Bumrah in IPL: బుమ్రా వచ్చేశాడు.. నరేంద్ర మోదీ స్టేడియంలో స్టార్ బౌలర్-bumrah in ipl as the star bowler watched the gt vs mi match ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Bumrah In Ipl: బుమ్రా వచ్చేశాడు.. నరేంద్ర మోదీ స్టేడియంలో స్టార్ బౌలర్

Bumrah in IPL: బుమ్రా వచ్చేశాడు.. నరేంద్ర మోదీ స్టేడియంలో స్టార్ బౌలర్

Hari Prasad S HT Telugu
Apr 25, 2023 08:51 PM IST

Bumrah in IPL: బుమ్రా వచ్చేశాడు.. నరేంద్ర మోదీ స్టేడియంలో స్టార్ బౌలర్ గుజరాత్ టైటన్స్, ముంబై ఇండియన్స్ మ్యాచ్ చూశాడు. అతడి ఫొటోను ముంబై ఇండియన్స్ తన ట్విటర్ లో షేర్ చేసింది.

నరేంద్ర మోదీ స్టేడియంలో బుమ్రా
నరేంద్ర మోదీ స్టేడియంలో బుమ్రా

Bumrah in IPL: టీమిండియా, ముంబై ఇండియన్స్ స్టార్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా చాలా రోజుల తర్వాత అభిమానుల ముందుకు వచ్చాడు. గతేడాది సెప్టెంబర్ నుంచి ఇండియన్ టీమ్ కు దూరంగా ఉన్న అతడు.. గాయం కారణంగా ఐపీఎల్ కు కూడా దూరమైన విషయం తెలిసిందే. అయితే మంగళవారం (ఏప్రిల్ 25) అతడు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటన్స్, ముంబై ఇండియన్స్ మ్యాచ్ చూడటానికి వచ్చాడు.

ఈ మ్యాచ్ లో అతడు తన టీమ్ ముంబై ఇండియన్స్ కు సపోర్ట్ చేస్తున్నాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందు బుమ్రా స్టాండ్స్ లో ఉన్న ఫొటోను ముంబై ఇండియన్స్ తన ట్విటర్ అకౌంట్లో షేర్ చేసింది. బూమ్ బూమ్.. బుమ్రా అనే క్యాప్షన్ తో ఈ ఫొటోను పంచుకుంది. బుమ్రా చాలా రోజులుగా వెన్ను గాయంతో బాధపడుతున్న విషయం తెలిసిందే.

గత నెలలోనే అతడు న్యూజిలాండ్ వెళ్లి గాయానికి సర్జరీ చేయించుకున్నాడు. గతేడాది ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్ తోపాటు ఈ ఏడాది స్వదేశంలో జరిగిన అన్ని ద్వైపాక్షిక సిరీస్ లకు దూరమయ్యాడు. ఈ మధ్యే సర్జరీ చేయించుకోవడంతో డబ్ల్యూటీసీ ఫైనల్ కు కూడా బుమ్రా దూరం కానున్నాడు. ఆరు వారాల పాటు అతడు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడెమీలో రీహ్యాబిలిటేషన్ కోసం ఉండనున్నాడు.

గత శుక్రవారమే అతడు ఎన్సీఏకు వెళ్లాడు. ఈ ఏడాది చివర్లో ఇండియాలో జరగబోయే వన్డే వరల్డ్ కప్ సమయానికి పూర్తి ఫిట్‌నెస్ సాధించాలని బుమ్రా భావిస్తున్నాడు. 2016లో ఇండియన్ టీమ్ తరఫున అరంగేట్రం చేసిన బుమ్రా ఇప్పటి వరకూ 30 టెస్టులు, 72 వన్డేలు, 60 టీ20లు ఆడాడు. ఇక ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ విజయాల్లోనూ అతడు కీలకపాత్ర పోషించాడు.

WhatsApp channel

సంబంధిత కథనం