Bhuvaneshwar Kumar Record: టీ20ల్లో భువనేశ్వర్ కుమార్ సరికొత్త రికార్డు-bhuvaneshwar kumar created record as the bowler now the leading wicket taker for india in t20s ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Bhuvaneshwar Kumar Record: టీ20ల్లో భువనేశ్వర్ కుమార్ సరికొత్త రికార్డు

Bhuvaneshwar Kumar Record: టీ20ల్లో భువనేశ్వర్ కుమార్ సరికొత్త రికార్డు

Hari Prasad S HT Telugu
Oct 24, 2022 09:25 PM IST

Bhuvaneshwar Kumar Record: టీ20ల్లో భువనేశ్వర్ కుమార్ సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. ఆదివారం (అక్టోబర్ 23) వరల్డ్‌కప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భువీ ఈ రికార్డు అందుకున్నాడు.

భువనేశ్వర్ కుమార్
భువనేశ్వర్ కుమార్ (BCCI Twitter)

Bhuvaneshwar Kumar Record: టీమిండియా పేస్‌ బౌలర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ టీ20ల్లో మరో రికార్డు అందుకున్నాడు. ఈ ఫార్మాట్‌లో ఇండియన్‌ టీమ్‌ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ టీమ్‌ బ్యాటర్‌ షహీన్‌ షా అఫ్రిది వికెట్‌ తీసిన తర్వాత భువీ ఈ ఘనత సాధించాడు. ఈ క్రమంలో స్పిన్నర్‌ యుజువేంద్ర చహల్‌ను అధిగమించాడు.

పాకిస్థాన్‌ టీమ్ ఫైటింగ్‌ స్కోరు సాధించడంలో షహీన్‌ షా అఫ్రిది కీలకపాత్ర పోషించాడు. డెత్‌ ఓవర్లలో అఫ్రిది 8 బాల్స్‌లోనే 16 రన్స్‌ చేశాడు. అతన్ని భువనేశ్వర్‌ ఔట్‌ చేశాడు. ఈ వికెట్‌తో ఇండియా తరఫున టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌కు ముందు చహల్‌తో కలిసి 85 వికెట్లతో సంయుక్తంగా టాప్‌లో ఉన్నాడు.

అఫ్రిది వికెట్‌తో భువీ వికెట్ల సంఖ్య 86కు చేరింది. ఇండియా తరఫున భువనేశ్వర్‌ ఇప్పటి వరకూ 80 టీ20లు ఆడాడు. ఈ మ్యాచ్‌లో యుజువేంద్ర చహల్‌ను టీమిండియా పక్కన పెట్టింది. అతనికి బదులుగా అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌లను స్పిన్నర్లుగా ఎంచుకుంది. అయితే అక్షర్‌ కేవలం ఒకే ఓవర్‌ వేయగా.. అశ్విన్‌ 3 ఓవర్లు వేశాడు.

పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో భువనేశ్వర్‌.. అర్ష్‌దీప్‌తో కలిసి మొదట్లోనే కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసి పాక్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. ఓవైపు భువీ పరుగులు కట్టడి చేయగా.. అర్ష్‌దీప్ వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో భువీ 4 ఓవర్లలో 22 రన్స్‌ ఇచ్చి ఒక వికెట్‌ తీసుకున్నాడు.

అయితే పాక్‌ భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నది మాత్రం అర్ష్‌దీప్‌, హార్దిక్‌ పాండ్యానే. వీళ్లిద్దరూ చెరో మూడు వికెట్లతో పాక్‌ను కట్టడి చేశాడు. దీంతో పాకిస్థాన్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 159 రన్స్‌ చేసింది. చేజింగ్‌లో ఒక దశలో 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఇండియా.. చివరికి విరాట్‌ కోహ్లి, హార్దిక్‌ పాండ్యా సూపర్‌ ఇన్నింగ్స్‌తో 4 వికెట్లతో గెలిచిన విషయం తెలిసిందే.

Whats_app_banner