Asia Cup 2022: ఆసియా కప్‌ క్వాలిఫయర్స్‌.. బరిలో ఉన్న టీమ్స్‌ ఇవే-asia cup 2022 qualifiers to begin from tomorrow ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Asia Cup 2022: ఆసియా కప్‌ క్వాలిఫయర్స్‌.. బరిలో ఉన్న టీమ్స్‌ ఇవే

Asia Cup 2022: ఆసియా కప్‌ క్వాలిఫయర్స్‌.. బరిలో ఉన్న టీమ్స్‌ ఇవే

Hari Prasad S HT Telugu
Aug 19, 2022 03:51 PM IST

Asia Cup 2022: అసలు ఆసియాకప్‌ టోర్నీ ప్రారంభమయ్యే ముందు క్వాలిఫయర్స్‌ జరగనున్నాయి. శనివారం (ఆగస్ట్‌ 20) నుంచి ప్రారంభం కాబోయే ఈ క్వాలిఫయర్స్‌ నుంచి ఒక టీమ్‌ మెయిన్‌ టోర్నీకి క్వాలిఫై అవుతుంది.

ఆసియా కప్ క్వాలిఫయర్స్ మ్యాచ్ లకు వేదిక కానున్న ఒమన్
ఆసియా కప్ క్వాలిఫయర్స్ మ్యాచ్ లకు వేదిక కానున్న ఒమన్

దుబాయ్‌: ఆసియాకప్‌ ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఆరు టీమ్స్‌ ఇందులో పాల్గొంటున్నాయి. ఇప్పటికే ఐదు టీమ్స్‌ తేలగా.. మరో టీమ్‌ కోసం క్వాలిఫయర్స్‌ జరగనున్నాయి. ఈసారి క్వాలిఫయర్స్‌లో హాంకాంగ్‌, సింగపూర్‌, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ), కువైట్‌ తలపడుతున్నాయి. వీటిలో విజేతగా నిలిచిన టీమ్‌ ఇండియా, పాకిస్థాన్‌తో ఆడనుంది.

శనివారం (ఆగస్ట్‌ 20) నుంచి ప్రారంభం కానున్న క్వాలిఫయర్స్‌ మ్యాచ్‌లన్నీ ఒమన్‌లోని అల్‌ అమరత్‌లో జరుగుతాయి. 2018లో జరిగిన ఆసియాకప్‌లో హాంకాంగ్‌ ఆడింది. ఈసారి ఆ ఛాన్స్‌ ఎవరు దక్కించుకుంటారో చూడాలి. ఈ నెల 24 వరకూ క్వాలిఫయర్స్‌ జరుగుతాయి. అత్యధిక విజయాలు సాధించిన టీమ్‌ క్వాలిఫై అవుతుంది. క్రికెట్‌లో ఈ టీమ్స్‌ అన్నీ పసికూనలే.

అయితే ఈసారి తమ సొంతగడ్డపై జరగబోయే ఆసియాకప్‌ ప్రధాన టోర్నీకి క్వాలిఫై కావాలని యూఏఈ భావిస్తోంది. మిగతా టీమ్స్‌తో పోలిస్తే ఆ టీమ్‌ కాస్త బలంగా ఉంది. ఈ క్వాలిఫయర్స్‌ మ్యాచ్‌లన్నింటినీ ఫాన్‌కోడ్‌ (Fancode) యాప్‌లో లైవ్‌ చూడొచ్చు. శనివారం (ఆగస్ట్‌ 20) తొలి మ్యాచ్‌లో సింగపూర్‌, హాంకాంగ్‌ తలపడనున్నాయి.

భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్‌ రాత్రి 7.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఇక రెండో మ్యాచ్‌లో ఆదివారం యూఏఈ, హాంకాంగ్‌.. మూడో మ్యాచ్‌లో సోమవారం యూఏఈ, సింగపూర్‌, నాలుగో మ్యాచ్‌లో మంగళవారం కువైట్‌, హాంకాంగ్‌, ఐదో మ్యాచ్‌లో బుధవారం సింగపూర్‌, కువైట్‌.. ఆరో మ్యాచ్‌లో బుధవారం హాంకాంగ్‌, యూఏఈ తలపడతాయి.

WhatsApp channel

సంబంధిత కథనం