Virat Kohli: కోహ్లీ ఒక్క అర్ధశతకం చేస్తే నోళ్లన్నీ మూతబడతాయి: రవిశాస్త్రీ
23 August 2022, 15:23 IST
- విరాట్ కోహ్లీ ఫామ్‌పై టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోహ్లీ ఆసియా కప్ తొలి మ్యాచ్‌లో అర్ధశతకం చేస్తే విమర్శకుల నోళ్లు మూతబడతయాని స్పష్టం చేశారు.
విరాట్ కోహ్లీ
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మళ్లీ ఫామ్ పుంజుకోవాలని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. బౌలర్లపై విరుచుకుపడి బ్యాటింగ్ చేసే మునుపటి కోహ్లీని చూడాలని ఆశగా చూస్తున్నారు. అయితే గత కొంతకాలంగా విరాట్ బ్యాట్ ఝుళిపించడం అటుంచి.. కనీసం క్రీజులో ఎక్కువ సేపు ఉండకపోవడమే గగనమై పోయింది. తాజాగా విరాట్ కోహ్లీపై భారత మాజీ కోచ్ రవిశాస్త్రీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒక్క అర్ధశతకం చేశాడంటే విమర్శిస్తున్న వాళ్లందరి నోళ్లూ మూతబడతాయనని స్పష్టం చేశారు.
"ఇటీవల కాలంలో విరాట్ కోహ్లీతో నేను మాట్లాడింది లేదు. కానీ స్టార్ బ్యాటర్లు సరైన సమయంలో బాగా ఆడతారు. ఆసియా కప్ కంటే ముందు కోహ్లీకి మంచి సమయం దొరికింది. అతడు తిరిగి పుంజుకునే అవకాశముంది. అతడు పాక్‌తో జరిగే తొలి మ్యాచ్‌లో 50 పరుగులు చేయగలిగితే విమర్శించే వారి నోళ్లని మూతబడతాయి. అతడు తిరిగి గాడిలో పడటానికి ఒక్క ఇన్నింగ్స్ చాలు. ఎందుకంటే అతడిలో ఇంకా పరుగుల దాహం తీరలేదు. గతంలో జరిగిందంతా చరిత్ర. ప్రజల ఏ విషయాన్ని ఎక్కువ రోజులు గుర్తుంచుకోరనేది తెలుసుకోవాలి" అని రవిశాస్త్రీ స్పష్టం చేశారు.
విరాట్ కోహ్లీ కంటే ఫిట్‌గా ఉన్న భారత క్రికెటర్ లేడని రవిశాస్త్రీ స్పష్టం చేశారు. అతడు రన్నింగ్ మెషిన్ అని, తన మనస్సును సరైన దారిలో ఉంచి తిరిగి ఫామ్ పొందడానికి ఒక్క ఇన్నింగ్స్ సరిపోతుందని తెలిపారు. అతడు కచ్చితంగా ఫామ్‌లోకి వస్తాడని, కెరీర్‌లో అత్యుత్తమ ఫామ్ పొందుతాడని తెలిపాడు. అతడి పరుగుల దాహం నమ్మశక్యం కాని రీతిలో ఉంటుందని చెప్పాడు.
ఆసియా కప్‌లో తన చిరకాల ప్రత్యర్థితో భారత్ ఆడబోయే ఓపెనింగ్ మ్యాచ్‌లో కోహ్లీ బ్యాట్ ఝుళిపించాలని అభిమానులు కోరుకుంటున్నారు. పాక్‌తో జరిగిన మ్యాచ్ ఏడు మ్యాచ్‌ల్లో అతడు 77.75 సగటుతో 311 పరుగులు చేశాడు. అంతేకాకుండా మూడు సార్లు నాటౌట్‌గా నిలిచాడు. ఇప్పటి వరకు 35 ఫోర్లు, ఐదు సిక్సర్లను కొట్టాడు.