Asia Cup: ఆసియాకప్‌లోనే మూడుసార్లు ఇండియా vs పాకిస్థాన్‌.. ఎలాగో చూస్తారా?-india and pakistan may lock horn for 3 times in asia cup here is how ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Asia Cup: ఆసియాకప్‌లోనే మూడుసార్లు ఇండియా Vs పాకిస్థాన్‌.. ఎలాగో చూస్తారా?

Asia Cup: ఆసియాకప్‌లోనే మూడుసార్లు ఇండియా vs పాకిస్థాన్‌.. ఎలాగో చూస్తారా?

Hari Prasad S HT Telugu
Aug 04, 2022 01:32 PM IST

Asia Cup: క్రికెట్‌లో ఇండియా, పాకిస్థాన్‌ తలపడక సుమారు 9 నెలలు అవుతోంది. గతేడాది టీ20 వరల్డ్‌కప్‌లో ఆడిన ఈ రెండు టీమ్స్‌ మళ్లీ ఇప్పుడు ఆసియా కప్‌లో తలపడబోతున్నాయి. అయితే ఈ ఒక్క టోర్నీలోనే మూడుసార్లు దాయాదుల పోరు జరిగే అవకాశం ఉంది. ఎలాగో మీరూ చూడండి.

ఆసియా కప్ లో ఆసక్తి రేపుతున్న దాయాదుల సమరం
ఆసియా కప్ లో ఆసక్తి రేపుతున్న దాయాదుల సమరం

దుబాయ్‌: ఇండియా, పాకిస్థాన్ క్రికెట్‌ మ్యాచ్‌ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌కు ఓ గుడ్‌ న్యూస్‌. ఒక్క టోర్నీలోనే ఈ దాయాదులు మూడుసార్లు తలపడే సూచనలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. రాబోయే ఆసియా కప్‌లోనే అది జరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఆసియా కప్‌ 2022 షెడ్యూల్‌ను చూస్తే అది సాధ్యమయ్యే అవకాశాలు ఉన్నాయి.

అంటే కేవలం 15 రోజుల వ్యవధిలో మూడు ఇండియా, పాకిస్థాన్‌ క్రికెట్‌ మ్యాచ్‌లన్నమాట. అదెలాగో ఇప్పుడు చూద్దాం. ఆరు టీమ్స్‌ పాల్గొంటున్న ఈ టోర్నీలో ఇండియా, పాకిస్థాన్‌ గ్రూప్‌ ఎలో ఉన్నాయి. ఇవి కాకుండా ఓ క్వాలిఫయింగ్‌ టీమ్‌ ఈ గ్రూప్‌లో ఆడుతుంది. ఇండియా, పాకిస్థాన్‌ మధ్య లీగ్‌ మ్యాచ్‌ ఈ నెల 28న జరుగుతుంది. ఇది టోర్నీ షెడ్యూల్‌ ప్రకారం జరిగే మ్యాచ్‌.

ఇది కాకుండా వారం తర్వాత అంటే సెప్టెంబర్‌ 4న సూపర్‌ 4లో భాగంగా ఈ రెండు టీమ్స్ మరోసారి తలపడే ఛాన్స్‌ ఉంది. ఈసారి సెమీఫైనల్స్‌ లేకపోవడమే ఆసియాకప్ ప్రత్యేకత. తొలి రౌండ్‌ తర్వాత టాప్ 4 టీమ్స్‌ సూపర్‌ 4కి వెళ్తాయి. అక్కడ ఒక్కో టీమ్‌ మిగిలిన మూడు టీమ్స్‌తో ఆడాల్సి ఉంటుంది. గ్రూప్‌ ఎ నుంచి సంచలనాలు జరిగితే తప్ప ఇండియా, పాకిస్థాన్‌ సూపర్‌ 4కి చేరడం ఖాయం.

ఈ గ్రూప్‌ నుంచి వచ్చిన టాప్ 2 టీమ్స్‌ సెప్టెంబర్‌ 4న తలపడతాయి. అవి ఇండియా, పాకిస్థాన్‌ అయ్యే అవకాశాలే ఎక్కువ కాబట్టి రెండో దాయాదుల పోరు చూడొచ్చు. ఇక ప్రస్తుతం ఈ రెండు టీమ్స్‌ ఫామ్‌ చూస్తుంటే.. ఆసియాకప్‌ ఫైనల్‌ చేరే అవకాశాలు కూడా వీటికే ఎక్కువగా ఉన్నాయి. ఆసియా కప్‌లో ఇవి రెండు కాకుండా శ్రీలంక, బంగ్లాదేశ్‌, ఆఫ్ఘనిస్థాన్‌ కూడా ఉన్నాయి.

శ్రీలంక పరిస్థితి ఇప్పుడెలా ఉందో అందరికీ తెలుసు. ఇక బంగ్లాదేశ్‌, ఆఫ్ఘనిస్థాన్‌ పెద్ద టీమ్స్‌కు షాకిచ్చే అలవాటు ఉన్నవే. అయితే ఈ ఏడాది టీమిండియాతోపాటు పాకిస్థాన్‌ ఉన్న ఫామ్‌ చూస్తే వీటిని వెనక్కి నెట్టి ఆ మూడు టీమ్స్‌లో రెండు లేదా ఒక్క టీమ్‌ అయినా ఫైనల్‌ చేరే అవకాశాలు తక్కువే అని చెప్పొచ్చు.

అదే జరిగితే ఫైనల్లోనూ దాయాదుల సమరం తప్పదు. ఆ లెక్కన సెప్టెంబర్‌ 11న మరోసారి ఆసియా కప్‌ టైటిల్‌ కోసం ఇండియా, పాకిస్థాన్‌ అమీతుమీ తేల్చుకుంటాయి. గతేడాది టీ20 వరల్డ్‌కప్‌లో పాక్‌ చేతిలో 10 వికెట్లతో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవడానికి ఇండియాకు ఇంతకుమించిన అవకాశం మరొకటి ఉండదు.

WhatsApp channel

సంబంధిత కథనం