తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Salman Butt On Wpl: ఇక నుంచి భారతీయులు తమ కూతుళ్లూ క్రికెటర్లు కావాలనుకుంటారు: పాక్ మాజీ కెప్టెన్

Salman Butt on WPL: ఇక నుంచి భారతీయులు తమ కూతుళ్లూ క్రికెటర్లు కావాలనుకుంటారు: పాక్ మాజీ కెప్టెన్

Hari Prasad S HT Telugu

26 January 2023, 15:16 IST

    • Salman Butt on WPL: ఇక నుంచి భారతీయులు తమ కూతుళ్లు కూడా క్రికెటర్లు కావాలనుకుంటారని అన్నాడు పాక్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్. వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL)లో జట్లకు భారీ మొత్తం పలికిన నేపథ్యంలో అతడీ కామెంట్స్ చేశాడు.
సంచలనం సృష్టించిన వుమెన్స్ ప్రీమియర్ లీగ్ జట్ల బిడ్లు
సంచలనం సృష్టించిన వుమెన్స్ ప్రీమియర్ లీగ్ జట్ల బిడ్లు

సంచలనం సృష్టించిన వుమెన్స్ ప్రీమియర్ లీగ్ జట్ల బిడ్లు

Salman Butt on WPL: ఐపీఎల్ మాత్రమే కాదు వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) కూడా వస్తూ వస్తూనే పెను సంచలనం సృష్టించింది. ఈ లీగ్ లోని ఐదు టీమ్స్ కోసం బడా కంపెనీలు పోటీ పడగా.. చివరికి బీసీసీఐపై రూ.4669.99 కోట్ల కాసుల వర్షం కురిసింది. అదానీ స్పోర్ట్స్ లాంటి సంస్థలు కూడా ఈసారి టీమ్ ను దక్కించుకున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

మహిళల క్రికెట్ కు ఈ స్థాయి ఆదరణ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇక నుంచి భారతీయుల్లో చాలా మంది తమ కూతుళ్లను కూడా క్రికెటర్లను చేస్తారని అతడు అనడం విశేషం. తన యూట్యూబ్ ఛానెల్లో సల్మాన్ మాట్లాడుతూ.. ఇది మహిళల క్రికెట్ లో ఓ పెద్ద మార్పు అని అన్నాడు.

"వుమెన్స్ ప్రీమియర్ లీగ్ లోని ఐదు జట్లు మొదటి సీజన్ లో ఉన్న ఐపీఎల్ జట్ల కంటే కూడా ఎక్కువ మొత్తానికి అమ్ముడయ్యాయి. ఇది చాలా గొప్ప విజయం. వుమెన్స్ క్రికెట్ లో ఇదో పెద్ద మార్పు" అని సల్మాన్ అన్నాడు. డబ్ల్యూపీఎల్ తర్వాత మహిళల క్రికెట్ పూర్తిగా మారిపోనుందని అభిప్రాయపడ్డాడు.

"దీని తర్వాత మహిళల క్రికెట్ పూర్తిగా మారిపోనుంది. వాళ్లకు ఓ కొత్త దిశను ఇది సూచిస్తుంది. ప్లేయర్స్ కు ఎన్నో అవకాశాలు వస్తాయి. ఇక ఇండియాలోని చాలా మంది తమ కూతుళ్లను క్రికెటర్లను చేయాలని కలలు కంటారు" అని సల్మాన్ భట్ అన్నాడు.

"ఇది చాలా పెద్ద విషయం. ఇండియా చాలా పెద్ద అడుగు వేసింది. వుమెన్స్ క్రికెట్ లో ఈస్థాయి అడుగు వేయడం మరెవరికీ సాధ్యం కాదు. ఇది రికార్డు బ్రేకింగ్. క్రికెట్ లో మహిళల భవిష్యత్తు చాలా చాలా బాగుంటుంది. బీసీసీఐ ఇప్పటికే ఐదేళ్లకుగాను టీవీ హక్కులను అమ్మేసింది. ఈ లీగ్ అటు బోర్డుకు, ఇటు ప్లేయర్స్ కు ఉపయోగపడుతుంది. చాలా మందిని ఈ టోర్నీ ఆకర్షించనుంది" అని భట్ స్పష్టం చేశాడు.

తొలి మహిళల ఐపీఎల్లో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, లక్నో, అహ్మదాబాద్ టీమ్స్ ఉన్న విషయం తెలిసిందే. ఈ ఐదు జట్లలో అత్యధికంగా అహ్మదాబాద్ జట్టును రూ.1289 కోట్లు చెల్లించి అదానీ స్పోర్ట్స్ దక్కించుకుంది.

టాపిక్