Ashwin brutal reply to fan: ఇండియా క్రికెట్‌ ఆడకపోతే ఏం చేస్తావ్‌.. అభిమానికి అశ్విన్‌ ఘాటు రిప్లై-ashwin brutal reply to fan who trolled him after india win over banlgadesh ,స్పోర్ట్స్ న్యూస్
Telugu News  /  Sports  /  Ashwin Brutal Reply To Fan Who Trolled Him After India Win Over Banlgadesh

Ashwin brutal reply to fan: ఇండియా క్రికెట్‌ ఆడకపోతే ఏం చేస్తావ్‌.. అభిమానికి అశ్విన్‌ ఘాటు రిప్లై

రవిచంద్రన్ అశ్విన్
రవిచంద్రన్ అశ్విన్ (Twitter)

Ashwin brutal reply to fan: ఇండియా క్రికెట్‌ ఆడకపోతే ఏం చేస్తావ్‌ అంటూ ఓ అభిమానికి అశ్విన్‌ ఘాటు రిప్లై ఇచ్చాడు. బంగ్లాదేశ్‌పై రెండో టెస్ట్‌ గెలిచిన తర్వాత ఆ అభిమాని చేసిన ట్వీట్‌పై అశ్విన్‌ మండిపడ్డాడు.

Ashwin brutal reply to fan: బంగ్లాదేశ్‌పై టీమిండియా రెండు టెస్ట్‌ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసింది. ఓటమి తప్పదనుకున్న మ్యాచ్‌లో శ్రేయస్‌ అయ్యర్‌తో కలిసి అసాధారణ పోరాటం చేసిన అశ్విన్‌.. ఇండియన్‌కు టీమ్‌కు మరుపురాని విజయాన్ని అందించాడు. రెండో ఇన్నింగ్స్‌లో 74 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన సమయంలో అశ్విన్‌ కీలకమైన 42 రన్స్‌ చేశాడు. విన్నింగ్‌ షాట్‌ కొట్టింది కూడా అతడే.

ట్రెండింగ్ వార్తలు

ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లోనూ 12 రన్స్‌ చేసిన అశ్విన్‌.. మొత్తం 6 వికెట్లు తీసుకున్నాడు. దీంతో మ్యాన్ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు అతనికే దక్కింది. అయితే ఇండియా ఈ థ్రిల్లింగ్‌ విక్టరీ సాధించిన తర్వాత ఓ అభిమాని వ్యంగ్యంగా ట్వీట్‌ చేశాడు. అశ్విన్‌ ఒక పరుగుపై ఉన్న సమయంలో మోమినుల్‌ హక్ క్యాచ్ డ్రాప్‌ చేసిన సంగతి తెలుసు కదా.

దీనిని గుర్తు చేస్తూ అతడు ఓ ట్వీట్‌ చేశాడు. "నువ్వు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డును మోమినుల్‌ హక్‌కు ఇవ్వాలి. ఆ క్యాచ్‌ను అతడే కదా డ్రాప్‌ చేసింది. అతడు ఆ క్యాచ్‌ పట్టుకొని ఉంటే ఇండియా కచ్చితంగా 89 రన్స్‌కే ఆలౌటయ్యేది" అని ఆ ఫ్యాన్‌ ట్వీట్ చేశాడు.

దీనికి అశ్విన్‌ కూడా ఘాటుగా స్పందించాడు. "అయ్యో! నిన్ను నేను బ్లాక్‌ చేశానని అనుకున్నాను. సారీ అతడు మరో వ్యక్తి అనుకుంటా. అతని పేరేంటి? హా డేనియల్‌ అలెగ్జాండర్‌ అతని పేరు. ఇండియా ఒకవేళ క్రికెట్‌ ఆడకపోతే మీరిద్దరూ ఏం చేస్తారో" అని అశ్విన్‌ ట్వీట్‌ చేశాడు.

బంగ్లాదేశ్‌పై రెండు టెస్ట్‌ల సిరీస్‌ను ఇండియా క్లీన్‌స్వీప్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ విజయంతో వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ చేరే అవకాశాలను ఇండియా మరింత మెరుగుపరచుకుంది. ప్రస్తుతం ఇండియా రెండోస్థానంలోనే కొనసాగుతోంది. తొలి స్థానంలో ఆస్ట్రేలియా ఉంది. ఆ టీమ్‌తోనే వచ్చే ఏడాది మొదట్లో ఇండియా నాలుగు టెస్ట్‌ల సిరీస్‌ ఆడనుంది. ఆ సిరీస్‌తో ఇండియా ఫైనల్‌ చేరుతుందా లేదా అన్నది తేలిపోనుంది.