Team India Records: ఒక్క మ్యాచ్.. పది రికార్డులు బ్రేక్.. గిల్, టీమిండియా అరుదైన ఘనత-team india records in third t20 against new zealand ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Team India Records In Third T20 Against New Zealand

Team India Records: ఒక్క మ్యాచ్.. పది రికార్డులు బ్రేక్.. గిల్, టీమిండియా అరుదైన ఘనత

Hari Prasad S HT Telugu
Feb 02, 2023 01:07 PM IST

Team India Records: ఒక్క మ్యాచ్ తో పది రికార్డులు బ్రేక్ అయ్యాయి. న్యూజిలాండ్ తో జరిగిన మూడో టీ20లో శుభ్‌మన్ గిల్, టీమిండియా ధాటికి గత రికార్డులన్నీ కనుమరుగయ్యాయి.

ఒక్క మ్యాచ్ లో పది రికార్డులు బ్రేక్
ఒక్క మ్యాచ్ లో పది రికార్డులు బ్రేక్ (AFP)

Team India Records: న్యూజిలాండ్ తో జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో ఎన్నో రికార్డులు బ్రేకయ్యాయి. ఇందులో కొన్ని సెంచరీ హీరో గిల్ సాధించినవి కాగా.. మరికొన్ని టీమిండియా పేరిట ఉన్నాయి. టీ20ల్లో తొలి సెంచరీతోనే గిల్ పలు రికార్డులను సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్ లో గిల్ కేవలం 63 బాల్స్ లోనే 126 రన్స్ చేశాడు. అతని ఇన్నింగ్స్ లో 12 ఫోర్లు, 7 సిక్స్ లు ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు

మరోవైపు న్యూజిలాండ్ మాత్రం కేవలం 66 రన్స్ కే కుప్పకూలింది. దీంతో శుభ్‌మన్ గిల్.. కివీస్ ను 60 పరుగుల తేడాతో ఓడించాడంటూ ఎన్నో మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ మ్యాచ్ లో గిల్, ఇండియన్ టీమ్ బ్రేక్ చేసిన రికార్డులేంటో ఒకసారి చూద్దాం.

శుభ్‌మన్ గిల్ రికార్డులు ఇవే

- టీ20ల్లో సెంచరీ చేసిన అత్యంత పిన్న వయసు ఇండియన్ ప్లేయర్ గిల్. అతని ప్రస్తుత వయసు 23 ఏళ్ల 146 రోజులు. ఇంతకుముందు 23 ఏళ్ల 156 రోజులతో సురేశ్ రైనా పేరిట ఉన్న రికార్డును గిల్ బ్రేక్ చేశాడు. ఇప్పటికే ప్రపంచ రికార్డు మాత్రం 22 ఏళ్ల 127 రోజులతో పాకిస్థాన్ బ్యాటర్ అహ్మద్ షెహజాద్ పేరిట ఉంది.

- గిల్ చేసిన 126 రన్స్ టీ20ల్లో ఇండియాకు అత్యధిక వ్యక్తిగత స్కోరు. గతేడాది ఆసియా కప్ లో ఆప్ఘనిస్థాన్ పై విరాట్ కోహ్లి చేసిన 122 రన్స్ రికార్డును గిల్ బ్రేక్ చేశాడు.

- ఇక ఇవే 126 రన్స్ న్యూజిలాండ్ పై ఓ బ్యాటర్ చేసిన అత్యధిక స్కోరు. ఇంతకుముందు సౌతాఫ్రికా బ్యాటర్ రిచర్డ్ లెవీ 2012లో 117 రన్స్ చేశాడు.

- అన్ని ఫార్మాట్లలో సెంచరీ చేసిన యంగెస్ట్ ఇండియన్ ప్లేయర్ కూడా శుభ్‌మన్ గిల్. సురేశ్ రైనా, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రాహుల్ తర్వాత మూడు ఫార్మాట్లలోనూ సెంచరీ చేసిన ఐదో ఇండియన్ గా గిల్ నిలిచాడు.

టీమిండియా బ్రేక్ చేసిన రికార్డులు ఇవే

- చివరి టీ20లో న్యూజిలాండ్ ను ఇండియా 168 రన్స్ తేడాతో ఓడించింది. టీ20ల్లో ఇండియాకు ఇదే అతిపెద్ద విజయం. ఐసీసీలోని పూర్తిస్థాయి సభ్యదేశాల మధ్య జరిగిన మ్యాచ్ లోనూ ఇదే అతిపెద్ద విజయం కావడం విశేషం.

- ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ 66 పరుగులకే ఆలౌటైంది. గతంలో టీ20ల్లో ఏ ప్రత్యర్థినీ ఇండియా ఇంత తక్కువ స్కోరుకు పరిమితం చేయలేదు.

- ఇండియా ఈ మ్యాచ్ లో 4 వికెట్లకు 234 రన్స్ చేసింది. టీ20ల్లో న్యూజిలాండ్ పై చేసిన అత్యధిక స్కోరు ఇదే.

- స్వదేశంలో వరుసగా 13 టీ20 సిరీస్ లలో టీమిండియాకు ఓటమెరగని రికార్డు ఉంది. అందులో 11 గెలవగా.. మరో రెండు డ్రా అయ్యాయి.

- న్యూజిలాండ్ వికెట్లన్నీ టీమిండియా పేస్ బౌలర్లే తీశారు. టీ20ల్లో ఇండియన్ టీమ్ ఇలా చేయడం ఇది రెండోసారి. ఇక స్వదేశంలో మాత్రం ఇదే తొలిసారి.

- ఇక ఓ టీ20 మ్యాచ్ లో న్యూజిలాండ్ తన అన్ని వికెట్లను పేస్ బౌలర్లకే సమర్పించుకోవడం కూడా ఇదే తొలిసారి.

WhatsApp channel

సంబంధిత కథనం