తెలుగు న్యూస్ / ఫోటో /
Fastest Century in IPL: ఐపీఎల్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు ఎవరి పేరిట ఉందో తెలుసా?
- Fastest Century in IPL: ఐపీఎల్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు ఎవరి పేరిట ఉందో తెలుసా? మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ 16వ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో సెంచరీలు బాదిన ప్లేయర్స్, వాళ్ల రికార్డులు ఒకసారి చూద్దాం.
- Fastest Century in IPL: ఐపీఎల్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు ఎవరి పేరిట ఉందో తెలుసా? మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ 16వ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో సెంచరీలు బాదిన ప్లేయర్స్, వాళ్ల రికార్డులు ఒకసారి చూద్దాం.
(1 / 6)
Fastest Century in IPL: ఐపీఎల్లో 43 బంతుల్లోనే సెంచరీతో డేవిడ్ వార్నర్ ఆరో స్థానంలో ఉన్నాడు. అతడు 2017లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతూ కోల్‌కతా నైట్ రైడర్స్ పై 10 ఫోర్లు, 8 సిక్స్ లతో ఈ సెంచరీ చేశాడు.
(2 / 6)
Fastest Century in IPL: ఆర్సీబీ తరఫున ఆడిన ఏబీ డివిలియర్స్ కూడా 43 బంతుల్లోనే సెంచరీ చేశాడు. అతడు 2016లో గుజరాత్ లయన్స్ టీమ్ పై ఈ సెంచరీ చేయగా.. మొత్తం 12 సిక్స్ లు, 10 ఫోర్లతో 129 పరుగులు చేశాడు.
(3 / 6)
Fastest Century in IPL: ఐపీఎల్ తొలి సీజన్ అయిన 2008లోనే డెక్కన్ ఛార్జర్స్ తరఫున ఆడిన ఆడమ్ గిల్‌క్రిస్ట్ 42 బంతుల్లోనే సెంచరీ చేయడం విశేషం. అతడు 10 సిక్స్ లు, 9 ఫోర్లతో 109 పరుగులు చేశాడు.
(4 / 6)
Fastest Century in IPL: 2013లో అప్పటి కింగ్స్ పంజాబ్ తరఫున ఆడిన డేవిడ్ మిల్లర్ కేవలం 38 బంతుల్లోనే సెంచరీ బాదాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ పై అతడు 8 సిక్స్ లు, 7 ఫోర్లతో 101 రన్స్ చేశాడు.
(5 / 6)
Fastest Century in IPL: టీమిండియా మాజీ ప్లేయర్ యూసుఫ్ పఠాన్ 2010లో ముంబై ఇండియన్స్ పై 37 బంతుల్లో మూడంకెల స్కోరు అందుకున్నాడు. యూసుఫ్ ఇన్నింగ్స్ లో 8 సిక్స్ లు, 9 ఫోర్లు ఉన్నాయి.
(6 / 6)
Fastest Century in IPL: ఇక ఐపీఎల్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు క్రిస్ గేల్ పేరిట ఉంది. 2013లో అతడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున అప్పటి పుణె వారియర్స్ పై 30 బంతుల్లోనే సెంచరీ బాదాడు. అతని ఇన్నింగ్స్ లో ఏకంగా 17 సిక్స్ లు, 13 ఫోర్లు ఉన్నాయి. ఆ ఇన్నింగ్స్ లో గేల్ 175 రన్స్ చేశాడు. ఇదే ఇప్పటి వరకూ ఐపీఎల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు.
ఇతర గ్యాలరీలు