తెలుగు న్యూస్  /  Sports  /  Rahul Dravid On World Cup Team Says Core Team Of 17 To 18 Players Are Ready

Rahul Dravid on World Cup Team: వరల్డ్ కప్ టీమ్ రెడీ అయిపోయింది: రాహుల్ ద్రవిడ్

Hari Prasad S HT Telugu

21 March 2023, 21:43 IST

  • Rahul Dravid on World Cup Team: వరల్డ్ కప్ టీమ్ రెడీ అయిపోయిందని అన్నాడు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్. ఇప్పటికే 17-18 మంది కోర్ టీమ్ సిద్ధంగా ఉందని చెప్పడం గమనార్హం.

టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్
టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ (ANI)

టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్

Rahul Dravid on World Cup Team: ఇది వన్డే వరల్డ్ కప్ ఏడాది. 2019లో కొద్దిలో మిస్ అయిన ఈ వరల్డ్ కప్ ను ఈసారి స్వదేశంలో ఎలాగైనా సాధించాలన్న పట్టుదలతో టీమిండియా ఉంది. అందుకే ఈ ఏడాది మొదటి నుంచీ వన్డేలపై ఎక్కువగా దృష్టి సారిస్తోంది. ఈ ఏడాది ఇప్పటికే స్వదేశంలో 9 వన్డేలు ఆడింది. అయితే ఈ మ్యాచ్ ల నుంచే వరల్డ్ కప్ టీమ్ దాదాపు సిద్ధమైపోయిందని హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ చెప్పడం విశేషం.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

వరల్డ్ కప్ కోర్ టీమ్ అయిన 17-18 మంది ప్లేయర్స్ ను తాము ఇప్పటికే ఎంపిక చేసినట్లు చెప్పాడు. నిజానికి 2019 వరల్డ్ కప్ నుంచి ఇప్పటి వరకూ ఇండియా 53 వన్డేలు ఆడింది. అయితే గాయాలు, పని భారాన్ని తగ్గించడంలాంటి నిర్ణయాలతో వీటిలో ఎంతో మంది ప్లేయర్స్ కు విశ్రాంతి ఇవ్వడం, అవకాశాలు ఇవ్వడం చేశారు. కానీ వరల్డ్ కప్ మరో ఆరు నెలలు మాత్రమే ఉండటంతో ఇక నుంచి ఈ కోర్ టీమ్ ప్లేయర్స్ కే ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు ద్రవిడ్ చెప్పాడు.

"మన కండిషన్స్ లో మరెన్నో మ్యాచ్ లు ఆడే అవకాశం రాకపోవచ్చు. ఈ కండిషన్స్ లో ఆడే అవకాశం రావడం గొప్ప అవకాశమనే చెప్పాలి. ఐపీఎల్ పక్కన పెడితే ఇప్పటికే ఎలాంటి టీమ్ కావాలన్నదానిపై మాకో స్పష్టత వచ్చింది. టీమ్ ను ఇప్పటికే 17-18 మంది ప్లేయర్స్ కు కుదించాము" అని మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ద్రవిడ్ చెప్పాడు.

బుమ్రా, శ్రేయస్ అయ్యర్ లాంటి వాళ్లకు గాయాలవడంపై ఆందోళన వ్యక్తమవుతున్నా ద్రవిడ్ మాత్రం.. ఇప్పుడున్న టీమ్ బాగానే ఉందని అన్నాడు. "ఇండియాలో వికెట్లు స్పిన్ అవుతాయన్న ఆలోచనలోనే ఉంటాము. మనం అలా అనుకుంటాం. కానీ గత రెండు మ్యాచ్ లలో పిచ్ లు అంతగా స్పిన్ అవలేదు. వరల్డ్ కప్ లో ఎలాంటి పిచ్ లు ఎదురవుతాయో చెప్పలేము" అని ద్రవిడ్ అభిప్రాయపడ్డాడు.

"లీగ్ దశలో 9 నగరాల్లో మ్యాచ్ లు ఉన్నాయి. అది కూడా అక్టోబర్ లో. ఐపీఎల్లో అది కూడా వేసవిలో కావడంతో వికెట్లు మరీ అంతలా మారిపోయే అవకాశాలు కనిపించడం లేదు" అని ద్రవిడ్ అన్నాడు. ఇక మిడిల్ ఓవర్లలో ఓ లెగ్ స్పిన్నర్ ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. అందుకే తాము కుల్దీప్ యాదవ్ కు వరుస అవకాశాలు ఇస్తున్నట్లు తెలిపాడు.