తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Trolls On Rcb: బ్యాటింగ్ కేజీఎఫ్‌లాగా.. బౌలింగ్ కబ్జాలాగా.. ఆర్సీబీపై దారుణమైన ట్రోల్స్

Trolls on RCB: బ్యాటింగ్ కేజీఎఫ్‌లాగా.. బౌలింగ్ కబ్జాలాగా.. ఆర్సీబీపై దారుణమైన ట్రోల్స్

Hari Prasad S HT Telugu

12 April 2023, 15:15 IST

    • Trolls on RCB: బ్యాటింగ్ కేజీఎఫ్‌లాగా.. బౌలింగ్ కబ్జాలాగా.. అంటూ ఆర్సీబీపై దారుణమైన ట్రోల్స్ వస్తున్నాయి. లక్నో సూపర్ జెయింట్స్ పై గెలవాల్సిన మ్యాచ్ లో ఓడిపోవడంతో అభిమానులు ఆ టీమ్ ను ట్రోల్ చేస్తున్నారు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ (PTI)

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్

Trolls on RCB: ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) టీమ్ బ్యాటింగ్ ఎంత బలంగా ఉన్నా, ఎన్ని భారీ స్కోర్లు చేసినా.. వాళ్ల బౌలింగే కొంప ముంచుతోంది. మొన్న లక్నోతో మ్యాచ్ లోనూ 213 పరుగుల భారీ టార్గెట్ ను కూడా ఆర్సీబీ బౌలర్లు కాపాడుకోలేకపోయారు. దీంతో తీవ్రంగా నిరాశ చెందిన అభిమానులు.. ఆర్సీబీని ట్రోల్ చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

ఈ మధ్యే కన్నడ సినిమాలో సంచలనాలు క్రియేట్ చేసిన రెండు సినిమాలతో ఆర్సీబీని పోలుస్తూ ట్వీట్లు చేస్తున్నారు. సాండల్‌వుడ్ నుంచి వచ్చిన కేజీఎఫ్ రెండు భాగాలు ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి రికార్డులను సొంతం చేసుకుందో తెలుసు కదా. ముఖ్యంగా గతేడాది వచ్చిన కేజీఎఫ్ 2 అయితే కలెక్షన్ల వర్షం కురిపించింది. దీంతో అదే మూవీని స్ఫూర్తిగా తీసుకొని ఉపేంద్ర హీరోగా కబ్జా అనే సినిమా ఈ మధ్యే రిలీజైంది.

అయితే ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా పడింది. భారీ బడ్జెట్, ఎంతో హైప్ మధ్య రిలీజైన ఈ సినిమా అసలు అంచనాలను అందుకోలేకపోయింది. దీంతో నాలుగు వారాలుగా అభిమానులు ఈ కబ్జా మూవీని కూడా ట్రోల్ చేస్తున్నారు. కేజీఎఫ్ అంత బిల్డప్ ఇచ్చిన కబ్జా.. దానికి పూర్తి భిన్నమైన ఫలితం సాధించింది. ఈ పాయింట్ నే బేస్ చేసుకొని ఇప్పుడు ఆర్సీబీ ఫ్యాన్స్ తమ టీమ్ ను తిట్టిపోస్తున్నారు.

ఆర్సీబీ బ్యాటింగ్ కేజీఎఫ్ లాగా ఉన్నా.. బౌలింగే కబ్జాలాగా ఉందని, అందుకే ఈ ఓటములు ఎదురవుతున్నాయని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తుండటం విశేషం. బౌలింగ్ బలహీనంగా ఉండటంతో ఆర్సీబీ కీలకమైన సమయాల్లో బోల్తా పడుతోంది. 15 సీజన్లుగా టైటిల్ కు దూరమవుతోంది. గతంలో గేల్, డివిలియర్స్, కోహ్లి త్రయం ఉన్నా.. ఇప్పుడు కోహ్లి, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఫాఫ్ డుప్లెస్సి త్రయం ఉన్నా ఆర్సీబీ నిలకడగా విజయాలు సాధించలేకపోతోంది.

తదుపరి వ్యాసం