Dravid About Kohli and Rohit: టీ20లకు కోహ్లీ-రోహిత్‌కు బ్రేక్ ఇవ్వడంపై ద్రవిడ్ స్పందన.. ఏమన్నారంటే?
Dravid About Kohli and Rohit: న్యూజిలాండ్ ఈ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న టీ20 సిరీస్‌కు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు బ్రేక్ ఇచ్చారు. ఈ విషయంపై రాహుల్ ద్రవిడ్ మాట్లాడుతూ.. టీ20 సిరీస్ నుంచి వారిని తప్పించలేదని, విశ్రాంతి మాత్రమే ఇచ్చామని స్పష్టం చేశారు.
Dravid About Kohli and Rohit: టీ20 ఫార్మాట్ నుంచి సీనియర్ ఆటగాళ్లయిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మను కావాలనే దూరం పెడుతున్నారా? శాశ్వతంగా హార్దిక్ పాండ్యానే కెప్టెన్‌గా నియమించాలనుకుంటున్నారా? ప్రస్తుతం ఈ ప్రశ్నలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. ఎందుకంటే గతేడాది జరిగిన టీ20 వరల్డ్ కప్ తర్వాత వీరిద్దరూ పెద్దగా టీ20లు ఆడింది లేదు. అంతేకాకుండా శుక్రవారం నుంచి న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌లు టీ20 సిరీస్ ఆరంభం కాబోతుంది. ఈ సిరీస్‌కు కూడా వీరిని దూరం పెట్టారు. దీంతో ఈ వాదనలకు మరింత బలం చేకూరుతోంది. తాజాగా ఈ అంశంపై టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పందించారు. కివీస్‌తో సిరీస్‌కు కోహ్లీ-రోహిత్‌ను దూరం పెట్టడం కేవలం వారికి విశ్రాంతిని ఇవ్వడమేనని స్పష్టం చేశారు.
"కొన్ని ప్రాధాన్యాలను దృష్టిలో ఉంచుకుని వారికి(కోహ్లీ, రోహిత్) విశ్రాంతినిచ్చాం. ముఖ్యంగా కొన్ని కీలక టెస్టు టోర్నీలు ఉన్నాయి. టీ20 వరల్డ కప్‌లో ఆరు మ్యాచ్‌లు భారత్ ఆడితే.. అన్నింట్లోనూ కోహ్లీ ఆడాడు. కాబట్టి అతడికి రోహిత్‌తో పాటు విశ్రాంతి ఇవ్వాలి. అంతేకానీ వారిని దూరం పెట్టలేదు. అంతేకాకుండా వీరిద్దరూ ఇటీవలే శ్రీకాంత్, న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లు కూడా ఆడారు." అని రాహుల్ ద్రవిడ్ అన్నారు.
కెప్టెన్సీని విభజించడంపై ప్రశ్నించగా.. రాహుల్ ద్రవిడ్ ఆసక్తికర సమాధానాన్ని ఇచ్చారు. ఈ ప్రశ్నను అడగాల్సింది తనను కాదని, సెలక్టర్లను అడగాలని సూచించారు. తనకు తెలిసినంత వరకు ప్రస్తుతాని అలాంటిదేది ఉండదని బదులిచ్చారు.
ప్రస్తుతం టీమిండియా.. న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్ ఆడుతోంది. భారత్‌లో పర్యటిస్తున్న కివీస్.. ఆడిన రెండింటిలోనూ ఓటమి పాలై ఇప్పటికే వన్డే సిరీస్‌ను కోల్పోయింది. నామమాత్రపు మూడో వన్డే మంగళవారం ప్రారంభం కానుంది. ఈ సిరీస్ తర్వాత శుక్రవారం నుంచి న్యూజిలాండ్‌తో మూడు టీ20ల సిరీస్ ఆడనుంది భారత్. ఆ తర్వాత ఫిబ్రవరి 9 నుంచి ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్‌తో పాటు మూడు వన్డేలు కూడా ఆడనుంది. ఇందుకోసం కంగారూ జట్టులో భారత్‌లో పర్యటించనుంది.
సంబంధిత కథనం