Budweiser Beers for FIFA world cup winners: వరల్డ్‌కప్‌ గెలిచిన దేశానికే ఆ బీర్లన్నీ.. బడ్‌వైజర్‌ బంపర్‌ ఆఫర్‌-budweiser beers for fifa world cup winners says the company through twitter ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Budweiser Beers For Fifa World Cup Winners: వరల్డ్‌కప్‌ గెలిచిన దేశానికే ఆ బీర్లన్నీ.. బడ్‌వైజర్‌ బంపర్‌ ఆఫర్‌

Budweiser Beers for FIFA world cup winners: వరల్డ్‌కప్‌ గెలిచిన దేశానికే ఆ బీర్లన్నీ.. బడ్‌వైజర్‌ బంపర్‌ ఆఫర్‌

Hari Prasad S HT Telugu
Nov 22, 2022 04:21 PM IST

Budweiser Beers for FIFA world cup winners: వరల్డ్‌కప్‌ గెలిచిన దేశానికే ఆ బీర్లన్నీ ఇస్తామంటూ బడ్‌వైజర్‌ బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది. ఇంతకీ ఏంటా బీర్లు? గెలిచిన దేశానికే ఎందుకు ఇస్తామని బడ్‌వైజర్‌ కంపెనీ అంటోందో చూద్దాం.

నిషేధంతో గోడౌన్లలో పోగుపడిన బడ్‌వైజర్‌ బీర్లు
నిషేధంతో గోడౌన్లలో పోగుపడిన బడ్‌వైజర్‌ బీర్లు

Budweiser Beers for FIFA world cup winners: ఫిఫా వరల్డ్‌కప్‌ 2022 ఖతార్‌లో జరుగుతోంది. ఇది ఇస్లామిక్‌ దేశం కావడంతో ఇక్కడ వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లు చూస్తూ బీర్లు తాగాలన్న అభిమానుల ఆశలు నెరవేరలేదు. ఆతిథ్య హక్కులు పొందే సమయంలో అంటే 2009లో ఆల్కహాల్‌ అమ్మకాలకు ఖతార్‌ ఓకే చెప్పినా.. వరల్డ్‌కప్‌ ప్రారంభానికి కొన్ని రోజుల ముందు నో చెప్పింది.

దీంతో ఫిఫాతో స్పాన్సర్‌షిప్‌ ఒప్పందం కుదుర్చుకున్న బడ్‌వైజర్‌ సంస్థ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. వరల్డ్‌కప్‌లో అమ్మకాల కోసం భారీ ఎత్తున బీర్లను తయారు చేసి గోడౌన్లలో ఉంచింది. వీటిని స్టేడియాల దగ్గర, ఫ్యాన్‌ జోన్లలో అమ్మాలని చూసింది. అయితే ఖతార్‌ రూల్స్‌ ప్రకారం పబ్లిక్‌ ప్లేస్‌లలో ఆల్కహాల్ తాగడం నిషేధం కావడంత ఇందుకు అనుమతి దక్కలేదు.

ఇప్పుడా పోగుపడిన బీర్లన్నింటినీ ఏం చేయాలా అని ఆలోచించిన బడ్‌వైజర్‌.. చివరికి ఓ అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. ఈ బీర్లన్నింటినీ వరల్డ్‌కప్ గెలిచిన దేశానికే ఇచ్చేస్తామని అనౌన్స్‌ చేసింది. ఈ మేరకు మంగళవారం ఆ సంస్థ ఓ ట్వీట్‌ చేసింది. "కొత్త రోజు, కొత్త ట్వీట్. గెలిచే దేశం బడ్స్‌ను గెలుచుకుంటుంది. వీటిని ఎవరు అందుకుంటారు?" అని బడ్‌వైజర్‌ ట్వీట్ చేసింది. దీంతోపాటు ఓ వేర్‌హౌజ్‌లో పెద్ద ఎత్తున పోగుపడిన బీర్‌ క్యాన్ల ఫొటోను పోస్ట్‌ చేసింది.

నిజానికి మొదట్లో వరల్డ్‌కప్‌ జరిగే నెల రోజుల పాటు ప్రతి మ్యాచ్‌కు మూడు గంటల ముందు, గంట తర్వాత టికెట్‌ అమ్మకాలు జరిగే ప్రాంతంలో బీర్లు అమ్మడానికి అనుమతించారు. కానీ ఇప్పుడు మాత్రం ఆల్కహాల్‌ లేని డ్రింక్స్‌ను మాత్రమే అంటే బడ్‌ జీరోలనే అమ్మాలని నిర్వాహకులు స్పష్టం చేశారు. బీర్ల అమ్మకాలపై నిషేధం కారణంగా ఫిఫాకు 7 కోట్ల డాలర్ల నష్టం వాటిల్లనుంది.

ఫిఫాతో బడ్‌వైజర్‌ కంపెనీకి 11.2 కోట్ల డాలర్ల స్పాన్సర్‌షిప్ ఒప్పందం ఉంది. ఇది కాకుండా 2026 వరల్డ్‌కప్‌ కోసం అదనంగా 17 కోట్ల డాలర్ల ఒప్పందం కూడా ఉంది.

Whats_app_banner