తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Team India Practice Session: ప్రాక్టీస్ సెష‌న్స్‌తో టీమ్ ఇండియా క్రికెట‌ర్స్ బిజీ - ఫొటోలు షేర్ చేసిన బీసీసీఐ

Team India Practice Session: ప్రాక్టీస్ సెష‌న్స్‌తో టీమ్ ఇండియా క్రికెట‌ర్స్ బిజీ - ఫొటోలు షేర్ చేసిన బీసీసీఐ

04 February 2023, 11:12 IST

  • Team India Practice Session: బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ టెస్ట్ సిరీస్ ఫిబ్ర‌వ‌రి 9 నుంచి మొద‌లుకానుంది. ఈ టెస్ట్ సిరీస్ కోసం టీమ్ ఇండియా స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది. టీమ్ ఇండియా ఆట‌గాళ్లు ప్రాక్టీస్‌తో బిజీగా ఉన్న ఫొటోల‌ను బీసీసీఐ ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసింది.

ఛ‌టేశ్వ‌ర్ పుజారా
ఛ‌టేశ్వ‌ర్ పుజారా

ఛ‌టేశ్వ‌ర్ పుజారా

Team India Practice Session: శ్రీలంక‌, న్యూజిలాండ్‌ల‌తో వ‌న్డే, టీ20 సిరీస్‌ల‌ను సొంతం చేసుకున్న టీమ్ ఇండియా మ‌రో స‌మ‌రానికి సిద్ధ‌మైంది. ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ ఆడ‌నుంది. నాలుగు మ్యాచ్‌ల ఈ బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీ ఫిబ్ర‌వ‌రి 9న మొద‌లుకానుంది.

ట్రెండింగ్ వార్తలు

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

ఈ సిరీస్ కోసం శుక్ర‌వారం నుంచి ప్రాక్టీస్ మొద‌లుపెట్టింది టీమ్ ఇండియా. విరాట్ కోహ్లి, ఛ‌టేశ్వ‌ర్ పుజారా, రోహిత్ శ‌ర్మ‌తో పాటు ర‌వీంద్ర జ‌డేజా ప్రాక్టీస్ సెష‌న్‌లో చెమ‌టోడ్చుతున్న ఫొటోల‌ను బీసీసీఐ ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసింది. ఈ ఫొటోల్లో ర‌వీంద్ర జ‌డేజా కూడా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ క‌నిపించారు.

లాంగ్ గ్యాప్ త‌ర్వాత జ‌డేజా ఈ సిరీస్‌తో ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. జ‌య‌దేవ్ ఉన‌ద్క‌త్‌, కుల్దీప్ యాద‌వ్‌తో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తూ బిజీగా ఉన్నారు. తొలి టెస్ట్ మ్యాచ్ నాగ్‌పూర్‌లో జ‌రుగ‌నుంది.

ఈ మ్యాచ్ కోసం ఐదు రోజుల ముందుగానే టీమ్ ఇండియా క్రికెట‌ర్లు నాగ్‌పూర్‌కు చేరుకొని ప్రాక్టీస్ మొద‌లుపెట్టారు. వ‌ర‌ల్డ్ టెస్ట్ ఛాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్ రేసులో ఆస్ట్రేలియాతో పాటు టీమ్ ఇండియా నిలిచాయి. పాయింట్స్ టేబుల్‌లో ఆస్ట్రేలియా టాప్ ప్లేస్‌లో నిల‌వ‌గా టీమ్ ఇండియా రెండో స్థానంలో ఉంది.

టీమ్ ఇండియా ఫైన‌ల్ బెర్తు ఖ‌రారు కావాలంటే బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీని 3 -0 లేదా అంత‌కంటే ఎక్కువ తేడాతో గెల‌వాలి. మ‌రోవైపు టీమ్ ఇండియాను ఓడించి ఫైన‌ల్‌లో అడుగుపెట్టాల‌ని ఆస్ట్రేలియా కూడా గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ఉంది.