FIFA World Cup 2022: వరల్డ్‌కప్‌కు వస్తూ 1800 కిలోల మాంసం వెంట తెచ్చుకున్న అర్జెంటీనా, ఉరుగ్వే టీమ్స్‌-fifa world cup 2022 nears as argentina and uruguay teams send 1800 kg meat for players
Telugu News  /  Sports  /  Fifa World Cup 2022 Nears As Argentina And Uruguay Teams Send 1800 Kg Meat For Players
ఖతార్ లో ల్యాండవుతున్న అర్జెంటీనా టీమ్
ఖతార్ లో ల్యాండవుతున్న అర్జెంటీనా టీమ్ (AFP)

FIFA World Cup 2022: వరల్డ్‌కప్‌కు వస్తూ 1800 కిలోల మాంసం వెంట తెచ్చుకున్న అర్జెంటీనా, ఉరుగ్వే టీమ్స్‌

18 November 2022, 18:17 ISTHari Prasad S
18 November 2022, 18:17 IST

FIFA World Cup 2022: వరల్డ్‌కప్‌కు వస్తూ 1800 కిలోల మాంసం వెంట తెచ్చుకున్నాయి అర్జెంటీనా, ఉరుగ్వే టీమ్స్‌. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. స్వదేశంలో ఉన్న రుచే ప్లేయర్స్‌కు అక్కడా అందించాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాయి.

FIFA World Cup 2022: ఫిఫా వరల్డ్‌కప్‌ వచ్చేసింది. ఆదివారమే (నవంబర్‌ 20) ఆతిథ్య ఖతార్‌, ఈక్వెడార్‌ మధ్య తొలి మ్యాచ్‌ జరగనుంది. అయితే ఈలోపు ఓ ఇంట్రెస్టింగ్‌ విషయం ఫ్యాన్స్‌ను ఆకర్షించింది. ఈ వరల్డ్‌కప్‌కు వస్తున్న అర్జెంటీనా, ఉరుగ్వే టీమ్స్‌ తమ వెంట 4 వేల పౌండ్ల (1800 కిలోలు) మాంసాన్ని తెచ్చుకోవడం విశేషం.

హోమ్‌ ఫుడ్‌ టేస్ట్‌ను తమ ప్లేయర్స్‌కు అందించాలన్న ఉద్దేశంతో ఈ సౌత్‌ అమెరికా టీమ్స్‌ ఈ నిర్ణయం తీసుకున్నాయి. అయితే ఇంత భారీ మొత్తంలో ఉన్న ఆహారాన్ని ఖతార్‌కు తీసుకెళ్లడం అధికారులకు ఓ సవాలే అయింది. దీనికోసం భారీ ఏర్పాట్లే చేశారు. ఉరుగ్వే టీమ్‌ విషయానికి వస్తే ఉరుగ్వే నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మీట్‌ అక్కడి ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌తో డీల్‌ కుదుర్చుకొని ఈ మాంసాన్ని సప్లై చేస్తోంది.

ప్రపంచంలో తమదే బెస్ట్‌ మాంసం అంటూ దీనిని ఉరుగ్వే నుంచి ఖతార్‌కు తీసుకెళ్తున్నారు. మాంసంతో ఉరుగ్వే, అర్జెంటీనాల్లో తయారు చేసే ప్రత్యేక వంటకం అసాడో. దీనిని ప్రత్యేకంగా ఈ రెండు దేశాల నుంచి ఖతార్‌కు తీసుకెళ్లారు. యూఏఈతో జరిగిన వామప్‌ మ్యాచ్‌లో 5-0 తో గెలిచిన తర్వాత ఈ అసాడోను అర్జెంటీనా టీమ్‌ ఎంజాయ్‌ చేసింది.

అటు ఉరుగ్వే టీమ్‌ కూడా అబుదాబి స్టేడియంలో తమ అసాడోను టేస్ట్ చేసింది. ఇలా ఈ రెండు టీమ్స్‌లాగా ప్రత్యేకంగా ఫుడ్‌ను కూడా వెంట తెచ్చుకున్న టీమ్‌ మరొకటి లేదు. ఫుట్‌బాల్‌ను, తమ ఫుడ్‌ను బాగా ఎంజాయ్ చేసే ఉరుగ్వే, అర్జెంటీనా టీమ్స్‌ ఎక్కడికెళ్లినా ఇలాగే చేస్తుంటాయి. ఇది తమ సంస్కృతిలో భాగమని కూడా అర్జెంటీనా కోచ్‌ లియోనెల్ స్కాలోని చెప్పాడం విశేషం.