తెలుగు న్యూస్  /  Sports  /  Kapil Dev On Sachin Vs Kohli Debate Says Every Generation Gets A Better Player

Kapil Dev on Sachin vs Kohli: సచిన్, విరాట్‌లలో ఎవరు గొప్ప.. కపిల్ దేవ్ దిమ్మదిరిగే రిప్లై

Hari Prasad S HT Telugu

23 January 2023, 9:53 IST

    • Kapil Dev on Sachin vs Kohli: సచిన్, విరాట్‌లలో ఎవరు గొప్ప అన్న చర్చ కొంతకాలంగా నడుస్తున్న సంగతి తెలుసు కదా. ఈ ప్రశ్నకు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ మాత్రం దిమ్మదిరిగే రిప్లై ఇచ్చాడు.
విరాట్ కోహ్లి, సచిన్ టెండూల్కర్
విరాట్ కోహ్లి, సచిన్ టెండూల్కర్ (Getty Images)

విరాట్ కోహ్లి, సచిన్ టెండూల్కర్

Kapil Dev on Sachin vs Kohli: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి.. గత మూడు, నాలుగేళ్లుగా ఒక్క సెంచరీ చేయలేకపోయాడు. అయితే గతేడాది ఆసియా కప్ లో సెంచరీ తర్వాత మళ్లీ గాడిలో పడ్డాడు. ఆ తర్వాత మళ్లీ సెంచరీల మోత మోగిస్తున్నాడు. ఆ టోర్నీలో టీ20ల్లో తొలి సెంచరీ చేసిన విరాట్.. తర్వాత టెస్టులు, వన్డేల్లోనూ మూడంకెల స్కోరు అందుకున్నాడు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

ముఖ్యంగా వన్డేల్లో సచిన్ రికార్డు సెంచరీల వైపు వేగంగా దూసుకెళ్తున్నాడు. సచిన్ 49 సెంచరీలు చేయగా.. విరాట్ ప్రస్తుతం 46 సెంచరీలతో ఉన్నాడు. ఈ నేపథ్యంలో మరోసారి సచిన్, విరాట్ లలో ఎవరు గొప్ప అన్న చర్చ మళ్లీ మొదలైంది. దీనిపై ఎవరికి తోచిన విశ్లేషణ వాళ్లు చేస్తున్నారు. తాజాగా కపిల్ దేవ్ కూడా దీనిపై స్పందించాడు. అయితే అతని సమాధానం మాత్రం ఇతరులకు పూర్తి భిన్నంగా ఉంది.

కపిల్ ప్రకారం.. జనరేషన్ మారుతున్న కొద్దీ ఒకరి కంటే మెరుగైన ప్లేయర్ మరొకరు వస్తూనే ఉంటారు. అందువల్ల వీళ్ల మధ్య పోలిక పెట్టడం అనవసరం అని కపిల్ స్పష్టం చేశాడు. "అలాంటి సామర్థ్యం ఉన్న ప్లేయర్ విషయంలో ఒకరు, ఇద్దరినీ ఎంపిక చేయడం సరికాదు. ఇది 11 మంది ప్లేయర్స్ తో కూడిన టీమ్. నాకు నా ఇష్టాయిష్టాలు ఉంటాయి.

కానీ ప్రతి తరం మరింత మెరుగైన ప్లేయర్ ను అందిస్తుంది. మా టైమ్ లో సునీల్ గవాస్కర్ అత్యుత్తమ బ్యాటర్. ఆ తర్వాత రాహుల్ ద్రవిడ్, సచిన్, సెహ్వాగ్ లాంటి వాళ్లు వచ్చారు. ఈ తరంలో రోహిత్, విరాట్ ఉన్నారు. వచ్చే తరంలో మరింత మెరుగైన ప్లేయర్స్ వస్తారు. మనం మరింత మెరుగైన క్రికెటర్ ను, మరింత మెరుగ్గా ఆడటం చూస్తాం" అని గల్ఫ్ న్యూస్ తో మాట్లాడుతూ కపిల్ అన్నాడు.

సచిన్ తో పోలిక విషయంలో ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా.. వన్డే వరల్డ్ కప్ ఏడాదిలో విరాట్ మళ్లీ మునుపటి ఫామ్ లోకి రావడం మాత్రం అందరినీ ఆనందానికి గురి చేస్తోంది. గత ఆరు వన్డేల్లో విరాట్ మూడు సెంచరీలు చేయడం విశేషం. ఈ ఏడాది చివర్లో వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో విరాట్ ఇలాంటి ఫామ్ ను కొనసాగించాలని ప్రతి అభిమాని కోరుకుంటున్నాడు.