Ravichandran Ashwin : శాస్త్రవేత్తగా రవిచంద్రన్ అశ్విన్.. సెహ్వాగ్ మీమ్
IND Vs BAN : బంగ్లాతో జరిగిన టెస్టు సిరీస్ లో అశ్విన్ కీలక పాత్ర పోషించాడు. అతడిపై ప్రశంసలు కురుస్తున్నాయి. అయితే భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అశ్విన్ కు సంబంధించి.. ఒక ఆసక్తికరమైన పోస్టు పెట్టాడు.
బంగ్లాదేశ్(Bangladesh)తో టెస్టు సిరీస్‌ను గెలుచుకుంది టీమ్ ఇండియా(Team India). రెండో టెస్టులో బంగ్లాదేశ్ నిర్దేశించిన 145 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన టీమ్‌ఇండియా శ్రేయాస్ అయ్యర్, రవిచంద్రన్ అశ్విన్ రాణించడంతో మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 2-0 తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ లో అశ్విన్ కీలక పాత్ర పోషించాడు. దీంతో సెహ్వాగ్ ఓ మీమ్(Meme)ను వదిలాడు.
సెహ్వాగ్(Sehwag) రవిచంద్రన్ అశ్విన్‌ను శాస్త్రవేత్త అవతారంలో చూపిస్తూ.. ట్విట్ చేశాడు. 'శాస్త్రవేత్త చేశాడు. ఇది ఎలాగోలా వచ్చింది. అశ్విన్ అద్భుతమైన ఇన్నింగ్స్, శ్రేయాస్ అయ్యర్‌తో అద్భుతమైన భాగస్వామ్యం' అని సెహ్వాగ్ ట్వీట్ చేశాడు.
బంగ్లాతో జరిగిన తొలి టెస్టులో వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) కాస్త విఫలమయ్యాడు. బ్యాటింగ్ లో అర్ధ సెంచరీ చేసినా.. బౌలర్ గా ఒక్క వికెట్ తీసుకున్నాడు. దీంతో అతడిని జట్టు నుంచి తప్పించాలని కొంతమంది అభిప్రాయపడ్డారు. రెండో టెస్టు కోసం కుల్దీప్ ను తప్పించి.. అశ్విన్ ను పెట్టడంపై విమర్శలు వచ్చాయి. కానీ అశ్విన్ ఇవేమీ పట్టించుకోలేదు. గెలుపులో కీలక పాత్ర పోషించాడు. 48 పరుగులు చేశాడు. ఆరు వికెట్లు తీసుకున్నాడు. శ్రేయాస్ అయ్యర్ తో కలిసి.. 71 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
అంతేకాదు.. అశ్విన్ కు అరుదైన రికార్డు సృష్టించాడు. దిగ్గజ ఆల్ రౌండర్ కపిల్ దేవ్(kapil dev) సరసన నిలిచాడు. టీమిండియా తరఫున టెస్టుల్లో మూడు వేల పరుగులతోపాటుగా 400పై వికెట్లు తీసిన కపిల్ దేవ్ రికార్డును అశ్విన్ అందుకున్నాడు. బంగ్లాతో సిరీస్ కు ముందు అశ్విన్ టెస్టుల్లో 442 వికెట్లు, 2931 పరుగులు చేశాడు.
తాజాగా జరిగిన టెస్టు సిరీస్ లో 112 పరుగులు చేసి.. , 400 వికెట్లతోపాటుగా మూడు వేల పరుగులు చేసిన రెండో టీమిండియా ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అశ్విన్ తన కెరీర్లో 88 మ్యాచ్ ల్లో 3,043 పరుగులతో 449 వికెట్లు తీశాడు. కపిల్ దేవ్ 131 మ్యాచ్ ల్లో 434 వికెట్లతో పాటు 5,248 పరుగులు పూర్తి చేశాడు.
సంబంధిత కథనం