Kabzaa OTT Release Date: కబ్జా ఓటీటీలోకి వచ్చేస్తోంది.. రిలీజ్ డేట్ ఇదే-kabzaa ott release date announced by amazon prime video ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kabzaa Ott Release Date: కబ్జా ఓటీటీలోకి వచ్చేస్తోంది.. రిలీజ్ డేట్ ఇదే

Kabzaa OTT Release Date: కబ్జా ఓటీటీలోకి వచ్చేస్తోంది.. రిలీజ్ డేట్ ఇదే

Hari Prasad S HT Telugu
Apr 11, 2023 05:57 PM IST

Kabzaa OTT Release Date: కబ్జా ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ మూవీ స్ట్రీమింగ్ తేదీని అమెజాన్ ప్రైమ్ వీడియో మంగళవారం (ఏప్రిల్ 11) అధికారికంగా అనౌన్స్ చేసింది.

కబ్జా మూవీ
కబ్జా మూవీ

Kabzaa OTT Release Date: ఉపేంద్ర నటించిన కబ్జా మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఆర్ చంద్రు డైరెక్ట్ చేసిన ఈ గ్యాంగ్‌స్టర్ మూవీ మార్చి 17న రిలీజైన విషయం తెలిసిందే. ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడా ఓటీటీ ప్లాట్‌ఫామ్ అధికారికంగా స్ట్రీమింగ్ తేదీని అనౌన్స్ చేసింది.

ఇన్నాళ్లూ ఏప్రిల్ 14న ఈ మూవీ ప్రైమ్ వీడియోలో వస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడా ఓటీటీ కూడా అదే తేదీని అధికారికంగా ప్రకటించడం విశేషం. ఈ శుక్రవారం (ఏప్రిల్ 14) నుంచే కబ్జా మూవీ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ కానుంది. తెలుగుతోపాటు కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉండనుంది.

క‌న్న‌డ బ్లాక్‌బ‌స్ట‌ర్ కేజీఎఫ్‌కు పోటీగా రూపొందిన ఈ సినిమాకు ఆర్ చంద్రు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. టీజ‌ర్‌, ట్రైల‌ర్స్‌తో పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తాకొట్టింది. కేజీఎఫ్ ను పోలి క‌థ‌, యాక్ష‌న్ సీక్వెన్స్‌లు సాగ‌డంపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లొచ్చాయి.

రొటీన్ గ్యాంగ్‌స్ట‌ర్ పాయింట్ కావ‌డంతోనే మినిమం క‌లెక్ష‌న్స్ కూడా రాబ‌ట్ట‌లేకపోయింది. మార్చి 17న రిలీజైన క‌బ్జా సినిమా అన్ని భాష‌ల్లో క‌లిపి తొమ్మిది రోజుల్లో కేవ‌లం 32 కోట్ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన‌ట్లు స‌మాచారం.

110 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొంద‌గా అందులో స‌గం కూడా రాబ‌ట్ట‌లేక‌పోయింది. క‌న్న‌డ మిన‌హా మిగిలిన భాష‌ల్లో ఈ సినిమా ఫ‌స్ట్ వీక్‌లోనే థియేట‌ర్ల నుంచి ఎత్తేశారు. డిస్ట్రిబ్యూట‌ర్లు, ఎగ్జిబిట‌ర్ల‌కు ఈ సినిమా భారీగా న‌ష్టాల‌ను మిగిల్చిన‌ట్లు స‌మాచారం.

IPL_Entry_Point