తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Most Ducks In Ipl: ఐపీఎల్లో రోహిత్ పేరిట ఉన్న ఈ చెత్త రికార్డు గురించి తెలుసా?

Most Ducks in IPL: ఐపీఎల్లో రోహిత్ పేరిట ఉన్న ఈ చెత్త రికార్డు గురించి తెలుసా?

Hari Prasad S HT Telugu

24 March 2023, 17:28 IST

  • Most Ducks in IPL: ఐపీఎల్లో రోహిత్ శర్మ పేరిట ఉన్న ఓ చెత్త రికార్డు కూడా ఉంది. లీగ్ చరిత్రలో డెక్కన్ ఛార్జర్స్, ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన రోహిత్.. ఎన్నో గొప్ప రికార్డులతోపాటు ఈ చెత్త రికార్డునూ సొంతం చేసుకున్నాడు.

రోహిత్ శర్మ
రోహిత్ శర్మ

రోహిత్ శర్మ

Most Ducks in IPL: ఐపీఎల్ వస్తుందంటే చాలు రికార్డుల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. అత్యధిక రన్స్, అత్యధిక సెంచరీలు, ఫాస్టెస్ట్ సెంచరీలు, అత్యధిక సిక్స్ లు వంటి రికార్డుల గురించి చాలా మంది తెలుసు. అయితే ఈ మెగా లీగ్ లో ఎక్కువ సార్లు డకౌటైన ప్లేయర్స్ గురించి మీకు తెలుసా? ఇప్పటికే 15 సీజన్లు పూర్తి చేసుకున్న ఐపీఎల్లో పది కంటే ఎక్కువసార్లు డకౌటైన వాళ్లు చాలా మందే ఉన్నారు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

అందులో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఉండటం విశేషం. అత్యధిక పరుగులు, సిక్స్ లు, సెంచరీల రికార్డులతోపాటు ఐపీఎల్లో రోహిత్ పేరిట ఈ డకౌట్స్ రికార్డు కూడా ఉంది. 2008లో జరిగిన తొలి సీజన్ నుంచి ఐపీఎల్ ఆడుతున్న రోహిత్.. ఇప్పటి వరకూ 222 ఇన్నింగ్స్ ఆడాడు. అందులో ఏకంగా 14సార్లు డకౌటయ్యాడు. అత్యధిక డకౌట్స్ లిస్టులో అతడే టాప్ లో ఉండటం విశేషం.

అంతేకాదు ఈ డకౌట్స్ లిస్ట్ లో విదేశీ ప్లేయర్స్ కంటే ఇండియన్సే ఎక్కువగా ఉండటం గమనార్హం. ఐపీఎల్లో అత్యధిక సార్లు డకౌట్ అయిన టాప్ 10 లిస్టులో మొదటి 8 మంది ఇండియన్ బ్యాటర్లే. రోహిత్ తోపాటు రహానే, రాయుడులాంటి ప్లేయర్స్ ఈ లిస్ట్ లో ఉన్నారు.

ఐపీఎల్లో అత్యధిక డకౌట్స్

రోహిత్ శర్మ - 14

మణ్‌దీప్ సింగ్ - 14

పియూష్ చావ్లా - 13

హర్భజన్ సింగ్ - 13

పార్థివ్ పటేల్ - 13

అజింక్య రహానే - 13

అంబటి రాయుడు - 13

దినేష్ కార్తీక్ - 13

రషీద్ ఖాన్ - 12

సునీల్ నరైన్ - 12