Team India Team Selection Problem: 'సమస్య కెప్టెన్సీలో కాదు.. జట్టు ఎంపికలో ఉంది'.. టీమిండియా మాజీ స్పష్టం
Aakash Chopra on Team Selection: టీమిండియా సెలక్షన్‌పై ఆకాశ్ చోప్రా స్పందించాడు. జట్టు ఎంపికలోనే అసలు సమస్య ఉందని, కెప్టెన్సీలో లేదని స్పష్టం చేశాడు. కెప్టెన్సీలో ఉంటే విరాట్ కోహ్లీని మార్చి రోహిత్ శర్మకు పగ్గాలు అప్పగించిన పరాజయాలు ఎదురుతున్నాయని తెలిపాడు.
Aakash Chopra on Team Selection: ఆసియా కప్‌లో టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన టీమిండియా.. అనూహ్యంగా సూపర్ 4 దశలో పాకిస్థాన్, శ్రీలంక చేతిలో ఓటమి పాలై అభిమానులకు నిరాశ మిగిల్చింది. ఫలితంగా ఈ టోర్నీ ఫైనల్ ఆశలపై నీళ్లు చల్లుకుంది. దీంతో కెప్టెన్సీ, తుది జట్టు ఎంపికపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. పలువురు మాజీలు సైతం ఈ అంశంపై గుర్రుగా ఉన్నారు. తాజాగా టీమిండియా మాజీ ప్లేయర్ ఆకాశ్ చోప్రా టీమిండియా ఓటమిపై స్పందించాడు. కెప్టెన్సీలో ఎలాంటి సమస్య లేదని, జట్టు సెలక్షన్‌లోనే ఇబ్బంది ఉందంటూ స్పందించాడు.
విరాట్ కోహ్లీని టీ20 కెప్టెన్‌గా తొలగించాలని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న సమయంలోనే టీమిండియా గతేడాది టీ20 ప్రపంచకప్ నుంచి లీగ్ దశలోనే నిష్క్రమించింది. దీంతో కోహ్లీపై వేటు వేసి జట్టు పగ్గాలను రోహిత్ శర్మకు అప్పగించింది బీసీసీఐ. 2012 తర్వాత ఐసీసీ టోర్నమెంట్లలో నాకౌట్ దశలో భారత్ నిష్క్రమించడం ఇదే మొదటిసారి. తాజాగా ఆసియా కప్‌లోనూ భారత్ అలాంటి ప్రదర్శనతోనే సూపర్-4 దశలోనే ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. పాకిస్థాన్, శ్రీలంక చేతిలో ఓటమిని చవిచూసింది. దుబాయ్ వేదికగా గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్ దశలో ఇంటిముఖం పట్టిన భారత్.. తాజాగా ఆసియా కప్‌లో ఇదే వేదికపై పరాజయాలు చవిచూడటం గమనార్హం. ఈ విషయంపై ఆకాశ్ చోప్రా స్పందించాడు.
"ఇదే వేదికపై గతేడాది భారత్ ఓటమి పాలైంది. చాలా మంది టీమిండియా కెప్టెన్‌గా విరాట్ కోహ్లీని తొలగించాలని అభిప్రాయపడ్డారు. అలాగే అతడి నుంచి రోహిత్‌కు బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు రోహిత్ శర్మ కెప్టెన్సీలోనూ ఆసియా కప్‌ను భారత్ గెలవలేకపోయింది. కాబట్టి కెప్టెన్సీలో కాదు.. సమస్య జట్టు సెలక్షన్‌లో ఉందని అర్థమవుతుంది." అని ఆకాశ్ చోప్రా స్పష్టం చేశాడు.
జట్టు ఎంపికలో క్లారిటీ లేకపోవడం వల్లే వరుస పరాజయాలను చవిచూస్తున్నామని ఆకాశ్ చోప్రా తెలిపాడు. "ప్లానింగ్‌లో క్లారిటీ లేకపోవడం స్పష్టంగా కనిపిస్తుంది. జట్టులో చాలా మార్పులు చేశారు. కానీ శ్రీలంక, పాకిస్థాన్ కేవలం ఒకే మార్పుతో ఫైనల్ వరకు వెళ్లాయి." అని ఆకాశ్ చోప్రా అన్నాడు.
అల్ రౌండర్ రవీంద్ర జడేజా గాయం కావడంతో అతడి స్థానంలో దీపక్ హుడాను తీసుకున్నారు. అయితే పాకిస్థాన్, శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌ల్లో అతడికి బౌలింగ్ ఇవ్వలేదు. అంతేకాకుండా బ్యాటింగ్ లోయర్ ఆర్డర్‌లో వచ్చాడు. అంతేకాకుండా టీ20 ప్రపంచకప్ ముందు ఆఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో యజువేంద్ర చాహల్ స్థానంలో దీపక్ చాహర్‌కు అవకాశమిచ్చారు.
సంబంధిత కథనం