IPL Longest Six: ఐపీఎల్లో లాంగెస్ట్ సిక్స్ ఎవరు కొట్టారో తెలుసా.. 15 ఏళ్లుగా ఆ రికార్డు పదిలం
24 March 2023, 13:00 IST
IPL Longest Six: ఐపీఎల్లో లాంగెస్ట్ సిక్స్ ఎవరు కొట్టారో తెలుసా.. 15 ఏళ్లుగా ఆ రికార్డు పదిలంగా ఉంది. ఐపీఎల్ తొలి సీజన్ లో నమోదైన లాంగెస్ట్ సిక్స్ రికార్డు.. 15 సీజన్లలో ఎవరూ బ్రేక్ చేయలేకపోయారు.
ఆల్బీ మోర్కెల్
IPL Longest Six: టీ20 క్రికెట్ అంటేనే సిక్స్‌లు, ఫోర్లు. బౌలర్లను బ్యాటర్లు ఎంత బాదితే అభిమానులకు అంత మజా. పిచ్ పై పడిన బంతి గాల్లో ఎగిరి స్టాండ్స్ లో పడితే చూడాలని కోరుకోని అభిమాని ఉండడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అలాంటి భారీ సిక్స్ లు కొట్టిన బ్యాటర్లు ఎంతో మంది ఉన్నారు. గేల్, డివిలియర్స్, లివింగ్‌స్టోన్ లాంటి విధ్వంసకర బ్యాటర్లు ఐపీఎల్లో ప్రేక్షకులను అలరించారు.
అయితే లాంగెస్ట్ సిక్స్ రికార్డు మాత్రం వీళ్ల పేరిట లేదు. పైగా ఈ 15 సీజన్లలోనూ వీళ్లు ఆ రికార్డు దరిదాపుల్లోకి కూడా వెళ్లలేదు. ఐపీఎల్లో ఇప్పటి వరకూ నమోదైన లాంగెస్ట్ సిక్స్ ఏకంగా 125 మీటర్లు వెళ్లింది. 2008లో జరిగిన తొలి సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడిన ఆల్బీ మోర్కెల్ ఈ భారీ సిక్స్ కొట్టాడు. అప్పటి నుంచి లాంగెస్ట్ సిక్స్ రికార్డు అతని పేరిటే ఉంది.
ఐపీఎల్లో లాంగెస్ట్ సిక్స్‌లు ఇవే
ఆల్బీ మోర్కెల్ (2008) - 125 మీటర్లు
ప్రవీణ్ కుమార్ (2013) - 124 మీటర్లు
ఆడమ్ గిల్‌క్రిస్ట్ (2011) - 122 మీటర్లు
రాబిన్ ఉతప్ప (2010) - 120 మీటర్లు
క్రిస్ గేల్ (2013) - 119 మీటర్లు
యువరాజ్ సింగ్ (2009) - 119 మీటర్లు
రాస్ టేలర్ (2008) - 119 మీటర్లు
గౌతమ్ గంభీర్ (2013) - 117 మీటర్లు
బెన్ కటింగ్ (2016) - 117 మీటర్లు
లియామ్ లివింగ్‌స్టోన్ (2022) - 117 మీటర్లు