఇక ప్రస్తుతం మ్యాచ్ జరుగుతున్న శ్రీలంకపైనా సచిన్‌ సాధించిన రికార్డును విరాట్‌ సమం చేశాడు. శ్రీలంకపై 84 మ్యాచ్‌లు ఆడిన సచిన్‌ 8 సెంచరీలు చేశాడు. ఇక విరాట్‌ కోహ్లి 60 మ్యాచ్‌లలోనే ఆ టీమ్‌పై 8 సెంచరీలు చేయడం విశేషం. శ్రీలంకపై విరాట్‌ 2220 రన్స్‌, సచిన్‌ 3113 రన్స్‌ చేశారు.

ఇక వన్డేల్లో ఆల్‌టైమ్‌ అత్యధిక రన్స్‌ చేసిన టాప్‌ 5లో చేరే అవకాశం కూడా విరాట్‌ కోహ్లికి ఉంది. దీనికోసం విరాట్‌కు ఇంకా 180 రన్స్ కావాలి. శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్‌లో కోహ్లికి ఈ రికార్డు బ్రేక్‌ చేయడానికి మంచి ఛాన్స్‌ ఉంది. ఈ లిస్ట్‌లో సచిన్‌ టెండూల్కర్‌ 18426 రన్స్‌తో టాప్‌లో ఉన్నాడు. ఇక తర్వాతి స్థానాల్లో కుమార సంగక్కర (14234), రికీ పాంటింగ్ (13704), సనత్ జయసూర్య (13430), మహేల జయవర్దనె (12650) ఉన్నారు.

ప్రస్తుతం విరాట్‌ కోహ్లి 265 వన్డేలలో 12471 రన్స్‌ చేశాడు. మరో 180 రన్స్‌ చేస్తే జయవర్దనెను వెనక్కి నెట్టి టాప్‌ 5లో చేరతాడు. వన్డే వరల్డ్‌కప్‌ జరగనున్న ఏడాది కావడంతో ఈ ఫార్మాట్‌లో మళ్లీ మునుపటి ఫామ్‌ అందుకోవాలని కోహ్లి చూస్తున్నాడు.