Asia Cup 2022: ఆసియాకప్‌లో ఇండియా vs పాకిస్థాన్‌.. థ్రిల్లింగ్‌ మ్యాచ్‌లు ఇవే-these are the thrilling matches between india and pakistan in asia cup over the years ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Asia Cup 2022: ఆసియాకప్‌లో ఇండియా Vs పాకిస్థాన్‌.. థ్రిల్లింగ్‌ మ్యాచ్‌లు ఇవే

Asia Cup 2022: ఆసియాకప్‌లో ఇండియా vs పాకిస్థాన్‌.. థ్రిల్లింగ్‌ మ్యాచ్‌లు ఇవే

Hari Prasad S HT Telugu
Aug 19, 2022 10:47 AM IST

Asia Cup thrilling matches: ఇండియా, పాకిస్థాన్‌ క్రికెట్‌ ఫీల్డ్‌లో ఎప్పుడూ తలపడినా ఫ్యాన్స్‌కు పండగే. అయితే ఆసియాకప్‌లో ఈ రెండు టీమ్స్‌ మధ్య ఫైట్‌ మరింత ఆసక్తికరంగా సాగింది. నాలుగు మ్యాచ్‌లు థ్రిల్లింగ్‌ ఫినిష్‌లతో ఉత్కంఠ రేపాయి.

ఉద్రిక్తంగా సాగిన 2010 ఆసియకప్ మ్యాచ్
ఉద్రిక్తంగా సాగిన 2010 ఆసియకప్ మ్యాచ్ (twitter)

Asia Cup thrilling matches: ఆసియా కప్‌ 2022కు టైమ్‌ దగ్గర పడుతోంది. ఈ టోర్నీలో భాగంగా ఇండియా, పాకిస్థాన్‌ ఈ నెల 28న తమ తొలి మ్యాచ్‌లో ఆడబోతున్నాయి. ఆసియా కప్‌లో ఇప్పటివరకూ ఈ రెండు టీమ్స్‌ మధ్య 14 మ్యాచ్‌లు జరగగా.. ఇండియానే 8 విజయాలతో పైచేయి సాధించింది. అయితే ఈ 14 మ్యాచ్‌లలో నాలుగు మ్యాచ్‌లు మాత్రం తీవ్ర ఉత్కంఠ రేపాయి. ఫ్యాన్స్‌కు అసలుసిసలు ఇండోపాక్‌ మ్యాచ్‌ మజాను అందించాయి. ఆ మ్యాచ్‌లేవో ఇప్పుడు చూద్దాం.

1986 ఆసియా కప్‌ ఫైనల్‌.. మియాందాద్‌ సిక్స్‌

<p>చివరి బాల్ కు సిక్స్ కొట్టిన మియాందాద్</p>
చివరి బాల్ కు సిక్స్ కొట్టిన మియాందాద్ (Twitter)

ఆసియా కప్‌లోనే కాదు వన్డే క్రికెట్‌ హిస్టరీలోనే థ్రిల్లింగ్‌ మ్యాచ్‌లలో ఒకటిగా నిలిచిపోతుంది 1986 టోర్నీలో జరిగిన ఫైనల్. ఆ ఫైనల్లో చివరి బాల్‌కు సిక్స్‌ కొట్టి పాకిస్థాన్‌ను విజేతగా నిలిపాడు జావెద్‌ మియాందాద్‌. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన ఇండియా 246 రన్స్ చేసింది. గవాస్కర్‌ 92, వెంగ్‌సర్కార్‌ 50 రన్స్‌ చేశారు. తర్వాత బౌలింగ్‌లో చేతన్‌ శర్మ మూడు వికెట్లు తీసి పాక్‌ను దెబ్బతీశాడు.

ఈ మ్యాచ్‌లో ఇండియా విజయం ఖాయమని భావించారు. చివరి బంతికి 4 రన్స్‌ అవసరం కాగా.. మియాందాద్‌ స్ట్రైక్‌లో ఉన్నాడు. బౌండరీని ఆపాలన్న ఉద్దేశంతో ఫీల్డర్లందరినీ దగ్గరగా పిలిచి టైట్‌ ఫీల్డింగ్‌ ఏర్పాటు చేశారు. ప్లాన్‌కు అనుగుణంగా చేతన్‌ యార్కర్‌ వేశాడు. అయితే అది లో ఫుల్‌టాస్‌గా రావడంతో మియందాద్‌ సిక్స్‌ కొట్టాడు. ఈ ఒక్క సిక్స్‌ చేతన్‌ శర్మ క్రికెట్‌ కెరీర్‌ను పాడు చేసింది.

2010 ఆసియా కప్‌.. భజ్జీ ఆన్‌ ఫైర్‌

2010 ఆసియా కప్‌ థ్రిల్లింగ్‌ ఇండోపాక్‌ మ్యాచ్‌నే కాదు.. ప్లేయర్స్‌ మధ్య కూడా కొన్ని ఉద్రిక్త పరిస్థితులకు కారణమైంది. ఈ మ్యాచ్‌లో అక్మల్, గంభీర్‌.. షోయబ్‌ అక్తర్‌, హర్భజన్‌ సింగ్‌ మధ్య గొడవలు జరిగాయి. ఈ మ్యాచ్‌కు ఇండియా హాట్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్థాన్‌ 49.3 ఓవర్లలో 267 రన్స్‌ చేసింది. తర్వాత ఇండియా చేజింగ్‌ను ఘనంగా మొదలుపెట్టింది.

అయితే కీలకమైన సమయంలో వికెట్లు కోల్పోయి మ్యాచ్‌ ఓడిపోయేలా కనిపించింది. కానీ చివర్లో హర్భజన్‌ సింగ్‌ మెరుపులు ఇండియాకు ఊహించని విజయాన్ని అందించాయి. చివరి ఓవర్లో రెండు భారీ సిక్స్‌లు కొట్టిన భజ్జీ.. మరో బాల్‌ మిగిలి ఉండగానే 3 వికెట్లతో గెలిచింది. టీమ్‌ను గెలిపించిన తర్వాత హర్భజన్‌.. అక్తర్‌ను కవ్విస్తూ సంబరాలు చేసుకున్నాడు.

2014 ఆసియా కప్‌.. వికెట్‌ తేడాతో గెలిచిన పాక్‌

<p>పాకిస్థాన్ ను వికెట్ తేడాతో గెలిపించిన అఫ్రిది</p>
పాకిస్థాన్ ను వికెట్ తేడాతో గెలిపించిన అఫ్రిది (twitter)

2014లో ఢాకాలో జరిగిన ఇండియా, పాకిస్థాన్‌ మ్యాచ్‌ కూడా చాలా థ్రిల్లింగ్‌గా సాగింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన ఇండియా 8 వికెట్లకు 245 రన్స్‌ చేసింది. రోహిత్, రాయుడు, జడేజా హాఫ్‌ సెంచరీలు చేశారు. పాక్‌ తరఫున సయీద్‌ అజ్మల్‌ 3 వికెట్లు తీశాడు. చేజింగ్‌లో మహ్మద్‌ హఫీజ్ 75 రన్స్‌ చేశాడు. అయితే మరోవైపు పాక్ వరుసగా వికెట్లు కోల్పోయింది.

దీంతో ఇండియా ఈ మ్యాచ్‌ గెలుస్తుందని అందరూ భావించారు. అయితే చివర్లో షాహిద్‌ అఫ్రిది మెరుపులు ఇండియాకు మ్యాచ్‌ను దూరం చేశాయి. ఈ మ్యాచ్‌లో అఫ్రిది కేవలం 18 బాల్స్‌లోనే 34 రన్స్‌ చేశాడు. అశ్విన్‌ వేసిన చివరి ఓవర్లో రెండు సిక్స్‌లు బాది కేవలం మరో బాల్‌ మిగిలి ఉండగా వికెట్‌ తేడాతో పాక్‌ను గెలిపించాడు.

1984 ఆసియా కప్‌.. ఫేవరెట్‌ పాక్‌ను చిత్తు చేసి..

1983లో తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఊపుమీదుంది ఇండియన్‌ టీమ్‌. ఇలాంటి పరిస్థితుల్లో 1984లో తొలిసారి ఆసియాకప్‌ జరిగింది. అప్పటికి పాకిస్థాన్‌ టీమ్‌ బలంగా ఉండటంతో ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. కానీ పాక్‌ను బోల్తా కొట్టించి ఇండియా కప్పు ఎగరేసుకుపోయింది. ముఖ్యంగా ఈ రెండు టీమ్స్‌ మధ్య జరిగిన ఫైనల్‌ రంజుగా సాగింది.

ఈ ఫైనల్లో పాకిస్థాన్‌ బౌలింగ్‌ ధాటికి ఇండియా కేవలం 188 రన్స్‌ చేసింది. ఆ స్కోరును కాపాడుకునే బౌలర్లు ఇండియా దగ్గర లేరు అన్న విషయం పాకిస్థాన్‌కు తెలుసు. అందుకు తగినట్లే అందరు బౌలర్లను పాక్‌ దీటుగా ఎదుర్కొంది. అయితే రోజర్‌ బిన్నీ మ్యాజిక్‌ చేశాడు. కీలకమైన సమయంలో జహీర్‌ అబ్బాస్‌, ఖాసిం ఉమర్‌ వికెట్లు తీసి పాక్‌ను దెబ్బ తీశాడు. ఆ తర్వాత రవిశాస్త్రి కూడా మోహ్‌సిన్ ఖాన్‌, ముదస్సర్‌ నజర్‌ వికెట్లు తీశాడు. పైగా ఫీల్డింగ్‌లో చురుగ్గా ఉన్న టీమ్‌.. నలుగురు పాక్‌ బ్యాటర్లను రనౌట్‌ చేసింది. దీంతో అసాధ్యమనకున్న విజయం దక్కింది. పాక్‌ కేవలం 134 రన్స్‌కే చాప చుట్టేసింది.

WhatsApp channel

సంబంధిత కథనం