IND vs PAK: టాస్ గెలిచిన రోహిత్ శర్మ- పాకిస్థాన్ బ్యాటింగ్
IND vs PAK:ఆసియా కప్ తొలి పోరులో భాగంగా నేడు పాకిస్థాన్‌తో టీమ్ ఇండియా తలపడనున్నది. దుబాయ్ ఇంటర్‌నేషనల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమ్ ఇండియా తొలుత బౌలింగ్ ఎంచుకున్నది.
IND vs PAK:ఆసియా కప్‌లో భాగంగా ఆదివారం పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఇండియా ఇన్నింగ్స్‌ను కెప్టెన్ రోహిత్‌శర్మతో కలిసి కె.ఎల్.రాహుల్ ఆరంభించబోతున్నాడు.
మరోవైపు విశ్రాంతి కారణంగా జట్టుకు నెల రోజుల పాటు దూరమైన కోహ్లి నేటి మ్యాచ్‌లో ఆడబోతున్నాడు. వికెట్ కీపర్ స్థానం కోసం రిషబ్ పంత్, దినేష్ కార్తిక్ మధ్య పోటీ నెలకొంది.
కార్తిక్ పై మరోసారి నమ్మకం ఉంచి మేనేజ్‌మెంట్ అతడికే అవకాశం ఇచ్చింది. కార్తిక్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యలతో టీమ్ ఇండియా మిడిల్ ఆర్డర్ పటిష్టంగా ఉంది. బుమ్రా దూరమవ్వడంతో టీమ్ ఇండియా పేస్ దళాన్ని భువనేశ్వర్ కుమార్ నడిపించబోతున్నాడు. అతడితో పాటు అర్షదీప్‌సింగ్, ఆవేశ్‌ఖాన్‌లకు జట్టులో స్థానం దక్కింది. స్పిన్ భారాన్ని జడేజా, చాహల్ నడిపించబోతున్నారు.