Virat Kohli in Gym: విరాట్ ఈజ్ బ్యాక్.. నాగ్‌పూర్‌లో టీమ్‌తో చేరిన కోహ్లి.. జిమ్‌లో కసరత్తులు.. వీడియో-virat kohli in gym at nagpur as team india prepare for series against australia ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Virat Kohli In Gym: విరాట్ ఈజ్ బ్యాక్.. నాగ్‌పూర్‌లో టీమ్‌తో చేరిన కోహ్లి.. జిమ్‌లో కసరత్తులు.. వీడియో

Virat Kohli in Gym: విరాట్ ఈజ్ బ్యాక్.. నాగ్‌పూర్‌లో టీమ్‌తో చేరిన కోహ్లి.. జిమ్‌లో కసరత్తులు.. వీడియో

Hari Prasad S HT Telugu
Feb 03, 2023 12:01 PM IST

Virat Kohli in Gym: విరాట్ ఈజ్ బ్యాక్. కొన్నాళ్లు ఫ్యామిలీతో సరదాగా గడిపిన కోహ్లి.. ఇక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం నాగ్‌పూర్‌లో ఉన్న టీమిండియాతో చేరాడు. అప్పుడే జిమ్‌లో కసరత్తులు కూడా మొదలుపెట్టాడు.

విరాట్ కోహ్లి
విరాట్ కోహ్లి (AP)

Virat Kohli in Gym: మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి మళ్లీ టీమిండియాతో చేరాడు. న్యూజిలాండ్ తో మూడు టీ20ల సిరీస్ కు విశ్రాంతి లభించడంతో ఫ్యామిలీతో కలిసి రిషికేష్ కు ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లిన కోహ్లి.. తాజాగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం తిరిగి ఇండియన్ టీమ్ తో చేరాడు. ఫిబ్రవరి 9 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుండగా.. నాగ్‌పూర్ లో ఇప్పటికే టీమిండియా క్యాంప్ ప్రారంభమైంది.

కోహ్లి ఇప్పుడీ క్యాంప్ లో చేరాడు. జిమ్ లో కసరత్తులు మొదలుపెట్టాడు. ఈ వీడియోను అతడు శుక్రవారం (ఫిబ్రవరి 3) తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసుకున్నాడు. మళ్లీ మొదలుపెట్టాను అనే క్యాప్షన్ తో విరాట్ ఈ వీడియో పోస్ట్ చేశాడు. ఫిట్‌నెస్ పై ఎక్కువగా దృష్టిసారించే విరాట్.. ప్రతి రోజూ జిమ్ లో గంటల తరబడి కసరత్తులు చేస్తుంటాడు.

కోహ్లితోపాటు ఇతర టీమ్ సభ్యులు కూడా ఆస్ట్రేలియా సిరీస్ కోసం ట్రైనింగ్ క్యాంప్ లో చేరారు. వచ్చే నెలన్నర రోజుల పాటు టీమిండియా ఎంతో కీలకమైన సిరీస్ ఆడనుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ చేరాలంటే ఈ సిరీస్ కచ్చితంగా గెలవాల్సిన స్థితిలో ఇండియా ఉంది. తొలి టెస్ట్ ఫిబ్రవరి 9న నాగ్‌పూర్ లో జరగనుంది.

ఈ టెస్ట్ కోసం గురువారం సాయంత్రం కోచ్ రాహుల్ ద్రవిడ్ తోపాటు ఇతర టీమ్ సభ్యులు గురువారం (ఫిబ్రవరి 2) నాగ్‌పూర్ చేరుకున్నారు. సిరాజ్, ఇషాన్ లాంటి ప్లేయర్స్ ఎయిర్ పోర్టులో కనిపించారు. మరోవైపు ఆస్ట్రేలియా కూడా ఇప్పటికే ఇండియా చేరుకుంది. అయితే నాగ్‌పూర్ లో కాకుండా ఆ టీమ్ బెంగళూరు సమీపంలోని ఆలూర్ లో ప్రాక్టీస్ చేస్తోంది. అక్కడ ప్రత్యేకంగా స్పిన్ పిచ్ లను తయారు చేయించుకొని ఆ టీమ్ ప్రాక్టీస్ చేస్తుండటం విశేషం.

గతేడాది బంగ్లాదేశ్ తో సిరీస్ తర్వాత టీమిండియా ఆడబోతున్న టెస్ట్ సిరీస్ ఇదే. టెస్టు క్రికెట్లోనూ మునుపటి ఫామ్ అందుకోవాలని కోహ్లి ఆరాటపడుతున్నాడు. వైట్ బాల్ క్రికెట్ లో మూడు సెంచరీలతో చెలరేగిన అతడు.. ఇక ఇప్పుడు రెడ్ బాల్ క్రికెట్ లోనూ అదే ఫామ్ కొనసాగించాలని తహతహలాడుతున్నాడు.

Whats_app_banner

సంబంధిత కథనం