తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  South Africa T20 World Cup Team: టీ20 వరల్డ్‌కప్‌కు సౌతాఫ్రికా టీమ్‌ ఇదే

South Africa T20 World Cup Team: టీ20 వరల్డ్‌కప్‌కు సౌతాఫ్రికా టీమ్‌ ఇదే

Hari Prasad S HT Telugu

06 September 2022, 17:12 IST

    • South Africa T20 World Cup Team: టీ20 వరల్డ్‌కప్‌కు సౌతాఫ్రికా తన టీమ్‌ను ప్రకటించింది. అయితే గాయం కారణంగా ఆ టీమ్‌ స్టార్ బ్యాటర్‌ వాండెర్‌ డుసెన్‌ ఈ మెగా టోర్నీకి దూరమయ్యాడు.
సౌతాఫ్రికా టీమ్
సౌతాఫ్రికా టీమ్ (Hindustan Times)

సౌతాఫ్రికా టీమ్

South Africa T20 World Cup Team: ఆస్ట్రేలియాలో జరగబోయే టీ20 వరల్డ్‌కప్‌ 2022కు మరో నెలన్నర సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో ఒక్కో క్రికెట్‌ బోర్డు తమ టీమ్స్‌ను ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ టీమ్స్‌ను అనౌన్స్‌ చేయగా.. తాజాగా మంగళవారం (సెప్టెంబర్‌ 6) సౌతాఫ్రికా కూడా తన టీమ్‌ను ప్రకటించింది.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

ఈ మెగా టోర్నీకి ఎంపిక చేసిన టీమ్‌లో స్టార్ బ్యాటర్‌ వాండెర్‌ డుసెన్‌ లేడు. అతని వేలు విరగడంతో ఈ మెగా టోర్నీకి దూరమయ్యాడు. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో డుసెన్‌ తన ఎడమ చేతి చూపుడు వేలికి గాయం చేసుకున్నాడు. టీమ్‌ను ప్రకటించే సమయానికి అతడు కోలుకోకపోవడంతో సెలక్టర్లు డుసెన్‌ పేరును పరిశీలించలేదు.

ఇక కెప్టెన్‌ టెంబా బవుమా మాత్రం ఫిట్‌గా ఉన్నాడు. ఎడమ మోచేతికి గాయం చేసుకున్న బవుమా.. పూర్తిగా కోలుకున్నాడు. దీంతో టీ20 వరల్డ్‌కప్‌లో టీమ్‌ను బవుమానే లీడ్‌ చేయనున్నాడు. ఇక ఈ సౌతాఫ్రికా టీమ్‌లో బ్యాటర్‌ రైలీ రూసో, ఆల్‌రౌండర్‌ వేన్ పార్నెల్‌, ట్రిస్టన్‌ స్టబ్స్‌లకు కూడా చోటు దక్కింది. మొత్తం 15 మందితో కూడిన టీమ్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు.

డికాక్‌, డేవిడ్‌ మిల్లర్‌, రబాడా, ఎన్రిచ్‌ నోక్యాలాంటి స్టార్‌ ప్లేయర్స్‌ అంతా టీమ్‌లో ఉన్నారు. టీ20 వరల్డ్‌కప్‌ అక్టోబర్‌ 16 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఇక సౌతాఫ్రికా టీమ్‌ ఇండియా, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, మరో రెండు టీమ్స్ ఉన్న గ్రూప్‌లో ఉంది. ఈ వరల్డ్‌కప్‌ ప్రారంభానికి ముందు సౌతాఫ్రికా.. ఇండియాతో ఓ టీ20 సిరీస్‌ ఆడనుంది.

టీ20 వరల్డ్‌కప్‌కు సౌతాఫ్రికా టీమ్‌: టెంబా బవుమా (కెప్టెన్‌), క్వింటన్ డికాక్‌, రీజా హెండ్రిక్స్‌, హైన్రిచ్‌ క్లాసెన్‌, కేశవ్‌ మహరాజ్‌, ఐడెన్‌ మార్‌క్రమ్‌, డేవిడ్‌ మిల్లర్‌, లుంగి ఎంగిడి, ఎన్రిచ్‌ నోక్యా, వేన్‌ పార్నెల్‌, డ్వేన్‌ ప్రిటోరియస్‌, కగిసో రబాడా, రైలీ రూసో, తబ్రేజ్‌ షంసి, ట్రిస్టన్‌ స్టబ్స్‌

తదుపరి వ్యాసం