SRH vs DC: ఉప్పల్లో భువనేశ్వర్ కళ్లు చెదిరే స్పెల్.. డీసీ పని పట్టిన పేసర్-srh vs dc as bhuvaneshwar super spell restricts dc ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Srh Vs Dc: ఉప్పల్లో భువనేశ్వర్ కళ్లు చెదిరే స్పెల్.. డీసీ పని పట్టిన పేసర్

SRH vs DC: ఉప్పల్లో భువనేశ్వర్ కళ్లు చెదిరే స్పెల్.. డీసీ పని పట్టిన పేసర్

Hari Prasad S HT Telugu

SRH vs DC: ఉప్పల్లో భువనేశ్వర్ కళ్లు చెదిరే స్పెల్ తో డీసీని కట్టడి చేశాడు. యార్కర్లతో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లకు వణుకు పుట్టించిన భువీ.. ఆ టీమ్ భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నాడు.

భువనేశ్వర్ కుమార్, మయాంక్ అగర్వాల్ (PTI)

SRH vs DC: సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ మరోసారి తనదైన స్టైల్లో రెచ్చిపోయాడు. కళ్లు చెదిరే స్పెల్ తో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లను భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నాడు. అతనితోపాటు మిగతా బౌలర్లు కూడా సమష్టిగా రాణించడంతో డీసీ టీమ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 144 పరుగులు మాత్రమే చేసింది.

భువనేశ్వర్ కుమార్ 4 ఓవర్లలో కేవలం 11 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీయడం విశేషం. నిజానికి 3.5 ఓవర్లు ముగిసే సమయానికి అతడు కేవలం 7 రన్సే ఇచ్చాడు. అయితే చివరి బంతికి కుల్దీప్ యాదవ్ ఫోర్ కొట్టడంతో భువీ స్పెల్‌లో రెండకెల పరుగులు వచ్చాయి. చివరి ఓవర్లోనే ఆరు పరుగులు వచ్చాయి. అంతకుముందు మూడు ఓవర్లలో 5 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీశాడు భువనేశ్వర్.

ఇక వాషింగ్టన్ సుందర్ కూడా 4 ఓవర్లలో 28 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీశాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ ఒక దశలో 62 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో మనీష్ పాండే (34), అక్షర్ పటేల్ (34) డీసీని ఆదుకున్నారు. ఈ ఇద్దరూ ఆరో వికెట్ కు 69 పరుగులు జోడించారు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ ఆ మాత్రం స్కోరైనా సాధించింది.

కెప్టెన్ డేవిడ్ వార్నర్ 21, మిచెల్ మార్ష్ 25 రన్స్ చేశారు. ఫిల్ సాల్ట్ (0), సర్ఫరాజ్ ఖాన్ (10), హకీమ్ ఖాన్ (4), రిపల్ పటేల్ (6) విఫలమయ్యారు. వరుసగా రెండు మ్యాచ్ లు ఓడిన సన్ రైజర్స్ సొంతగడ్డపై జరుగుతున్న ఈ మ్యాచ్ లో గెలవాలని చూస్తోంది.

సంబంధిత కథనం