Kabzaa Trailer: క‌బ్జా ట్రైల‌ర్ - కేజీఎఫ్ సెట్‌లో తీసిన సినిమా అంటూ ఫ్యాన్స్ ట్రోల్స్‌-kabzaa trailer netizens compare upendra movie with yash kgf
Telugu News  /  Entertainment  /  Kabzaa Trailer Netizens Compare Upendra Movie With Yash Kgf
క‌బ్జా సినిమా
క‌బ్జా సినిమా

Kabzaa Trailer: క‌బ్జా ట్రైల‌ర్ - కేజీఎఫ్ సెట్‌లో తీసిన సినిమా అంటూ ఫ్యాన్స్ ట్రోల్స్‌

05 March 2023, 10:13 ISTNelki Naresh Kumar
05 March 2023, 10:13 IST

Kabzaa Trailer: క‌న్న‌డ స్టార్ హీరోలు ఉపేంద్ర‌, శివ‌రాజ్‌కుమార్‌, సుదీప్ హీరోలుగా న‌టించిన క‌బ్జా సినిమా మార్చి 17న రిలీజ్ కానుంది. ఆదివారం ఈ సినిమా ట్రైల‌ర్‌ను రిలీజ్ చేశారు.

Kabzaa Trailer: ఉపేంద్ర హీరోగా న‌టిస్తోన్న క‌బ్జా మూవీ ట్రైల‌ర్‌ను శ‌నివారం రిలీజ్ చేశారు. క‌న్న‌డ అగ్ర హీరోలు ఉపేంద్ర‌, శివ‌రాజ్‌కుమార్‌, సుదీప్ తొలిసారి క‌లిసి న‌టిస్తోన్న ఈ సినిమాకు చంద్రు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు. కంప్లీట్ పీరియాడిక‌ల్ లుక్‌, గ్రాండియ‌ర్ విజువ‌ల్స్‌తో క‌బ్జా ట్రైల‌ర్ ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

చ‌రిత్ర ఎప్పుడు తెగి ప‌డిన త‌ల‌ల కంటే ఆ త‌ల‌ల్నితీసిన చేతుల్నే పొగుడుతుంది. అలాంటి ఓ చేయి సృష్టించిన క‌థే క‌బ్జా అంటూ ట్రైల‌ర్‌లో డైలాగ్స్ ఆక‌ట్టుకుంటున్నాయి. ఈ సినిమా విజువ‌ల్స్‌, యాక్ష‌న్ ఎపిసోడ్స్ పూర్తిగా య‌శ్ హీరోగా న‌టించిన కేజీఎఫ్ సినిమాను గుర్తుకుతెస్తున్నాయి.

క‌బ్జాలో శ్రియ లుక్ కూడా కేజీఎఫ్‌లో శ్రీనిధిశెట్టిని పోలి క‌నిపిస్తోంది. హీరోలు ఉపేంద్ర, సుదీప్ ఎలివేష‌న్ సీన్స్‌ను కేజీఎఫ్ లో య‌శ్ సీన్స్‌ను త‌ల‌పిస్తున్నాయి. దాంతో క‌బ్జా ట్రైల‌ర్‌ను కేజీఎఫ్‌తో కంపేర్ చేస్తూ ఫ్యాన్స్ నెగెటివ్ కామెంట్స్ చేస్తోన్నారు. కేజీఎఫ్ సెట్‌లో క‌బ్జా సినిమాను తీసిన‌ట్లుగా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు.

కేజీఎఫ్ ట్రైల‌ర్ చూసిన‌ట్లుగానే ఉంద‌ని అంటున్నారు. ట్రైల‌ర్‌లోని చాలా ఫ్రేమ్స్ కేజీఎఫ్‌నే గుర్తుకు తెస్తున్నాయ‌ని ట్వీట్స్ చేస్తున్నారు. కేజీఎఫ్ రికార్డుల‌ను బ్రేక్ చేయ‌డం కోసం ముగ్గురు స్టార్ హీరోలు క‌లిసి తీసిన సినిమా ఇద‌ని అంటున్నారు.

కంపేరిజ‌న్స్‌కు కార‌ణం ఇదేనా

కేజీఎఫ్‌కు ప‌నిచేసిన టెక్నిక‌ల్ టీమ్ చాలా వ‌ర‌కు క‌బ్జా కోసం వ‌ర్క్ చేశారు. కేజీఎఫ్ విజ‌యంలో మ్యూజిక్ డైరెక్ట‌ర్ ర‌వి బ‌స్రూర్ పాత్ర ఉంది. క‌బ్జా సినిమాకు అత‌డే సంగీతాన్ని అందిస్తోన్నాడు. అలాగే కేజీఎఫ్‌కు ప‌నిచేసిన ఫైట్ మాస్ట‌ర్ విక్ర‌మ్ మోర్ క‌బ్జాకు యాక్ష‌న్ కంపోజ్ చేశాడు.

కేజీఎఫ్‌లో న‌టించిన ల‌క్కీ ల‌క్ష్మ‌ణ్‌తో పాటు మ‌రికొంద‌రు న‌టులు కూడా సిమిల‌ర్ లుక్‌లో క‌బ్జాలో క‌నిపించ‌డం వ‌ల్లే ఈ పోలిక‌లు వ‌స్తున్నాయ‌ని ఫ్యాన్స్ అంటున్నారు. క‌బ్జా సినిమా మార్చి 17న పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో రిలీజ్ కానుంది. ఈ సినిమాలో శ్రియ హీరోయిన్‌గా న‌టించింది.

టాపిక్