Gayle IPL Record: ఐపీఎల్‌లో నా రికార్డు బ్రేక్ చేసే సత్తా అతడికే ఉంది.. గేల్ షాకింగ్ నేమ్.. కోహ్లీ మాత్రం కాదు-chris gayle names surprising pick to break his ipl 175 runs record ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Gayle Ipl Record: ఐపీఎల్‌లో నా రికార్డు బ్రేక్ చేసే సత్తా అతడికే ఉంది.. గేల్ షాకింగ్ నేమ్.. కోహ్లీ మాత్రం కాదు

Gayle IPL Record: ఐపీఎల్‌లో నా రికార్డు బ్రేక్ చేసే సత్తా అతడికే ఉంది.. గేల్ షాకింగ్ నేమ్.. కోహ్లీ మాత్రం కాదు

Maragani Govardhan HT Telugu
Mar 18, 2023 10:28 PM IST

Gayle IPL Record: ఐపీఎల్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన గేల్ రికార్డును ఇప్పటి వరకు అధిగమించలేదు. అయితే ఈ విషయంపై స్పందించిన గేల్ తన రికార్డును బ్రేక్ చేసే దమ్ము ఓ భారత క్రికెటర్‌కే ఉందని తెలిపాడు.

క్రిస్ గేల్
క్రిస్ గేల్

Gayle IPL Record: ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) వస్తుందంటేనే క్రికెట్ అభిమానుల దృష్టంతా అటు వైపే ఉంటుంది. ముఖ్యంగా ఐపీఎల్‌లో నమోదయ్యే రికార్డులపై ప్రత్యేకమైన ఫోకస్ ఉంటుంది. అయితే ఎన్ని ఘనతలు నమోదైనప్పటికీ క్రిస్ గేల్ అత్యధిక స్కోరు 175 పరుగుల రికార్డును మాత్రం అధిగమించడం మాత్రం చాలా కష్టం. ఎంతో మంది ఆటగాళ్లు ప్రయత్నించినప్పటికీ ఇంతవరకు ఎవ్వరూ సాధించలేకపోయారు. తాజాగా ఈ అంశంపై క్రిస్ గేల్ స్పందించాడు. తన రికార్డును బ్రేక్ చేయడం ఓ భారత క్రికెటర్ వల్లే అవుతుందని స్పష్టం చేశాడు. ఇంతకీ గేల్ చెప్పిన భారత ఆటగాడు కోహ్లీనో, రోహిత్ శర్మనో అనుకుంటే పొరపాటే. తన రికార్డును లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ వల్ల మాత్రమే సాధ్యమవుతుందని స్పష్టం చేశాడు.

"నాకు తెలిసి నా రికార్డును అధిగమించేది కేఎల్ రాహుల్ అనే అనుకుంటున్నాను. తనదైన రోజున అతడు ఏదైనా సాధించగలడు. అతడు తన సామర్థ్యాన్ని పూర్తిగా విశ్వసిస్తున్నాడని నేను అనుకోవట్లేదు. కానీ నా మాట వినండం కేఎల్ రాహుల్‌ను దగ్గరనుండి చూశాను. అతడు తలచుకుంటే కొన్నిసార్లు కాకపోయినా, ఇంకొన్ని సార్లయినా కచ్చితంగా అద్భుతం చేస్తాడు." అని క్రిస్ గేల్ అన్నాడు.

మ్యాచ్ చివరకు వచ్చేసరికి అతడు మరింత డేంజరస్‌గా మారతాడని కేఎల్ రాహుల్ గురించి గేల్ కితాబిచ్చాడు. "రాహుల్ తలచుకుంటే రికార్డులను సునాయసంగా ఛేజిక్కించుకోగలడు. ఎందుకంటే 15 నుంచి 20వ ఓవర్ సమయంలో అతడు చాలా ప్రమాదకరం. డెత్ బౌలింగ్‌లో చాలా తెలివిగా బ్యాటింగ్ చేస్తాడు. అతడికి సరైన ఆరంభం దక్కితే భారీ సెంచరీ చేయగల సామర్థ్యముంది. కాబట్టి 175 పరుగుల రికార్డును తప్పకుండా అధిగమించగలడు." అని గేల్ చెప్పాడు.

ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్‌లో కేఎల్ రాహుల్ పెద్దగా ప్రభావం చూపలేదు. అయితే శుక్రవారం ఆసీస్‌తో తొలి వన్డేలో అదిరిపోయే ప్రదర్శన చేశాడు. అద్భుత అర్ధశతకంతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు దిగిన అతడు 75 పరుగులతో నాటౌట్‌గా నిలవడమే కాకుండా టీమిండియా గెలుపులో కీలక పాత్ర పోషించాడు.

WhatsApp channel