Mohammad Kaif recalls Lords ODI: ఫ్లింటాఫ్ ఫస్ట్ స్టార్ట్ చేశాడు.. గంగూలీ షర్ట్ లెస్ సెలబ్రేషన్స్‌పై కైఫ్ స్పందన
Mohammad Kaif recalls Lords ODI: ఇరవై ఏళ్ల క్రితం ఇంగ్లాండ్‌పై విజయానంతరం గంగూలీ చొక్కా విప్పి సెలబ్రేట్ చేసుకున్న ఘటనను టీమిండియా మాజీ ఆటగాడు మహమ్మద్ కైఫ్ గుర్తు చేసుకున్నాడు. మొదట ఇంగ్లాండ్ ఆటగాడు ఫ్లింటాఫ్ అలా ప్రవర్తించాడని స్పష్టం చేశాడు.
Mohammad Kaif recalls Ganguly Shirtless celebration: ఇరవై ఏళ్ల క్రితం లార్డ్స్ వేదికగా సౌరవ్ గంగూలీ చొక్కా విప్పి సంబరాలు జరుపుకున్న సంఘటనలు ఇప్పటికీ చాలా మందికి గుర్తుండే ఉంటుంది. ఇంగ్లాండ్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో 326 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ఛేదించి అద్భుత విజయాన్ని అందుకుంది. ఆ సక్సెస్‌ను అప్పటి భారత ఆటగాళ్లంతగా ఆనందంగా జరుపుకున్నారు. అయితే అప్పటి కెప్టెన్ సౌరవ్ గంగూలీ మాత్రం వినూత్నంగా చొక్కా విప్పి గాల్లోకి ఎగరేస్తూ మరీ సంబురాలు జరుపుకున్నారు. అయితే గంగూలీ ఇలా చేయడాన్ని కొంతమంది విమర్శించినప్పటికీ.. మద్దతు ఇచ్చినవాళ్లు కూడా ఎంతోమంది ఉన్నారు. అయితే గంగూలీ అలా సంబురాలు జరుపుకోడానికి గల కారణాన్ని అప్పటి జట్టులో ఆటగాడు మహమ్మద్ కైఫ్ వివరించాడు. నాటి సంఘటనను గుర్తు చేసుకున్న కైఫ్.. చొక్కా విప్పి సంబురాలు చేసుకోవడం ఫ్లింటాఫ్ ప్రారంభించాడని చెప్పుకొచ్చాడు.
"అప్పటి ఇంగ్లాండ్ ఆటగాడు ఆండ్రూ ఫ్లింటాఫ్ అంతకుముందు చొక్కా విప్పి సంబురాలు చేసుకున్నాడని మహమ్మద్ కైఫ్ తెలిపాడు. ఫ్లింటాఫ్ ముందు ప్రారంభించాడు. కానీ అప్పటికి ఎన్నో విషయాలు మారాయి. 325 పరుగుల లక్ష్యాన్ని మేము అతి కష్టమ్మీద ఛేదించాం. ఎంతో తీవ్రంగా శ్రమించి చివరకు అనుకున్నది సాధించాం. అప్పటికీ కొంతమంది అభిమానులు లార్డ్స్ విడిచి వెళ్లిపోయారు కూడా. కానీ చివరకు విజయం మమ్మల్ని వరించింది. ఆ విజయం మాలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపింది." అని మహమ్మద్ కైఫ్ స్పష్టం చేశాడు.
ఈ మ్యాచ్ కంటే ముందు అదే ఏడాది ముంబయి వేదికగా ఇంగ్లాండ్-భారత్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఆ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ విజయం సాధించిన తర్వాత ఫ్లింటాఫ్ తన చొక్కాను విప్పి సంబురాలు చేసుకోవడం ప్రారంభించాడు. అది చూసిన చాలా మంది టీమిండియా అభిమానులకు ఆగ్రహం కలిగింది. దీనికి ప్రతిగానే లార్డ్స్‌లో జరిగిన వన్డేలో విజయం అనంతరం గంగూలీ షర్ట్ విప్పి తనదైన శైలిలో గాల్లోకి ఎగరేస్తూ సంబురాలు జరుపుకున్నాడు.
లార్డ్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ భారత్ ముందు 326 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం భారత ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్(45), సౌరవ్ గంగూలీ(60) అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చినప్పటికీ.. వెంట వెంటనే వికెట్లు పడటంతో భారత్ ఒత్తిలో ఇరుక్కుంది. అనంతరం మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన యువరాజ్ సింగ్(69), మహమ్మద్ కైఫ్(87) అద్భుత అర్ధశతకంతో ఆకట్టుకోవడంతో టీమిండియా విజయాన్ని సాధించింది.
సంబంధిత కథనం