తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Kaif On Nca: ఏంటీ గాయాలు.. ఎన్సీఏ పనితీరు సరిగా లేదు.. లక్ష్మణ్‌పై మండిపడిన కైఫ్

Kaif on NCA: ఏంటీ గాయాలు.. ఎన్సీఏ పనితీరు సరిగా లేదు.. లక్ష్మణ్‌పై మండిపడిన కైఫ్

Hari Prasad S HT Telugu

14 April 2023, 17:53 IST

google News
    • Kaif on NCA: ఏంటీ గాయాలు.. ఎన్సీఏ పనితీరు సరిగా లేదు అంటూ లక్ష్మణ్‌పై మండిపడ్డాడు మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్. టీమిండియా ప్లేయర్స్ తరచూ గాయాల పాలవుతుండటంపై కైఫ్ ఈ కామెంట్స్ చేశాడు.
వీవీఎస్ లక్ష్మణ్, మహ్మద్ కైఫ్, బుమ్రా
వీవీఎస్ లక్ష్మణ్, మహ్మద్ కైఫ్, బుమ్రా

వీవీఎస్ లక్ష్మణ్, మహ్మద్ కైఫ్, బుమ్రా

Kaif on NCA: ఇండియన్ క్రికెట్ టీమ్ లో ఉంటూ గాయాపడిన ప్లేయర్స్ ను రీహ్యాబిలిటేషన్ కోసం నేషనల్ క్రికెట్ అకాడెమీ (ఎన్సీఏ)కి పంపిస్తుంటారు. అక్కడ సదరు ప్లేయర్స్ గాయం నుంచి కోలుకొని, మళ్లీ పూర్తి ఫిట్‌నెస్ సాధించి తిరిగి నేషనల్ టీమ్ లోకి వస్తారు. ఈ విషయంలో ఎన్సీఏ పాత్ర చాలా కీలకం. ఈ అకాడెమీకి మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ హెడ్ గా ఉన్నాడు.

అయితే ఈ ఎన్సీఏ పనితీరు సరిగా లేదని, గాయాల విషయంలో పారదర్శకంగా వ్యవహరించడం లేదని మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ అంటున్నాడు. బుమ్రానే అతడు ఉదామరణగా తీసుకున్నాడు. ఇప్పటికే అతడు టీమ్ కు దూరమై ఆరు నెలలు దాటిగా పూర్తి ఫిట్‌నెస్ సాధించలేకపోతున్నాడు. ఆ మధ్య శ్రీలంకతో సిరీస్ కు ఎంపిక చేసినా.. మ్యాచ్ ముందు రోజు మళ్లీ అతడు ఆడటం లేదని బీసీసీఐ అనౌన్స్ చేసింది.

దీనిపైనే కైఫ్ మండిపడ్డాడు. స్పోర్ట్స్‌కీడాతో మాట్లాడిన కైఫ్.. ఎన్సీఏ పనితీరును తప్పుబట్టాడు. "వ్యవస్థలోనే లోపాలు ఉన్నట్లు నేను గుర్తించాను. ప్లేయర్స్ ను ఎంపిక చేస్తున్నారు. చివరి నిమిషంలో పూర్తి ఫిట్ గా లేరంటూ పక్కన పెడుతున్నారు. బుమ్రా విషయంలో ఇదే జరిగింది. షమిని కూడా రెండుసార్లు అలాగే చేశారు. ఎన్సీఏ ట్రైనర్లు, ఫిజియోలు, వీవీఎస్ లక్ష్మణ్, అతని టీమ్ ఇలాంటి పరిస్థితులను జాగ్రత్తగా డీల్ చేయాలి. ఇది చాలా తీవ్రమైన అంశం. మేనేజ్‌మెంట్ దీనిని తేలిగ్గా తీసుకోకూడదు" అని కైఫ్ స్పష్టం చేశాడు.

"కచ్చితంగా పారదర్శకత ఉండాలి. ఫిట్ గా ఉన్నారని డిక్లేర్ చేసే ముందు ప్లేయర్స్ ను పూర్తిగా టెస్ట్ చేయాలి. ఎలాంటి పొరపాట్లు జరగకూడదు. ప్లేయర్ పూర్తి ఫిట్ గా ఉన్నాడా లేక అతనికి మరింత సమయం కావాలా. ఓ బుమ్రా అభిమానిగా అతని గాయమేంటి? రికవరీ టైమ్ ఎంత అనేవి తెలుసుకోవాలని అనుకుంటున్నాను. ఈ విషయంలో పారదర్శకత ఉండాలి. అసలు ఏం జరుగుతుందో దానిని వివరించాలి" అని కైఫ్ అన్నాడు.

తదుపరి వ్యాసం