తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Warner Touches Bhuvi Feet: భువీ కనిపించగానే పరుగెత్తుకుంటూ వెళ్లి కాళ్లు మొక్కిన వార్నర్.. వీడియో

Warner Touches Bhuvi Feet: భువీ కనిపించగానే పరుగెత్తుకుంటూ వెళ్లి కాళ్లు మొక్కిన వార్నర్.. వీడియో

Hari Prasad S HT Telugu

25 April 2023, 15:02 IST

    • Warner Touches Bhuvi Feet: భువీ కనిపించగానే పరుగెత్తుకుంటూ వెళ్లి కాళ్లు మొక్కాడు డేవిడ్ వార్నర్. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ గా మారింది. ఇంతకీ అతడు ఎందుకలా చేశాడు?
భువనేశ్వర్ కాళ్లు మొక్కుతున్న వార్నర్
భువనేశ్వర్ కాళ్లు మొక్కుతున్న వార్నర్

భువనేశ్వర్ కాళ్లు మొక్కుతున్న వార్నర్

Warner Touches Bhuvi Feet: ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ తనను వదులుకున్న తర్వాత హైదరాబాద్ లో తొలి మ్యాచ్ ఆడాడు డేవిడ్ వార్నర్. ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా ఉప్పల్ స్టేడియంలో అడుగుపెట్టిన వార్నర్ కు ఇక్కడి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అతడు టాస్ గెలిచినప్పటి నుంచీ బ్యాటింగ్ చేస్తున్న సమయంలోనూ వార్నర్ కు మద్దతుగా స్టేడియాన్ని హోరెత్తించారు.

ట్రెండింగ్ వార్తలు

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

సన్ రైజర్స్ టీమ్ కు గతంలో వార్నర్ ఎన్నో విజయాలు సాధించి పెట్టాడు. 2016లో ఐపీఎల్ ఛాంపియన్స్ గా నిలిపాడు. అయితే గతేడాది మెగా వేలానికి ముందు అతన్ని సన్ రైజర్స్ వదిలేసింది. ఇప్పుడు ప్రత్యర్థి జట్టు కెప్టెన్ గా హైదరాబాద్ కు వచ్చినా.. తన పాత టీమ్మేట్స్ తో ఆనందంగా గడిపాడు వార్నర్. ముఖ్యంగా మ్యాచ్ కు ముందు జరిగిన ఓ ఘటన అభిమానుల మనసు గెలుచుకుంది.

టాస్ కంటే ముందు సన్ రైజర్స్ బౌలర్ భువనేశ్వర్ కుమార్, ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ ఇషాంత్ శర్మ మాట్లాడుకుంటున్నారు. దూరం నుంచి భువీని చూసిన వార్నర్.. వెంటనే పరుగెత్తుకుంటూ వెళ్లి భువీ కాళ్లు మొక్కాడు. ఇది చూసి ఇషాంత్ నవ్వాడు. తర్వాత వార్నర్ ను పైకి లేపి ఆప్యాయంగా హత్తుకున్నాడు భువనేశ్వర్. వార్నర్ కెప్టెన్ గా ఉన్న సమయంలోనూ సన్ రైజర్స్ జట్టులో భువీ ప్రధాన బౌలర్ గా ఉన్నాడు.

అప్పటి ఫ్రెండ్షిప్ తోనే అతనితో వార్నర్ అలా కలిసిపోయాడు. ఈ మ్యాచ్ లో భువీ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 4 ఓవర్లలో కేవలం 11 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. అయితే బ్యాటర్ల వైఫల్యంతో 145 పరుగుల లక్ష్యాన్ని కూడా ఛేదించలేక సన్ రైజర్స్ 7 పరుగుల తేడాతో ఓడిపోయారు. ఇది వాళ్లు హ్యాట్రిక్ ఓటములు కాగా.. ఢిల్లీకిది వరుసగా రెండో విజయం.

తదుపరి వ్యాసం