తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ipl 2023 Tickets Sales: ఐపీఎల్ టికెట్ల అమ్మకాలు షురూ.. సన్‌రైజర్స్ మ్యాచ్‌ల టికెట్లు, ఫ్రీ జెర్సీలు ఎక్కడ దొరుకుతాయంటే..

IPL 2023 Tickets Sales: ఐపీఎల్ టికెట్ల అమ్మకాలు షురూ.. సన్‌రైజర్స్ మ్యాచ్‌ల టికెట్లు, ఫ్రీ జెర్సీలు ఎక్కడ దొరుకుతాయంటే..

Hari Prasad S HT Telugu

24 March 2023, 16:35 IST

  • IPL 2023 Tickets Sales: ఐపీఎల్ టికెట్ల అమ్మకాలు షురూ అయ్యాయి. సన్‌రైజర్స్ మ్యాచ్‌ల టికెట్లు, ఫ్రీ జెర్సీలు ఎక్కడ దొరుకుతాయో ఆ ఫ్రాంఛైజీ ట్విటర్ అకౌంట్ ద్వారా అనౌన్స్ చేసింది.

ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ ప్రాక్టీస్
ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ ప్రాక్టీస్

ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ ప్రాక్టీస్

IPL 2023 Tickets Sales: ఐపీఎల్ 2023 మరో వారం రోజుల్లో ప్రారంభం కాబోతోంది. 16వ సీజన్ మార్చి 31 నుంచి జరగనున్న విషయం తెలిసిందే. తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటన్స్, నాలుగుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. దీంతో ఈ సీజన్ కోసం టికెట్ల అమ్మకాలు ప్రారంభమయ్యాయి.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

ఈసారి పాత పద్ధతిలోనే ఐపీఎల్ హోమ్, అవే పద్ధతిలో జరగనుంది. దీంతో తమ టీమ్స్ ఆడుతుంటే స్టేడియాల్లో చూడాలనుకుంటున్న లక్షలాది మంది అభిమానులు టికెట్ల కోసం ఎగబడుతున్నారు. ఇటు సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా మూడు సీజన్ల తర్వాత తన హోమ్ గ్రౌండ్ అయిన ఉప్పల్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆడనుంది.

టికెట్లు ఎక్కడ దొరుకుతాయంటే..

సన్ రైజర్స్ తన హోమ్ మ్యాచ్ ల కోసం టికెట్ల అమ్మకాలను ప్రారంభించింది. ఈ విషయాన్ని ఆ ఫ్రాంఛైజీ తన అధికారిక ట్విటర్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. శుక్రవారం (మార్చి 24) నుంచి ప్రతి రోజూ ఉదయం 11 నుంచి సాయంత్రం 6 గంటల వరకు టికెట్ల అమ్మకాలు ఉంటాయి.

సన్ రైజర్స్ మ్యాచ్ ల టికెట్లు మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్స్(Makers of Milkshakes), 24 సెవెన్(24 Seven) ఔట్‌లెట్లతోపాటు జింఖానా క్రికెట్ స్టేడియంలో అందుబాటులో ఉంటాయి. మేకర్స్ ఆఫ్ మిల్క్‌షేక్స్ కు చెందిన ఎల్బీ నగర్, దిల్‌సుఖ్ నగర్, హయత్ నగర్, తార్నాక, సింధీ కాలనీ, కేపీహెచ్‌బీ, మాధాపూర్, ఎస్సార్ నగర్, కొంపల్లి, డీడీ కాలనీ, బీహెచ్ఈఎల్, పద్మారావు నగర్, కాచిగూడ, సైనిక్‌పురి, మాసబ్ ట్యాంక్, ఫిల్మ్‌నగర్ ఔట్‌లెట్స్ లో ఉంటాయి.

ఇక 24 సెవెన్ విషయానికి వస్తే బంజారా హిల్స్, హైటెక్ హైస్ట్రీట్ స్టోర్, అమీర్‌పేట్, నిఫ్ట్ హై స్ట్రీట్ స్టోర్ లలో టికెట్లు లభిస్తాయి. జింఖానా క్రికెట్ స్టేడియంలోనూ టికెట్ల కోసం బాక్సాఫీస్ తెరిచినట్లు సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ వెల్లడించింది.

ఈ లొకేషన్లలో టికెట్లే కాదు.. అర్హులైన అభిమానులకు ఉచితంగా జెర్సీలు కూడా అందజేస్తారు. టికెట్లు హోమ్ డెలివరీ కావాలనుకుంటే.. టికెట్లతోపాటు వోచర్ కూడా వస్తుంది. దానిని దగ్గరలోని ఔట్‌లెట్ లో రిడీమ్ చేసుకోవచ్చు. సన్ రైజర్స్ హైదరాబాద్ తమ తొలి మ్యాచ్ ను ఏప్రిల్ 2న ఉప్పల్ స్టేడియంలోనే ఆడనుంది. ఈసారి కొత్త కెప్టెన్ ఏడెన్ మార్‌క్రమ్ సారథ్యంలో టీమ్ బరిలోకి దిగనుంది.

తదుపరి వ్యాసం