తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Rp Singh On Siraj: సిరాజ్ మియాలో బుమ్రా, షమి ఇద్దరూ ఉన్నారు: వరల్డ్‌కప్ విన్నింగ్ బౌలర్ ప్రశంసలు

RP Singh on Siraj: సిరాజ్ మియాలో బుమ్రా, షమి ఇద్దరూ ఉన్నారు: వరల్డ్‌కప్ విన్నింగ్ బౌలర్ ప్రశంసలు

Hari Prasad S HT Telugu

05 May 2023, 9:54 IST

    • RP Singh on Siraj: సిరాజ్ మియాలో బుమ్రా, షమి ఇద్దరూ ఉన్నారంటూ వరల్డ్‌కప్ విన్నింగ్ బౌలర్ ప్రశంసలు కురిపించాడు. ఈ సీజన్ ఐపీఎల్లో అద్భుతంగా రాణిస్తున్న బుమ్రాను ఆర్పీ సింగ్ ఆకాశానికెత్తాడు.
మహ్మద్ షమి, సిరాజ్, బుమ్రా
మహ్మద్ షమి, సిరాజ్, బుమ్రా

మహ్మద్ షమి, సిరాజ్, బుమ్రా

RP Singh on Siraj: సిరాజ్ మియా ఈ సీజన్ ఐపీఎల్లో నెక్ట్స్ లెవల్లో బౌలింగ్ చేస్తున్నాడు. ఇంతకుముందు చూసిన సిరాజ్ కు, ఇప్పటి సిరాజ్ కు స్పష్టమైన తేడా కనిపిస్తోంది. దీంతో అతనిలో బుమ్రా, షమి ఇద్దరూ ఉన్నారంటూ 2007 టీ20 వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ సభ్యుడు ఆర్పీ సింగ్ ప్రశంసలు కురిపించాడు. ఈ హైదరాబాదీ పేస్ బౌలర్ ఐపీఎల్లో ఆర్సీబీ తరఫున ఆడుతున్న విషయం తెలిసిందే.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

ఆ టీమ్ బౌలింగ్ భారాన్ని సిరాజే మోస్తున్నాడు. కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్ తో బౌలింగ్ చేయడమే కాదు.. పరుగులు కట్టడి చేస్తూ వికెట్లు కూడా తీస్తున్నాడు. ఇప్పటి వరకూ 9 మ్యాచ్ లలో 15 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ టాప్ 5లో కొనసాగుతున్నాడు. ఎకానమీ కూడా 7.3 మాత్రమే ఉంది. ఆర్సీబీ పవర్ ప్లేలో ప్రత్యర్థిని కట్టడి చేస్తుండటానికి సిరాజే కారణం.

నిజానికి సిరాజ్ ను ఆర్సీబీ రిటెయిన్ చేసుకున్నప్పుడు చాలా మంది పెదవి విరిచారు. అతడు టీమిండియాకు ఆడుతున్నా కూడా నిలకడ లేనితనం, భారీగా పరుగులు ఇవ్వడంలాంటివి చేసేవాడు. గతేడాది పవర్ ప్లేలో అతని ఎకానమీ రేటు 10.23గా ఉంది. కానీ గతేడాది జూన్ నుంచి ఓ కొత్త సిరాజ్ కనిపిస్తున్నాడు. అప్పటి నుంచీ ఇప్పటి వరకూ ఇండియా తరఫున 20 వన్డేలు ఆడి 38 వికెట్లు తీశాడు.

అందులో కొత్త బంతితోనే 24 వికెట్లు ఉన్నాయి. వన్డే ర్యాంకుల్లో ఓ దశలో టాప్ ర్యాంక్ అందుకున్నాడు. ఇప్పుడదే ఫామ్ ను ఐపీఎల్లోనూ కొనసాగిస్తున్నాడు. దీంతో మాజీ పేస్ బౌలర్ ఆర్పీ సింగ్ అతనిపై ప్రశంసలు కురిపించాడు. ఫిట్‌నెస్ పై పనిచేయడంతోపాటు కొన్ని సాంకేతిక మార్పులు చేసుకోవడం వల్లే సిరాజ్ మెరుగ్గా బౌలింగ్ చేస్తున్నాడని చెప్పాడు.

"నేను చాలా కాలంగా సిరాజ్ ను ఫాలో అవుతున్నాను. అతడు ఇండియన్ టీమ్ లో చేరినప్పుడు సిరాజ్ గ్రాఫ్ చాలా హైలో ఉంది. తర్వాత మెల్లగా అది కిందికి దిగుతూ వచ్చింది. కానీ ఈసారి మాత్రం అతడు తన బౌలింగ్ ను చాలా మెరుగుపరచుకున్నాడు. ఫిట్‌నెస్ అందులో ప్రధానమైనది. తన రిస్ట్ పొజిషన్, ఫాలోత్రూ మెరుగవడంతోతోపాటు స్టంప్ టు స్టంప్ బౌలింగ్ చేస్తున్నాడు" అని ఆర్పీ సింగ్ అన్నాడు. "బుమ్రాకు ప్రత్యామ్నాయం సిరాజే. నిజానికి అతని గ్రాఫ్ ఇలాగే కొనసాగితే.. అతడే తర్వాతి మహ్మద్ షమి అవుతాడు" అని ఆర్పీ సింగ్ అనడం విశేషం.

తదుపరి వ్యాసం