తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  T20 World Cup India Team 2022: టీ20 వరల్డ్‌కప్‌కు ఇండియన్‌ టీమ్‌ ఇదే

T20 World Cup India Team 2022: టీ20 వరల్డ్‌కప్‌కు ఇండియన్‌ టీమ్‌ ఇదే

Hari Prasad S HT Telugu

12 September 2022, 18:54 IST

google News
    • T20 World Cup India Team 2022: టీ20 వరల్డ్‌కప్‌కు ఇండియన్‌ టీమ్‌ను ప్రకటించింది బీసీసీఐ. సోమవారం (సెప్టెంబర్‌ 12) ప్రత్యేకంగా సమావేశమైన సెలక్టర్లు టీమ్‌ను అనౌన్స్‌ చేశారు.
టీ20 వరల్డ్ కప్ కోసం టీమిండియా ఎంపిక
టీ20 వరల్డ్ కప్ కోసం టీమిండియా ఎంపిక (AP)

టీ20 వరల్డ్ కప్ కోసం టీమిండియా ఎంపిక

T20 World Cup India Team 2022: టీ20 వరల్డ్‌కప్‌లో ఆడబోయే టీమిండియాను ప్రకటించారు. అక్టోబర్‌ 16 నుంచి ఈ వరల్డ్‌కప్‌ ప్రారంభం కానుంది. ఈ వరల్డ్‌కప్‌ టీమ్‌లోకి పేస్‌ బౌలర్లు జస్‌ప్రీత్‌ బుమ్రా, హర్షల్‌ పటేల్‌లు తిరిగి రాగా.. సంజు శాంసన్‌కు నిరాశే ఎదురైంది. వికెట్‌ కీపర్లుగా రిషబ్‌ పంత్‌, దినేష్‌ కార్తీక్‌లను సెలక్టర్లు ఎంపిక చేశారు.

ఈ వారం చివర్లో వరల్డ్‌ కప్‌ టీమ్‌ను అనౌన్స్‌ చేస్తారని భావించినా.. సోమవారం సమావేశమైన సెలక్టర్లు టీమ్‌ను ప్రకటించడం విశేషం. 15 మంది సభ్యులతో కూడిన టీమ్‌ వరల్డ్‌కప్‌ కోసం ఆస్ట్రేలియా వెళ్లనుంది. ఇక మహ్మద్‌ షమి, రవి బిష్ణోయ్‌, శ్రేయస్‌ అయ్యర్‌, దీపక్‌ చహర్‌లను స్టాండ్‌బై ప్లేయర్స్‌గా ఉంచారు. ఆసియా కప్‌కు గాయంతో దూరమైన బుమ్రా మళ్లీ టీమ్‌లోకి వచ్చాడు.

సంజూ శాంసన్‌కు నిరాశే

అయితే వికెట్‌ కీపర్లుగా పంత్‌, కార్తీక్‌లను ఎంపిక చేశారు. సంజు శాంసన్‌, ఇషాన్‌ కిషన్‌లకు నిరాశే ఎదురైంది. అటు ఆసియా కప్‌లో గాయంతో మధ్యలోనే వెళ్లిపోయిన రవీంద్ర జడేజా పేరును కూడా సెలక్టర్లు పరిశీలించలేదు. స్పిన్నర్లుగా సీనియర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌తోపాటు యుజువేంద్ర చహల్‌, అక్షర్‌ పటేల్‌ ఉన్నారు. ఇక పేస్‌ బౌలింగ్‌ కేటగిరీలో బుమ్రా, భువనేశ్వర్‌, హర్షల్‌ పటేల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌ను ఎంపిక చేశారు.

ఇక టాపార్డర్‌లో రోహిత్‌, రాహుల్‌, విరాట్‌ కోహ్లి ఉండగా.. తర్వాత సూర్యకుమార్‌ యాదవ్‌, దీపక్ హుడా, హార్దిక్‌ పాండ్యాలకు టీమ్‌లో చోటు దక్కింది. మహ్మద్‌ షమిని 15 మంది సభ్యుల టీమ్‌లోకి ఎంపిక చేయకపోయినా.. స్టాండ్‌బైగా ఉంచారు.

టీ20 వరల్డ్‌కప్‌కు ఇండియన్‌ టీమ్‌ ఇదే

రోహిత్ శర్మ (కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌ (వైస్‌ కెప్టెన్‌), విరాట్‌ కోహ్లి, సూర్యకుమార్‌ యాదవ్‌, దీపక్‌ హుడా, రిషబ్‌ పంత్‌, దినేష్‌ కార్తీక్‌, హార్దిక్‌ పాండ్యా, రవిచంద్రన్‌ అశ్విన్‌, యుజువేంద్ర చహల్‌,అక్షర్‌ పటేల్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, భువనేశ్వర్‌ కుమార్‌, హర్షల్‌ పటేల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌

స్టాండ్‌బై ప్లేయర్స్‌: మహ్మద్‌ షమి, దీపక్‌ చహర్‌, శ్రేయస్‌ అయ్యర్‌, రవి బిష్ణోయ్‌

తదుపరి వ్యాసం