IPL Auction 2023 Most Expensive Player: ఈసారి రూ.20 కోట్లు పక్కా.. ఆ ప్లేయర్‌ అతడే అంటున్న రైనా, గేల్‌-ipl auction 2023 most expensive player will be cameron green says experts ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Ipl Auction 2023 Most Expensive Player Will Be Cameron Green Says Experts

IPL Auction 2023 Most Expensive Player: ఈసారి రూ.20 కోట్లు పక్కా.. ఆ ప్లేయర్‌ అతడే అంటున్న రైనా, గేల్‌

Hari Prasad S HT Telugu
Dec 23, 2022 10:26 AM IST

IPL Auction 2023 Most Expensive Player: ఈసారి రూ.20 కోట్లు పక్కా అంటూ ఐపీఎల్‌ వేలం 2023లో అత్యధిక ధర పలకబోయే ప్లేయర్‌ గురించి అంచనా వేశారు మాజీ క్రికెటర్లు రైనా, గేల్‌, కుంబ్లే, మోర్గాన్‌. ఇంతకీ ఆ ప్లేయర్‌ ఎవరు?

ఐపీఎల్ 2023 వేలం
ఐపీఎల్ 2023 వేలం

IPL Auction 2023 Most Expensive Player: ఐపీఎల్‌ వేలం జరుగుతుందంటే చాలు.. ఎవరికి ఎన్ని కోట్లు? అత్యధిక ధర పలికే ప్లేయర్‌ ఎవరు? ఏ టీమ్‌ ఎవరిని తీసుకుంటుంది? వంటి వాటిపై జోరుగా చర్చలు జరుగుతుంటాయి. ఇప్పుడు ఐపీఎల్‌ 2023 కోసం శుక్రవారం (డిసెంబర్‌ 23) మినీ వేలం జరగబోతోంది. మరి ఈ సారి వేలంలో అత్యధిక ధర పలకబోయే ప్లేయర్‌ ఎవరు? ఎంత ధర పలుకుతాడు అన్న ఆసక్తి సహజంగానే అభిమానుల్లో ఉంటుంది.

ట్రెండింగ్ వార్తలు

దీనికి ఐపీఎల్‌ 2023 వేలం ఎక్స్‌పర్ట్స్‌ ప్యానెల్‌లో ఉన్న క్రిస్‌ గేల్‌, సురేశ్‌ రైనా, ఏబీ డివిలియర్స్‌, మోర్గాన్‌, కుంబ్లేలాంటి వాళ్లు సమాధానం చెబుతున్నారు. వాళ్ల ప్రకారం ఈసారి అన్ని రికార్డులు బ్రేక్‌ కానున్నాయి. ఈ ఎక్స్‌పర్ట్స్‌ ప్రకారం.. ఈసారి అత్యధిక ధర రూ.20 కోట్లు కానుందట.

ఎవరా అత్యధిక ధర పలికే ప్లేయర్‌?

జియోసినిమా ఐపీఎల్‌ 2023 వేలం ఎక్స్‌పర్ట్స్‌ ప్యానెల్‌లో ఉన్న గేల్‌, రైనా, మోర్గాన్‌, కుంబ్లేలు ఈసారి ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ కామెరాన్‌ గ్రీన్‌ అత్యధిక ధర పలకబోయే ప్లేయర్‌గా ఉంటాడని అంచనా వేస్తున్నారు. అంతేకాదు ఈ ప్యానెల్‌ వాళ్లు నిర్వహించిన నమూనా వేలంలో న్యూజిలాండ్‌ ఆల్‌రౌండర్‌ స్కాట్‌ స్టైరిస్‌ అయితే కామెరాన్‌ గ్రీన్‌ను ఏకంగా రూ.20 కోట్లకు కొనుగోలు చేశాడు.

దీనిపై గేల్‌ స్పందిస్తూ.. మరీ స్టైరిస్‌ ఇచ్చినంత మొత్తం కాకపోయినా.. వేలంలో గ్రీన్ పెద్ద మొత్తానికే అమ్ముడువుతాడని అంచనా వేశాడు. ఇండియన్‌ పిచ్‌లు గ్రీన్‌కు సూటవుతాయా లేదా అని ఐపీఎల్‌ జట్లు అంచనా వేయాలని కూడా సూచించాడు. గ్రీన్‌ కోసం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ గట్టిగా ప్రయత్నిస్తుందని చెప్పాడు. బెన్‌ స్టోక్స్‌ కంటే కూడా గ్రీన్‌ కోసమే సన్‌రైజర్స్‌ ఎక్కువగా ప్రయత్నించవచ్చని అన్నాడు.

ఈ సమయంలో ప్యానెల్‌లోనే ఉన్న రాబిన్‌ ఉతప్ప స్పందిస్తూ.. గ్రీన్‌ కోసం ఢిల్లీ క్యాపిటల్స్‌ కూడా ప్రయత్నించవచ్చని చెప్పాడు. ఆ టీమ్‌కు రికీ పాంటింగ్‌ కోచ్ కావడం వల్ల ఈ ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ కోసం చూడొచ్చని తెలిపాడు. అయితే ఈ వేలంలో అత్యధిక కొనుగోలు పరిమితి ఉన్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు బెన్‌ స్టోక్స్‌, గ్రీన్‌లాంటి ప్లేయర్స్‌ కోసం చివరిదాకా ప్రయత్నించే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి.

ఏ టీమ్‌ దగ్గర ఎంత మొత్తం?

సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ - రూ.42.25 కోట్లు

పంజాబ్‌ కింగ్స్ - రూ.32.20 కోట్లు

లక్నో సూపర్‌ జెయింట్స్‌ - రూ.23.35 కోట్లు

ముంబై ఇండియన్స్‌ - రూ.20.55 కోట్లు

చెన్నై సూపర్‌ కింగ్స్‌ - రూ.20.45 కోట్లు

ఢిల్లీ క్యాపిటల్స్‌ - రూ.19.45 కోట్లు

గుజరాత్‌ టైటన్స్‌ - రూ.19.25 కోట్లు

రాజస్థాన్‌ రాయల్స్‌ - రూ.13.2 కోట్లు

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు - రూ.8.75 కోట్లు

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ - రూ.7.05 కోట్లు

WhatsApp channel