ODI Records : ప్రజెంట్ ఛేజింగ్​లో కోహ్లీ టాప్ కాదు.. ఎవరో తెలుసా?-most successful runs in odi chases record here s top list sachin tendulkar virat kohli ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Most Successful Runs In Odi Chases Record Here's Top List Sachin Tendulkar Virat Kohli

ODI Records : ప్రజెంట్ ఛేజింగ్​లో కోహ్లీ టాప్ కాదు.. ఎవరో తెలుసా?

Anand Sai HT Telugu
Jan 23, 2023 06:52 AM IST

ODI Records : ఛేజింగ్ అనగానే మెుదటగా గుర్తొచ్చేది కింగ్ కోహ్లీ. అయితే వన్డేల్లో చేజ్ మాస్టర్ గా ప్రస్తుతం అతడు టాప్ లో లేడు. వేరే వ్యక్తి ఉన్నాడు అతడు ఎవరో తెలుసా?

విరాట్ కోహ్లీ
విరాట్ కోహ్లీ (PTI)

విరాట్ కోహ్లీ(Virath Kohli) ఛేజింగ్ లో దూసుకెళ్తాడు.. అని మెుదటి నుంచి అందరికీ తెలిసిన విషయమే. అయితే వన్డే ఛేజ్ మాస్టర్ ఎవరు అనే ప్రశ్న సహజంగానే వస్తుంది. అయితే ఈ విషయంలో కింగ్ కోహ్లీ(King Kohli) కూడా రెండో స్థానంలో ఉన్నాడు. టాప్ లోకి రావాలంటే.. ఇంకా 63 పరుగులు కావాల్సి ఉంది. అవి సాధిస్తే.. క్రికెట్ చరిత్రలో వన్డే ఛేజింగ్ మాస్టర్ గా టాప్ ఉంటాడు కోహ్లీ. వన్డే క్రికెట్ చరిత్రలో ఛేజ్ మాస్టర్ గా ఉన్న బ్యాట్స్‌మెన్‌లు ఎవరో చూద్దాం..

ట్రెండింగ్ వార్తలు

సచిన్ టెండూల్కర్ : ఛేజింగ్ విషయంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్(sachin tendulkar) అగ్రస్థానంలో ఉన్నాడు. 124 సార్లు విజయవంతమైన ఛేజింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. మొత్తం 5490 పరుగులు సాధించాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఇండియా గెలుపులో చాలాసార్లు కీలక పాత్ర పోషించాడు.

విరాట్ కోహ్లీ : టీమ్ ఇండియా(Team India) ప్రజెంట్ ఛేజ్ మాస్టర్ గా గుర్తింపు పొందాడు కింగ్ కోహ్లీ. 90 విజయవంతమైన ఛేజింగ్ ఇన్నింగ్స్ ఆడాడు మొత్తం 5428 పరుగులు సాధించాడు.

రికీ పాంటింగ్ : ఆస్ట్రేలియా జట్టు మాజీ నాయకుడు రికీ పాంటింగ్(ricky ponting) మొత్తం 104 ఛేజింగ్ ఇనింగ్స్ ఆడాడు. 4186 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా జట్టుకు మంచి గెలుపులు అందించాడు.

జాక్స్ కాలిస్ : సౌత్ ఆఫ్రికా మాజీ ఆల్ రౌండర్ జాక్స్ కాలిస్ కూడా ఛేజింగ్ లో ప్రముఖ పాత్ర పోషించాడు. మొత్తం 100 ఛేజింగ్ ఇన్నింగ్స్ ఆడి.. 3950 పరుగులు చేశాడు.

రోహిత్ శర్మ : టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) కూడా ఈ జాబితాలో ఉన్నాడు. 86 విజయవంతమైన ఛేజింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. హిట్‌మ్యాన్ మొత్తం 3897 పరుగులు పూర్తి చేశాడు.

అంటే టీమ్ ఇండియాలో ఛేజింగ్ విషయంలో అత్యధిక పరుగులు తీసిన రికార్డు సచిన్ టెండూల్కర్ పేరుతో ఉంది. ఈ రికార్డును బద్దలు కొట్టాలంటే.. విరాట్ కోహ్లీకి 63 పరుగుల అవసరం ఉంది. ఒక వేళ న్యూజిలాండ్‌తో చివరి వన్డేలో రెండో ఇన్నింగ్స్ ఆడి.. ఈ రికార్డును సొంతం చేసుకునే అవకాశం లభిస్తుంది.

WhatsApp channel