Kohli gifts Miraz his Jersey: బంగ్లాదేశ్ స్టార్ ప్లేయర్‌కు జెర్సీ గిఫ్ట్‌గా ఇచ్చిన విరాట్ కోహ్లి
Virat Kohli gift to Mehidy Hasan: బంగ్లాదేశ్ స్టార్ ప్లేయర్ మెహదీ హసన్‌కు తన జెర్సీ గిఫ్ట్‌గా ఇచ్చాడు విరాట్ కోహ్లి. ఆ టీమ్‌పై టెస్ట్ సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన తర్వాత ఈ స్పెషల్ గిఫ్ట్‌తో అతన్ని ఆశ్చర్యపరిచాడు.
Virat Kohli gift to Mehidy Hasan: బంగ్లాదేశ్ టూర్‌ను ఇండియా ఘనంగా ముగించింది. రెండో టెస్ట్‌లో కిందామీదా పడి అశ్విన్, శ్రేయస్ పుణ్యమా అని గెలిచినా.. సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయగలిగింది. అయితే ఈ రెండో టెస్ట్‌తోపాటు ఇండియా వన్డే సిరీస్ ఓడిపోవడంలోనూ కీలకపాత్ర పోషించిన ప్లేయర్ మెహదీ హసన్. ఈ టూర్ మొత్తంలో ప్రధాన ఆకర్షణ అతడే.
తన ఆల్‌రౌండ్ పర్ఫార్మెన్స్‌తో ఇండియాకు చుక్కలు చూపించాడు. తొలి రెండు వన్డేలు ఇండియా ఓడిపోవడంలోనూ మెహదీ హసన్‌దే కీలకపాత్ర. ఓ సెంచరీ కూడా బాదాడు. ఇక రెండో టెస్ట్‌లోనూ ఇండియాను దాదాపు ఓడించినంత పని చేశాడు. అతడు కోహ్లి, పుజారా, గిల్‌లాంటి కీలకమైన ప్లేయర్స్‌ను ఔట్ చేయడంతోపాటు మొత్తం 5 వికెట్లు తీశాడు.
ఆ ఒక్క ప్లేయర్ లేకపోయి ఉంటే.. ఇండియా వన్డే సిరీస్‌ను కూడా గెలుచుకునేదే. టెస్ట్ సిరీస్‌ను మరింత సులువుగా క్లీన్‌స్వీప్ చేసేది. అయితే అలాంటి ప్లేయర్‌కు టెస్ట్ సిరీస్ ముగిసిన తర్వాత విరాట్ కోహ్లి ఓ మరుపు రాని గిఫ్ట్‌తో సర్‌ప్రైజ్ చేశాడు. ఓవైపు మ్యాచ్ ప్రజెంటేషన్ నడుస్తుండగానే మెహదీకి తన వన్డే జెర్సీని విరాట్ కోహ్లి గిఫ్ట్‌గా ఇచ్చాడు.
ఈ విషయాన్ని మెహదీ తన ట్విటర్ ద్వారా వెల్లడించాడు. "గ్రేటెస్ట్ క్రికెటర్లలో ఒకడైన విరాట్ కోహ్లి నుంచి స్పెషల్ గిఫ్ట్" అంటూ మెహదీ ఈ ఫొటోను షేర్ చేసుకున్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్ట్‌ను ఇండియా 3 వికెట్ల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్‌పై టెస్టుల్లో ఇప్పటి వరకూ ఓటమెరగని రికార్డును టీమిండియా కొనసాగించింది.
2000 నుంచి ఇప్పటి వరకూ ఆ టీమ్‌తో 12 టెస్టులు ఆడగా.. 10 విజయాలు సాధించింది. మరో రెండు డ్రాగా ముగిశాయి. అందులో ఐదు ఇన్నింగ్స్ విజయాలు కావడం విశేషం. అయితే వరుసగా రెండో టూర్‌లోనూ వన్డే సిరీస్‌ను ఓడిపోయింది. 2015లోనూ బంగ్లాదేశ్‌లో పర్యటించినప్పుడు వన్డే సిరీస్ కోల్పోయిన ఇండియా.. ఇప్పుడు కూడా 1-2తో ఓడింది.