Asia Cup 2022: కోహ్లి ఫ్యూచర్ ఏంటి.. అఫ్రిది ఆన్సర్ ఇదీ!
22 August 2022, 11:17 IST
- Afridi on Virat Kohli: విరాట్ కోహ్లి ఫ్యూచర్‌పై ఆసియా కప్‌కు ముందు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది. ట్విటర్‌లో ఓ ఫ్యాన్ అడిగిన ప్రశ్నకు అఫ్రిది స్పందించాడు.
విరాట్ కోహ్లి, షాహిద్ అఫ్రిది
న్యూఢిల్లీ: విరాట్ కోహ్లి పరిస్థితి ఏంటి? అతని ఫామ్ ఇలాగే కొనసాగితే.. టీమ్‌లో ఉంటాడా? టీ20 వరల్డ్‌కప్ వరకైనా విరాట్ తిరిగి ఫామ్‌లోకి వస్తాడా? ఆసియా కప్‌లో అతడు ఏం చేయబోతున్నాడు? ఇలా టీమిండియా గ్రేట్‌ను ఎన్నో ప్రశ్నలు చుట్టుముడుతున్నాయి. కొంతకాలంగా అసలు ఫామ్‌లో లేని విరాట్.. చాలా రోజుల తర్వాత ఆసియాకప్ కోసం ఇండియన్ టీమ్‌లోకి తిరిగి వస్తున్నాడు.
ఐపీఎల్ తర్వాత ఇంగ్లండ్ టూర్‌లో మాత్రమే కనిపించిన కోహ్లి.. అక్కడా తీవ్రంగా నిరాశపరిచాడు. ఆసియాకప్‌లో పాకిస్థాన్‌లాంటి టీమ్‌తో మ్యాచ్ ఉండటంతో అందరి కళ్లూ విరాట్‌పైనే ఉన్నాయి. అయితే ఈ మెగా టోర్నీకి ముందు కోహ్లి భవిష్యత్తు ఏంటి అని ఓ అభిమాని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదిని అడిగాడు. దీనికి అతడు ఇచ్చిన సమాధానం వైరల్ అవుతోంది.
అది అతని చేతుల్లోనే ఉంది అంటూ నాలుగు పదాల్లోనే అఫ్రిది చెప్పాడు. ఇక మరో యూజర్ కోహ్లి గురించే అడుగుతూ.. అతడు ఇంటర్నేషనల్ సెంచరీ చేయక వెయ్యి రోజులకుపైనే అయింది అని అడిగాడు. దీనికి అఫ్రిది స్పందిస్తూ.. పెద్ద ప్లేయర్స్ సత్తా ఏంటో ఇలాంటి క్లిష్ట పరిస్థితుల నుంచే తెలుస్తుంది అని అన్నాడు. నిజానికి కూడా కోహ్లిపై రోజు రోజుకూ ఒత్తిడి పెరిగిపోతోంది. ఓవైపు వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ టీమ్‌లో స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని యంగ్ ప్లేయర్స్ చూస్తున్నారు. ముఖ్యంగా టీ20ల్లో దీపక్ హుడా, శ్రేయస్ అయ్యర్‌లాంటి యువకులు సిద్ధంగా ఉన్నారు.
అయినా కూడా ఇంగ్లండ్‌లో దీపక్ హుడాను పక్కన పెట్టి మరీ కోహ్లికి ఛాన్సిచ్చారు. ఆ అవకాశాన్ని కూడా విరాట్ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో టీ20 ఫార్మాట్‌లోనే జరగబోతున్న ఆసియా కప్ కోహ్లికి పరీక్షే. ఇందులో పాకిస్థాన్‌తో జరిగే హైఓల్టేజ్ మ్యాచ్ కూడా ఉంది. వెస్టిండీస్, జింబాబ్వే టూర్లకు దూరంగా ఉన్న విరాట్‌కు మ్యాచ్ ప్రాక్టీస్ కూడా లేదు. ఈ పరిస్థితుల్లో అతడు ఎంతమేరకు తిరిగి ఫామ్‌లోకి వస్తాడన్నది ఆసక్తిగా మారింది.