తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Messi Record In Fifa World Cup: ఫిఫా వరల్డ్‌కప్‌లో మెస్సీ అరుదైన రికార్డు

Messi Record in FIFA World Cup: ఫిఫా వరల్డ్‌కప్‌లో మెస్సీ అరుదైన రికార్డు

Hari Prasad S HT Telugu

22 November 2022, 16:37 IST

google News
    • Messi Record in FIFA World Cup: ఫిఫా వరల్డ్‌కప్‌లో మెస్సీ అరుదైన రికార్డు సృష్టించాడు. మంగళవారం (నవంబర్‌ 22) సౌదీ అరేబియాతో మ్యాచ్‌లో అర్జెంటీనాకు గోల్‌ సాధించిపెట్టిన మెస్సీ హిస్టరీ క్రియేట్‌ చేశాడు.
ఫిఫా వరల్డ్ కప్ లో మెస్సీ అరుదైన రికార్డు
ఫిఫా వరల్డ్ కప్ లో మెస్సీ అరుదైన రికార్డు (REUTERS)

ఫిఫా వరల్డ్ కప్ లో మెస్సీ అరుదైన రికార్డు

Messi Record in FIFA World Cup: అర్జెంటీనా స్టార్‌ ప్లేయర్‌ లియోనెల్‌ మెస్సీ ఫిఫా వరల్డ్‌కప్‌ 2022లో తాను ఆడిన తొలి మ్యాచ్‌లోనే చరిత్ర సృష్టించాడు. సౌదీ అరేబియాతో మ్యాచ్‌లో గోల్ చేసిన అతడు.. రికార్డు క్రియేట్‌ చేశాడు. నాలుగు ఫిఫా వరల్డ్‌కప్‌ టోర్నమెంట్లలో గోల్‌ చేసిన తొలి అర్జెంటీనా ప్లేయర్‌గా మెస్సీ నిలిచాడు.

ఖతార్‌లోని అతిపెద్ద ఫుట్‌బాల్‌ స్టేడియంలో లూసెయిల్‌లో ఈ మ్యాచ్‌ జరిగింది. ఇందులో 35 ఏళ్ల మెస్సీ.. 8వ నిమిషంలోనే అర్జెంటీనాకు వచ్చిన పెనాల్టీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. సౌదీ గోల్‌ కీపర్‌ను బోల్తా కొట్టించి గోల్‌పోస్ట్‌లోని మరో మూలకు బంతిని తరలించాడు. దీంతో అర్జెంటీనా 1-0 ఆధిక్యంలో దూసుకెళ్లింది.

మెస్సీ 2006, 2014, 2018లలోనూ అర్జెంటీనా తరఫున గోల్స్‌ చేశాడు. ఇక ఇప్పుడు 2022లో నాలుగో వరల్డ్‌కప్‌లో గోల్‌ చేసి ఈ ఘనత సాధించిన తొలి అర్జెంటీనా ప్లేయర్‌గా నిలిచాడు. ఇలా నాలుగు వరల్డ్‌కప్‌లలో గోల్స్‌ చేసిన ఐదో ప్లేయర్‌ మెస్సీ. ఇంతకుముందు బ్రెజిల్‌కు చెందిన పీలే, జర్మనీకి చెందిన ఊవ్‌ సీలర్‌, మిరొస్లావ్‌ క్లోజ్‌, పోర్చుగల్‌ ప్లేయర్‌ క్రిస్టియానో రొనాల్డోలు ఈ ఘనత సాధించారు.

ఈ తరం ప్లేయర్స్‌లో గ్రేటెస్ట్‌లలో ఒకడిగా మెస్సీ పేరుగాంచినా.. ఇప్పటి వరకూ అతని వరల్డ్‌కప్‌ కల మాత్రం నెరవేరలేదు. 2014లో దగ్గరి వరకూ వచ్చినా ఫైనల్లో ఓటమి తప్పలేదు. దీంతో ఆ తర్వాతి అతడు ఆటకు రిటైర్మెంట్ ప్రకటించి.. మళ్లీ వచ్చాడు. 2018 వరల్డ్‌కప్‌లో ఆడాడు. ఈసారి ఎలాగైనా తన టీమ్‌కు కప్పు సాధించి పెట్టాలన్న కృతనిశ్చయంతో ఉన్నాడు.

తదుపరి వ్యాసం